మన హైదరాబాదులో ప్రాణం పోసుకున్న భారత దేశపు తొలి మేడియన్ ఇండియా రైలు "మేథా"

Written By:

ఏప్రిల్ 16, 1853 లో స్థాపించబడి, 1951 లో చిన్న చిన్న రైల్వే శాఖలన్నింటిని కలుపుకొని ఇండియన్ రైల్వేగా జాతీయం చెంది ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే సంస్థగా ఆవిర్బవించిన ఇండియన్ రైల్వే యొక్క మొట్టమొదటి మేడిన్ ఇండియా రైలు గురించి మరిన్ని వివరాలు నేటి రైలు సెక్షన్ ద్వారా తెలుసుకుందాం రండి...

కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌ,, శ్రీ సురేశ్ ప్రభు గారు భారతదేశపు మొట్టమొదటి మేడియన్ ఇండియా రైలు "మేధా"ను ముంబాయ్ వేదికగా జెండా ఊపి ప్రారంభించారు.

మేధా రైలును ఇండియన్ రైల్వే తమ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (IFC) చెన్నైలో తయారు చేసింది. ఇందులో స్పెషల్ త్రీ-ఫేస్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను అందివ్వడం జరిగింది. గతంలో ఇండియన్ రైల్వే బాంబర్‌డైయర్ లేదంటే సైమెన్స్ సంస్థలకు చెందిన ఇఎమ్‌యులను వినియోగించేది.

దేశీయంగా తయారైన రైలు ద్వారా సుమారుగా 50 లక్షల అమెరికన్ డాలర్ల కరెన్సీన్ ఆదా అయ్యింది. సాధారణ రైలు కన్నా ఈ మేడిన్ ఇండియా రైలును 25 శాతం తక్కువ ధరతో తయారు చేసినట్లు తెలిసింది.

ఇంజన్, 12 కోచ్‌లతో పాటు ఈ మేధా రైలు పట్టాలెక్కడానికి రూ. 43.23 కోట్లు రుపాయలు మాత్రమే ఖర్చు చేసినట్లు ఇండియన్ రైల్వే తెలిపింది.

ఇదే వేదిక మీదుగా కేంద్ర రైల్వే మంత్రి అంత్యోదయ రైలును లోకమాన్య తిలక్ మరియు టాటా నగర్‌ల మధ్య జెండా ఊపి ప్రారంభించారు. రిజర్వేషన్ చేసుకోని ప్రయాణికులకు కూడా అదే తరహా సౌకర్యాలను కల్పిస్తూ ఈ సర్వీసును ప్రారంభించినట్లు సురేశ్ ప్రభు గారు తెలిపారు.

మేధా రైలులో అత్యంత శక్తివంతమైన మేడిన్ ఇండియా త్రీ-ఫేస్ ప్రొపల్షన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. హైదరాబాద్ ఆధారిత మేధా సర్వో డ్రైవ్ సంస్థ ఈ సిస్టమ్‌ను తయారు చేసింది. అందుకుగాను, ఈ రైలుకు మేధా అని పేరు పెట్టారు.

ప్రయాణం సమయంలో రైలు పెట్టెలు డ్యామేజ్‌కు గురికాకుండా ఇన్ బిల్ట్ సిస్టమ్ ద్వారా తక్కువ ప్రమాద రేటును నమోదు చేసేలా నిర్మించారు. ఈ రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

మొదటి శ్రేణి కోచ్‌లలో మెత్తటి కుషనింగ్ గల సీట్లను మరియు ద్వితీయ శ్రేణి కోచ్‌లలో స్టెయిన్ లెస్ స్టీల్ సీట్లను ఈ మేధా రైలులో అందివ్వడం జరిగింది.

స్టెయిన్ లెస్ స్టీల్ భోగీలలో సులభంగా ప్రక్కకు జరపడం మరియు తక్కువ బరువున్న డోర్లను, ఎల్ఇడి లైట్లు, అత్యుత్తమ ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్, జిపిఎస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ‌లతో పాటు అత్యుత్తమ గాలి ప్రసరణ కోసం మోడ్యులర్ రూఫ్ మౌంటెడ్ ఫోర్స్ వెంటిలేషన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #రైలు #rail
Story first published: Monday, March 20, 2017, 18:01 [IST]
English summary
Also Read In Telugu: First Made In India Train ‘Medha’ Flagged Off
Please Wait while comments are loading...

Latest Photos