ఫెరారీ సూపర్‌కారును ఓవర్‌టేక్ చేసిన సైకిల్

By Ravi

అత్యంత శక్తివంతమైన ఫెరారీ కారును ఓ సైకిల్ ఓవర్‌టేక్ చేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే, ఆ సైకిల్ సాదాసీదా సైకిల్ కాదు. జెట్ ఇంజన్ కలిగిన సైకిల్. ఈ విశిష్టమైన సైకిల్‌కి, ఫెరారీ ఎఫ్430 స్కుడెరియా కారుకి మధ్య నిర్వహించిన ఓ రేసులో సైకిలే అత్యంత వేగంగా పరుగులు తీసి, విజేతగా నిలిచింది.

ఫెరారీ ఎఫ్430 స్కుడెరియా మరియు రాకెట్ పవర్డ్ సైకిల్ డ్రాగ్ రేసులో ఈ సైకిల్ గంటకు గరిష్టంగా 333 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసింది. ఫెరారీ కారు కన్నా సైకిల్ తేలిక బరువును కలిగి ఉండటం, ఇందులో జెట్ ఇంజన్‌ను ఉపయోగించడం వలన ఇంత వేగం సాధ్యమైంది. ఈ జెట్ పవర్డ్ సైకిల్‌ను ఫ్రెంచ్ వ్యక్తి ఆర్నాల్డ్ నెరాకర్ అభివృద్ధి చేశారు.

డ్రాగ్ రేసులో ఈ జెట్ పవర్డ్ సైకిల్‌ని ఫ్రాంకోయిస్ గిస్సీ నడిపారు. హైడ్రోజెన్ పెరాక్సైడ్ మరియు కంప్రెస్డ్ ఎయిర్‌ల కలయికతో కూడిన ఇంధనాన్ని ఉపయోగించి, ఈ జెట్ పవర్డ్ సైకిల్‌ని నడిపారు. మరి ఆ డ్రాగ్ రేస్ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/WREyAicJXkM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
In our video of the day we have a Ferrari F430 Scuderia drag racing a bicycle. This is no ordinary cycle, it is jet powered and can achieve a top speed of 333 km/h. It will be interesting to see who is the winner of this race.&#13;
Story first published: Wednesday, November 12, 2014, 16:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X