100 కు పైబడి లగ్జరీ కార్లను కలిగి ఉన్న కింగ్ బాక్సర్ ప్లాయిడ్ మేవెథర్

By N Kumar

ప్రపంచ బాక్సింగ్ కింగ్ అయిన ఫ్లాయిడ్ మేవెథర్ తన హస్త ముద్రలతో ప్రత్యర్థిని మట్టి కరిపించగలడు, తన పంచ్‌లకు ఎంతో మంది అతనికి అభిమానులైపోయారు. ఇతని గురించి మనం సాదారణంగా ఇలా మాట్లాడుకుంటాం, కాని అతను తన గురించి ఇలా అంటున్నాడు: బాక్సింగ్ ద్వారా సంపాదించిన డబ్బును నేను ఎక్కువగా ప్రేమించే కార్లను కొనుగోలు చేయడానికి వినియోగిస్తానని తెలిపాడు.

ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైబడి లగ్జరీ కార్లను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. అంతేనా అది కూడా 100 కార్లను ఒకే డీలర్ వద్ద కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇతని వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కార్ల గురించి మరిని ఊహించని రీతిలో తన కారు గ్యారేజి వెనకున్న విశయాల గురించి మరింత సమాచారం క్రింది కథనంలో కలదు.

బుగట్టి చిరాన్

బుగట్టి చిరాన్

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఎక్కువగా ఇష్టపడే కారు ఇదే. అంతే కాదు ఉత్పత్తి సామర్థ్యం పరంగా అత్యంత ఖరీదైన కార్లలో బుగాటి వారి వేయార్న్ కారు ముందు స్థానంలో. దీనికి కొనసాగింపుగా వచ్చిందే ఈ చిరాన్ కారు.

చిరాన్ ఇంజన్ వివరాలు

చిరాన్ ఇంజన్ వివరాలు

బుగాటి చిరాన్ కారులో 8.0-లీటర్ కెపాసిటి గల డబ్ల్యూ 16 ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 1,479 బిహెచ్‌పి పవర్ మరియు 1,600 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో ఉన్న డ్యూయల్ క్లచ్ గేర్ బాక్స్ ద్వారా మొత్తం పవర 4-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు అందుతుంది.

 బరువు

బరువు

కారు బాడీ మొత్తాన్ని కార్బన్ ఫైబర్‌ మెటీరియల్‌తో తయారు చేశారు. అందులన దీనిని కేవలం 1,995 కిలోల బరువుతోనే రూపొందించగలిగారు.

గరిష్ట వేగం

గరిష్ట వేగం

బుగాటి చిరాన్ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 2.5 సెకండ్లలో, 0-200 కిలోమీటర్ల వేగాన్ని 6.5 సెకండ్లలో, 0-300 కిలోమీటర్ల వేగాన్ని 13.6 సెకండ్లలో అందుకుంటుంది మరియు దీని అత్యధిక వేగం గంటకు 420 కిలోమీటర్లుగా ఉంది.

ధర వివరాలు

ధర వివరాలు

బుగాటి చిరాన్ కారు ధర 2.4-మిలియన్ యూరోలుగా ఉంది. మన ఇండియన్ రుపాయల్లో దీని విలువ దాదాపుగా రూ. 17.82 కోట్లుగా ఉంది.

కార్లతో స్కేటింగ్

కార్లతో స్కేటింగ్

బాక్సింగ్ ఛాంపియన్ అయిన ఫ్లాయిడ్ మేవెథర్ వద్ద 100 వరకు అత్యంత ఖరీదైన కారు కలవు. మరియు అత్యంత ఖరీదైన వాహనాలతో గ్యారేజ్ ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కూడా ఇతనే.

ఛాంపియన్ అలవాట్లు

ఛాంపియన్ అలవాట్లు

ఒకే కారును అన్ని వేరియంట్లో కొనుగోలు చేయడం మేవెథర్‌కు ఉన్న అలవాటు. అందుకే కాబోలు ప్రపంచ వ్యాప్తంగా అత్యంధిక సంఖ్యలో ఖరీదైన లగ్జరీ కార్లను కలిగి ఉన్న ఏకైక వ్యక్తిగా ఉన్నాడు.

