అమెరికా లాస్ ఏంజిల్స్ ఆటో షో లో మెరిసిన ఎకోస్పోర్ట్: 2017 నాటికి దేశీయ మార్కెట్లోకి

ఫోర్డ్ మోటార్స్ అమెరికాలో జరిగిన 2017 లాస్ ఏంజిల్స్ ఆటో షో వేదిక మీద తమ 2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యువిని ప్రదర్శించింది. ఇండియాలో దీని విడుదల గురించిన వివరాలు...

By Anil

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మటార్స్ అమెరికాలో జరిగిన 2017 లాస్ ఏంజిల్స్ ఆటో షో వేదిక మీద తమ 2017 ఎకోస్పోర్ట్ వాహనాన్ని ప్రదర్శించింది. ఇండియన్ మార్కెట్లోకి 2017 మధ్య భాగానికి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనికంటే ముందు జరిగిన 2017 Sao Paulo ఆటో షో వేదిక మీద ప్రదర్శించలేకపోయింది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

అమెరికా లోని ఫోర్డ్ లైనప్‌లో ఉన్న ఫోర్డ్ కుగా వేరియంట్ యొక్క ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ లక్షణాలతో ఈ 2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ను అభివృద్ది చేసారు.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఇంటీరియర్‌లో అధునాతన స్టీరింగ్ వీల్, 8-అంగుళాల పరిమాణం గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరింత సెన్సిటివ్ ఎఫ్ఎమ్ యాంటెన్నా మరియు టాప్ ఎండ్ వేరియంట్లో 675వాట్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

అమెరికా స్పెక్ మోడల్ లో రెండు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. అవి, 1.0-లీటర్ మూడు సిలిండర్ల ఇంజన్ మరియు 2.0-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల ఇంజన్‌లు కలవు.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

రెండు ఇంజన్‌లకు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేయనున్నారు.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

2017 ఎకోస్పోర్ట్ ముందు భాగంలో కొత్త వన్ పీస్ హెక్సాగోనల్ ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన హెడ్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్ మరియు బంపర్ కలవు.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

ఏ/సి నుండి వచ్చే గాలిని ప్రసరింపజేసే ఎయిర్ వెంట్‌లను డ్యాష్ బోర్డ్‌లోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింది భాగంలో అందించారు. సెంటర్ కన్సోల్ విభాగంలో ఉన్న వాతావరణ నియంత్రికలను కూడా అసమాన డిజైన్ లో అందించారు.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

సరికొత్త 2017 ఫోర్డ్ ఎకో స్పోర్ట్ 2017 ప్రారంభంలో దక్షిణ అమెరికాలో విడుదల కానుంది. మరియు 2017 మలి సగానికి ఇండియన్ మార్కెట్లకు చేరే అవకాశం ఉంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్

ఎక్కువ మంది చదివినది: ఇండియాలో రోడ్డుకు ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి ? వివరంగా...!!

Most Read Articles

English summary
LA Auto Show: 2017 Ford Ecosport Unveiled, India Launch In 2017
Story first published: Friday, November 18, 2016, 15:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X