'ఈ-వోలో' మల్టీకాప్టర్‌లో పక్షిలా ఎగిరిపోదాం రండి..!

By Ravi

ప్రతినిత్యం రద్దీగా ఉండే రోడ్లపై వాహనాలు నడపాలంటే చిరాకు పుడుతోందా..? మరి అలాంటప్పుడు పక్షిలా రెక్కలు కట్టుకొని ఎగిరిపోతే ఎంత బాగుంటుందని మీకు కూడా అనిపిస్తుంటుందా..? ఇక మీ కల త్వరలోనే నిజం కానుంది. మరి ఆలస్యమెందుకు రండి ఆ కథేంటో తెలుసుకుందాం..!

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న విచిత్ర వాహనం పేరు 'ఈ-వోలో' వోలోకాప్టర్. ఇదొక మల్టీకాప్టర్ (హెలికాప్టర్ లాటిందన్నమాట). సాధారణ హెలికాప్టర్‌కు రెండు రెక్కలు మాత్రమే ఉంటే, ఈ-వోలో మల్టీకాప్టర్‌కు మాత్రం 16 రెక్కలు (ప్రొపెల్లర్స్) ఉంటాయి. జర్మనీకు చెందిన ప్రఫెషనల్స్ సైకిస్ట్ థామస్ సెంకెల్, ప్రోగ్రామర్ స్టీఫెన్ వోల్ఫ్, డిజైనర్ ఫిలిప్ హలిష్ మరియు అలెగ్జాండర్ జోసెల్‌తో కూడిన బృందం ఈ వాహనాన్ని తయారు చేశారు. అంతేకాదు, దీని తొలిదశ టెస్టింగ్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు.

రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే చిన్నపాటి హెలికాప్టర్ నుంచి స్ఫూర్తి పొంది వారు ఈ మల్టీకాప్టర్‌ను డిజైన్ చేశారు. ఈ-వోలో మల్టీకాప్టర్‌లో ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది. దీనిని జాయ్ స్టిక్ సాయంతో కంట్రోల్ చేయవచ్చు. ఈ-వోలోకు అమర్చిన 16 ప్రొపెల్లర్లు బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి. ఈ శక్తివంతమైన ప్రొపెల్లర్లు ఒకేసారి పనిచేయటం ప్రారంభించిన తర్వాత వోలోకాప్టర్ గాల్లోకి ఎగురుతుంది. దీనిని టేకాఫ్ చేయటం, ల్యాండింగ్ చేయటం చాలా సులువు. ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ దశలో ఉంది.

ఇందులో అమర్చిన బ్యాటరీల సాయంతో దీనిపై గాలిలో 20 నిమిషాల పాటు ఎగురవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. భవిష్యత్తులో దీనికి మరిన్ని హంగులను జోడించి పూర్తిస్థాయిలో అభిృవద్ధి చేస్తామని వారు చెబుతున్నారు. మరి ఈ వోలోకాప్టర్‌పై ఓ కన్నేసొద్దాం రండి..!

'ఈ-వోలో' మల్టీకాప్టర్‌లో పక్షిలా ఎగిరిపోదాం రండి

Most Read Articles

English summary
The 'e-volo' multicopter is a prototype personal transport vehicle, steerable via joystick and powered by sixteen propellers to hover in the air. a team of German professionals - physicist Thomas Senkel, programmer Stephan Wolf, and designer Philipp Halisch, as well as Alexander Zosel - have just completed the first prototype and test flight of the craft, which they imagine for use towards entertainment purposes, aerial photography and inspection, and short-distance travel.
Story first published: Monday, April 22, 2013, 15:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X