బార్సెలోనా సమీపంలో ఫెరారీ ల్యాండ్ థీమ్‌పార్క్

By Ravi

ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ ఫెరారీ, బార్సెలోనా ప్రాంతానికి చేరువలో ఓ సరికొత్త థీమ్ పార్క్‌ని ఏర్పాటు చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనంలో చదువుకున్నాం. కాగా.. ఈ థీమ్ పార్క్ నిర్మాణ పనులను ప్రారంభించామని, 2016 నాటికి ఇది పూర్తవుతుందని కంపెనీ పేర్కొంది.

ఈ థీమ్ పార్క్‌కి 'ఫెరారీ ల్యాండ్' అనే పేరును పెట్టనున్నారు. మొత్తం 75,000 చ.మీ. విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫెరారీ ల్యాండ్‌లో ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన మరియు అత్యంత ఎత్తయిన రోలర్ కోస్టర్ రైడ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఫెరారీ ఇప్పటికే దుబాయ్‌లో ఫెరారీ వరల్డ్ పేరిట ఓ థీమ్ పార్క్‌ని 2010లో ఏర్పాటు చేసింది. ఈ థీమ్ పార్క్ ప్రతి ఏటా 40 లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. మరి స్పెయిన్‌లో కొత్తగా ఏర్పాటవుతున్న ఈ ఫెరారీ థీమ్ పార్క్‌లోని విశేషాలను ఈ కథనంలో చూద్దా రండి!

ఫెరారీ ల్యాండ్ థీమ్‌పార్క్

ఫెరారీ థీమ్ పార్క్‌లో బిల్డింగ్ డిజైన్ నుంచి అందులోని రైడ్స్ వరకూ అన్ని కూడా అణువణువునా ఫెరారీ థీమ్‌ను తలపిస్తాయి.

ఫెరారీ ల్యాండ్ థీమ్‌పార్క్

చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్లు సైతం తమ వయస్సును మర్చిపోయి ఆహ్లాదంగా ఎంజాయ్ చేయటానికి ఫెరారీ థీమ్ పార్క్ ఓ చక్కటి ప్రదేశం.

ఫెరారీ ల్యాండ్ థీమ్‌పార్క్

మొత్తం పద్దెనిమిదిన్నర ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఫెరారీ థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. బార్సెలోనా నగర శివార్లలో ఈ ఫెరాపోర్ట్ అవెన్యూ రిసోర్ట్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించనున్నారు. గతంలో డ్యుకాటి ఓనర్ అయిన పోర్ట్ అవెన్యూ, 2012లో మూడొంతుల ఆస్టన్ మార్టిన్ వాటాలను కొనుగోలు చేసింది.

ఫెరారీ ల్యాండ్ థీమ్‌పార్క్

స్పెయిన్‌లో ఫెరారీ థీమ్ పార్క్ కోసం 100 మిలియన్ యూరోల పెట్టుబడిని వెచ్చించనున్నారు.

ఫెరారీ ల్యాండ్ థీమ్‌పార్క్

ఫెరారీ థీమ్ పార్క్‌లో ఫెరారీ థీమ్‌తో కూడిన ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రేస్ సిమ్యులేటర్లతో కూడిన 250 గదులు ఉంటాయి.

ఫెరారీ ల్యాండ్ థీమ్‌పార్క్

ఫెరారీ థీమ్ పార్క్‌లో దాదాపుగా అన్ని రకాల ఫెరారీ సూపర్‌కార్లను ప్రదర్శనకు ఉంచుతారు.

ఫెరారీ వరల్డ్ ల్యాండ్ థీమ్‌పార్క్

దుబాయ్‌లో ఏర్పాటు చేసిన ఫెరారీ వరల్డ్ థీమ్ పార్క్ ఓవర్‌వ్యూ ఫొటో ఇది.

Most Read Articles

English summary
Italian supercar manufacturer Ferrari, has announced the construction of Ferrari Land, a theme park near Barcelona. It will cover an area of 75,000 sq meters.
Story first published: Tuesday, November 18, 2014, 9:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X