ఫాల్టీ నెంబర్ ప్లేట్‌లు ఉపయోగిస్తే భారీ జరిమానా కట్టాల్సిందే

Posted by:

మోటారిస్టులు తమ వాహనాల నెంబర్ ప్లేట్లను తమకు నచ్చిన విధంగా, వివిధ రకాలు ఫాంట్‌లు, ఫోటోలు, స్టయిల్స్‌తో తయారు చేయించుకుంటుంటారు. అయితే, మోటార్ వాహన చట్టం ప్రకారం, నెంబర్ ప్లేట్లు అడ్డదిడ్డంగా ఉండటం నేరం. అక్షరాలు, అంకెల అమరికకు సంబంధించి, ఫాంట్ సైజ్ గురించి నిర్ధేశిత ప్రమాణాలు ఉన్నాయి. వాటిని అతిమక్రించి ఇష్టం వచ్చినట్లుగా నెంబర్ ప్లేట్లను ఉపయోగిస్తే, జరిమానా కట్టక తప్పదు.

అక్రమ నెంబర్ ప్లేట్లు ఉపయోగించేవారు, తయారు చేసేవారిపై ఇటీవలే హైదరాబాద్ సిటీ పోలీసులు ఓ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. ఇలాంటి అడ్డదిడ్డమైన నెంబర్ ప్లేట్లను ఉపయోగించే వారినే కాకుండా, వాటిని తయారు చేసే వారిపై కూడా కేసులు బుక్ చేశారు. అక్రమ నెంబర్ ప్లేట్ల తయారీదారులు, డీలర్లు వీటి తయారీలో నిబంధనలు పాటించకపోయినట్లయితే, వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేయటమే కాకుండా షాపులను సీజ్ కూడా చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

సాధారణంగా, ట్రాఫిక్ అధికారులు సిఫారసు చేసే ఫాంట్ టైమ్స్ న్యూ రోమన్, ఏరియల్ బ్లాక్ (Times New Roman and Ariel Black). నెంబర్ ప్లేట్లు ఈ ఫాంట్‌లో నిర్ధిష్ట పరిమాణం, క్రమంలో మాత్రమే ఉండాలి. అయితే, కొందరు బడా బాబులు మాత్రం తమని పోలీసులు ఏంచేస్తారులే అనో, ఆ.. అసలు వాళ్లకి చిక్కేదెవరులే అనో తమకు నచ్చిన రీతిలో ఫాంట్‌లను ఉపయోగించి నెంబర్ ప్లేట్లను తయారు చేయిస్తుంటారు.

మోటార్ వాహన చట్ట ప్రకారం, నెంబర్ ప్లేట్‌పై కేవలం వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ తప్ప మరేమి ఉండకుడదు (క్వోట్‌లు, పేర్లు, ఫోటోలు, చిత్రాలు మొదలైనవి). ఈ నిబంధను అతిక్రమించినట్లయితే, దానిని చట్ట విరుద్ధంగా పరిగణించి, భారీ జరిమానాలు విధించడం జరుగుతుంది. ఈ జరిమానా రూ.500 నుంచి రూ.5,000 వరకూ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎంబోస్డ్ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగిస్తే, అసలు ఎలాంటి సమస్య ఉండదు.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Monday, September 17, 2012, 12:25 [IST]
English summary
The fine on using faulty number plates on vehicles has been increased to Rs.5,000. According to the Motor Vehicle Act, the number plates must have specific fonts and size, but many people use a variety of fonts and sizes.
Please Wait while comments are loading...

Latest Photos