నమ్మలేనిదిని కాని నమ్మాల్సిందే

నమ్మలేనిదిని కాని నమ్మాల్సిందే

మేవేథర్ వద్ద ప్రస్తుతం 100 కన్నా ఎక్కువ కార్లు ఉన్నాయి. అందులో తెలుపు మరియు నలుపు కార్లను రెండుగా విభజించాడు. నలుపు రంగులో ఉన్న కార్లన్నింటిని లాస్ ఎంజిల్స్‌లో మరియు తెలుపు కార్లను అన్నింటిని మియామిలో ఉంచాడు.

ఒక్క డీలర్ వద్ద నుండి 100 కార్లు కొనుగోలు

ఒక్క డీలర్ వద్ద నుండి 100 కార్లు కొనుగోలు

ఒక్క డీలర్ వద్ద ఏకంగా 100 కార్లను కొనుగోలు చేశాడు ఈ ఘనుడు. అయితే కొన్న ప్రతి కారుకు కూడా తక్షణం డబ్బులు చెల్లించి కొనేవాడు. అమెరికాలో గల డీలర్ వద్ద దాదాపుగా 18 సంవత్సరాల అనుభందం ఉన్నట్లు తెలిసింది. మేవెథర్ ఈ డీలర్ వద్ద నుండి ఎంచుకున్న 100 కార్లలో టాప్-10 కార్లు గురించి తరువాత స్లైడర్ల ద్వారా అందిస్తున్నాము. దీని ద్వారా మేవెథర్ సెలక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోగలరు.

1. బెంట్లీ మస్లేన్

1. బెంట్లీ మస్లేన్

బెంట్లీ సంస్థ ఉత్పత్తి చేస్తున్న అత్యంత ఖరీదైన కార్లలో మస్లేన్‌ ఒకటి. లగ్జరీ బ్రాండ్‌కు నిలయమైన ఏకైక కారు కూడా ఇదే. ఇందులో 505 హార్స్‌పవర్ ఉత్పత్తి చేయగల వి-8 ఇంజన్ కలదు.

2. బుగాటి వేరాన్

2. బుగాటి వేరాన్

అత్యంత వేగంగా పరుగులు పెట్టెదానిలో ఉన్న ఏకకై కారు బుగాటి వేరాన్. దీని ఒక్క దాని ఖరీదు సుమారుగా 1 మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువే ఉంటుంది. ఇందులో గల 16 సిలిండర్ల ఇంజన్ దాదాపుగా 1,000 ఆశ్వ శక్తిని విడుదల చేస్తుంది.

3. ఫెరారి 458 ఇటాలియా

3. ఫెరారి 458 ఇటాలియా

ఫెరారి వేగం పరంగా కాస్త అటు ఇటుగా బుగాటితో పోటి పడుతుంది. మేవెథర్ వద్ద ఉన్న అత్బుతమైన కార్లలో ఫెరారి 458 ఇటాలియా. మేవెథర్ దీని డిజైన్‌కు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు అని తెస్తుంది. ఎందుకంటే దీనిని మొత్తం ఏరోడైనమిక్ గా డిజైన్ చేశారు.

4. ఫెరారి 599 జిటిబి ఫియరానో

4. ఫెరారి 599 జిటిబి ఫియరానో

ఫెరారి 458 ఇటాలియా కన్నా మరింత ఖరీదైన కారు ఫెరారి 599 జిటిబి ఫియరానో. దీనికి మేవెథర్ తన కార్ల ప్రపంలోకి ఎంచుకున్నాడు. ఇందులో 6.0-లీటర్ కెపాసిటి గల వి12 ఇంజన్ కలదు.

5. ఫెరారి ఎంజో

5. ఫెరారి ఎంజో

ఫెరారికి చెందిన మరొక విలాసవంతమైన కారు ఎంజో . మేవెథర్ దీనికి కూడా తన లగ్జరీ కార్ల జాబితాలో చోటు కల్పించాడు. ఇందులో ని12 ఇంజన్ కలదు. ఇది 651 హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు 220 మైళ్ల వేగాన్ని తన చక్రాలకు అందిస్తుంది.

6. మెక్ లారెన్ 650 ఎస్

6. మెక్ లారెన్ 650 ఎస్

ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ అయిన మెక్ లారెన్ వారి 650 ఎస్ కారును కూడా ఎంచుకున్నాడు. మెక్ లారెన్ వారి ఎమ్‌పి4-12సి కారు యొక్క అప్‌డేట్ రూపమే ఈ 650 ఎస్ మోడల్. మెక్్‌ లారెన్‌లో ఉన్న అన్నింటిలోకెల్లా ఇది అత్యంత శక్తివంతమైన, వేగవంతమైన మరియు ఎంతో ఆకర్షణీమైనది కూడా.

