మొట్టమొదటి ఫెరారీ లాఫెరారీ కారు యాక్సిడెంట్..

By Ravi

రూ.50,000 పెట్టి కొనుగోలు చేసిన బైక్‌కు చిన్న గీత పడితేనే మనం విలవిలాడిపోతాం. అలాంటిది కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఫెరారీ వంటి కార్లు యాక్సిడెంట్‌కు గురై నుజ్జునుజ్జయితే, ఇక బాధ మాటల్లో వర్ణించడానికి సాధ్యం కాదు. అనుభవం/అవగాహన లేని కొందరు డ్రైవర్లు సూపర్ కార్లను కంట్రోల్ చేయలేక వాటిని ప్రమాదాలకు గురి చేస్తుంటారు.

ఇటాలియన్ కార్ కంపెనీ ఫెరారీ గడచిన సంవత్సరం జెనీవాలో జరిగిన 2013 అంతర్జాతీయ మోటార్ షోలో ఆవిష్కరించిన లిమిటెడ్ ఎడిషన్ 'ఫెరారీ లాఫెరారీ' మొట్టమొదటి యాక్సిడెంట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా ఫెరారీ లాఫెరారీ యాక్సిడెంట్‌కు గరైనట్లు సమాచారం లేదు. ఇదొక లిమిటెడ్ ఎడిషన్.

ఈ మోడల్ విషయంలో ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం, ఫెరారీ కేవలం 499 లాఫెరారీ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. అందులో ఇది కూడా ఒకటి. బహుశా ఫస్ట్ లాఫెరారీ యాక్సిడెంట్ ఇదేనేమో.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫెరారీ లాఫెరారీ

సూపర్‌కార్లకు యూరోపియన్ క్యాపిటల్ అయిన మోంట్ కార్లో వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రపంచంలో కెల్లా ఇదే మొట్టమొదటి ఫెరారీ లాఫెరారీ కారు ప్రమాదంగా పరిగణిస్తున్నారు.

ఫెరారీ లాఫెరారీ

మోంట్ కార్లలోని ఓ జంక్షన్ వద్ద ఓ ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ కారు, ఫెరారీ లాఫెరారీ కారు ఒకదానికొకటి ఎదురెదురుగా గుద్దుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు డ్యామేజ్ అయ్యాయి.

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ లాఫెరారీ కారు బాడీని కార్భన్ ఫైబర్ మెటీరియల్‌తో తయారు చేయటంతో ప్రమాదంలో సూపర్‌కారు ముందు వైపు భాగం ఎక్కువగా దెబ్బతిన్నది. దీనిని రిపేరు చేసే ఖర్చుతో ఓ కొత్త ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ కారును కొనుక్కోవచ్చట. ఫెరారీ లాఫెరారీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ ఎన్జో మోడల్‌కు సక్సెసర్‌గా వచ్చిన లాఫెరారీ ఉత్పత్తి కేవలం 499 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో ఇప్పటికే ఈ మోడల్‌కు 100 శాతం బుకింగ్‌లు పూర్తయినట్లు సమాచారం.

ఫెరారీ లాఫెరారీ

ఫెరారీ నుంచి లభిస్తున్న అత్యంత వేగంతమైన ఉత్పత్తి వెర్షన్ కార్లలో లాఫెరారీదే అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు, ఫెరారీ కార్లలో కెల్లా అత్యంత ఖరీదైన కారు కూడా ఇదే. దీని ధర 14 లక్షల డాలర్లు. (మన కరెన్సీలో సుమారు రూ.7 కోట్లకు పైమాటే).

ఫెరారీ లాఫెరారీ

లాఫెరారీ ఒక హైబ్రిడ్ కారు. ఇది డ్యూయెల్ పవర్ (పెట్రోల్ + బ్యాటరీ)తో పనిచేస్తుంది. ఇందులో 6.3 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9000 ఆర్‌పిఎమ్ వద్ద 800 హెచ్‌పిల గరిష్ట శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 700 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. అలాగే ఇందులో అమర్చిన 120 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 163 హెచ్‌‌పిల గరిష్ట శక్తిని, 270 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫెరారీ లాఫెరారీ

పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండు కలిసి గరిష్టంగా 963 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తాయి. లాఫెరారీ హైపర్‌కారు కేవలం 3 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15 సెకండ్లలో 0-300 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది రిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

Most Read Articles

English summary
The first ever Ferrari LaFerrari cars in the world has took place in Monte Carlo. This $1.4 million Ferrari LaFerrari met with head on collision with Volkswagen Golf.
Story first published: Tuesday, July 1, 2014, 17:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X