7. మెర్సిజడెస్ బెంజ్ ఎస్‌ఎల్ఎస్ ఏఎమ్‌జి

7. మెర్సిజడెస్ బెంజ్ ఎస్‌ఎల్ఎస్ ఏఎమ్‌జి

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర సూపర్ కార్లు ఒక ఎత్తు అయితే, మెర్సిడెస్ వారి సూపర్ కార్లు ఒక ఎత్తు. మెర్సిడెస్ బెంజ్ వారి ఎకో ఫేమస్ 300 ఎస్‌ఎల్ గాల్వింగ్ ఆధారంతో వచ్చింది. రీ ఫ్రెష్డ్ డిజైన్, న్యూ లుక్ దీని సొంతం.

 8.ల్యాంబోర్గిని అవెంతడోర్

8.ల్యాంబోర్గిని అవెంతడోర్

ల్యాంబోర్గినిలో గొప్ప కారు మర్సియోలాజ్. కాని గడిచే పదేళ్లలోపు దీనికి కొనసాగింపుగా ఎన్నో అప్‌డేట్ మరియు స్పెషల్ ఎడిషన్లు పరిచయం అవుతాయి, కాని దీని విలువ మాత్రం ప్రత్యేకమైనది. అందుకే ఎక్కువ మంది వినియోగదారులు దీనికే మొగ్గు చూపుతారు. కాని ఇదే విషయాన్ని ల్యాబోర్గిని అడిగే అవెంతడోర్ బెస్ట్ అని అంటోంది. అందుకే కాబోలు 700 హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేయగల వి8 ఇంజన్ కలిగిన అవెంతడోర్‌ను ఎంచుకున్నాడు.

9.పోర్షే 911 టర్బో క్యాబ్రియోలెట్

9.పోర్షే 911 టర్బో క్యాబ్రియోలెట్

మేవెథర్ జర్మనీకు చెందిన పోర్షే వారి 911 కారును ఎంచుకున్నాడు. కన్వర్టిబుల్ వెర్షన్‌కు చెందిన పోర్షే 911 టర్బో క్యాబ్రియెలెట్ కారు 520 హార్స్‌ పవర్‌ను ఉత్పత్తి చేయగల ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది కేవలం మూడు సెకండ్ల కాలంలోనే గంటకు 60 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది.

10. రోల్స్ రాయిస్ ఫాంటమ్

10. రోల్స్ రాయిస్ ఫాంటమ్

మేవెథర్‌కు వేయార్న్ కారు ఎంత ఇష్టమో రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూడా అంతే ఇష్టం. రోల్స్ రాయిస్ సంస్థ వినియోగదారుల ఇష్ట ప్రకారం కోరిన విధంగా ఇంటీరియర్ ఫీచర్లను కస్టమైజ్ చేస్తారు. అందుకే మేవెథర్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును తనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేయించుకుని తన లగ్జరీ కార్ల విభాగంలోకి చేర్చుకున్నాడు.

ఇతర కార్లు

ఇతర కార్లు

ఫ్లాయిడ్ మేవెథర్ వద్ద పగాని హయురా, ఆస్టమ్ మార్టిన్ వన్-77, ల్యాంబోర్గిని మర్సియోలాజ్, మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్ఆర్... ఇలా చదువుతూ పోతే ఈ రోజంతా కూడా చాలదు. తరువాత స్లైడ్‌కు వెళ్దాం పదండి.

 చాలా వరకు నిరుపయోగంగా

చాలా వరకు నిరుపయోగంగా

ఒక సారి మేవెథర్ ESPN పత్రికా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఇతను మాట్లాడుతూ, తన వద్ద చాలా వరకు కార్లు ఉన్నాయి. కాని నేను అన్నింటి వినియోగించుకునే సమయం కూడా లేదు. చాలా వరకు కార్లు నిరుపయోగంగా ఉన్నట్లు తెలిపాడు.

 ప్రపంచపు అత్యంత ఖరీదైన కార్ గ్యారేజ్

ప్రపంచపు అత్యంత ఖరీదైన కార్ గ్యారేజ్

మేవెథర్ కారు గ్యారేజ్‌లో ఉన్న కార్ల విలువ సుమారుగా 22 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంటుందని తెలిపాడు. దీని విలువ ఇంతగా ఉండటానికి కారణం ఇతని కార్లలో చాలా వరకు అరుదైన కార్లు ఉన్నాయి అందుకే అంత విలువ. ఫోర్బ్స్ ప్రకటించే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన కారు హోమ్ గల వారిలో మేవెథర్ మొదటి స్థానంలో ఉన్నాడు.

మేవెథర్ సంపద

మేవెథర్ సంపద

ప్రపంచ వ్యాప్తంగా అత్యంతధికంగా సంపాదిస్తున్న అథ్లెట్‌‌లలో మేవెథర్ ముందు స్థానంలో ఉన్నాడు. ఇతని మాటల్లో మొత్తం సంపద దాదాపుగా 650 మిలియన్ డాలర్లుగా ఉంది.

బెంట్లీ గోల్ఫ్ కార్ట్

బెంట్లీ గోల్ఫ్ కార్ట్

మేవెథ్ కుమారుడితో గోల్ఫ్ కోర్ట్‌లో, బెంట్లీ సంస్థకు చెందిన గోల్ఫ్ కార్ట్‌లో మేవెథర్.

గల్ఫ్ స్ట్రీమ్ ఎయిర్ క్రాఫ్ట్

గల్ఫ్ స్ట్రీమ్ ఎయిర్ క్రాఫ్ట్

మేవెథర్ ఖరీదైన కార్లేనే కాదు రెండు ఎయిర్ క్రాఫ్ట్‌లను కూడా కలిగి ఉన్నాడు. మేవెథర్ వద్ద ఉన్న కార్లతో పాటు ఇతను గల్ఫ్ స్ట్రీమ్ వి ఎయిర్ క్రాఫ్ట్‌ను కలిగి ఉన్నాడు. ఇది అమెరికాకు చెందిన గల్ప్‌ స్ట్రీమ్ వారి ఎయిర్ లైన్ యొక్క విమానం.

కస్టమైజ్డ్

కస్టమైజ్డ్

ఈ విమానంలో మేవెథర్ ఇష్ట ప్రకారం సీటింగ్ మరియు వినోభరితమైన ఫీచర్ల పరంగా దీనిని కస్టమైజ్ చేయించుకున్నాడు. 19 మంది సామర్థ్యం నుండి 14 సీటింగ్ సామర్థ్యానికి రూపొందించుకున్నాడు. ఈ గల్ఫ్ స్ట్రీమ్ కస్టమైజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఫ్రిజ్ రెస్ట్ రూమ్ మరియు ఇతర సౌకర్యాలు కలవు.

సిబ్బంది

సిబ్బంది

మేలెథర్‌కు చెందిన ఈ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఇద్దరు పైలెట్లు మరియు ఇద్దరు విమాన సిబ్బంది (విమాన పరిచారకులు) ఉంటారు.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

ఈ ఎయిర్ క్రాఫ్ట్ 96 అడుగుల పొడవు, వెడల్పు ప్రక్క రెక్కలతో సహా 93 అడుగులుగా ఉంది. క్యాబిన్ లోపల వినియోగించే ప్రదేశపు కొలతలు 50 అడుగులు పొడవునా, 7 అడుల వెడల్పు మరియు క్యాబిన్ మొత్తం ఎత్తులో 6.2 అడుగులు వినియోగంలో ఉంది.

ప్రయాణ దూరం

ప్రయాణ దూరం

ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఒక్క సారి పూర్తిగా ఇంధనంతో నింపితే దాదాపుగా 12,000 కిలోమీటర్ల దూరం పాటు ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 904 కిలోమీటర్లుగా ఉంది.

ధర వివరాలు

ధర వివరాలు

ఈ విమానం ఖరీదు సుమారుగా 42 నుండి 53.5 మిలియన్ అమెరికన్ డాలర్ల మధ్య ఉంటుంది.

 మరిన్ని ఆసక్తికరమైన కథనాలు మీ కోసం....
  • 135 కోట్ల విలువైన దుబాయ్ జెట్ విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు.
  • వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం
  •  మరిన్ని ఆసక్తికరమైన కథనాలు మీ కోసం....
    • విమాన ప్రయాణంలో పైలట్లు మరియు విమాన సిబ్బంది చేసే 20 చీకటి పనులు
    • అత్యవసరం సమయంలో విమానం నుండి క్యాబిన్‌ను వేరు చేస్తే ఎలా ఉంటుంది: మరింత చదవండి

Most Read Articles

English summary
Floyd Mayweather Car Collection
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X