దెయ్యాల పండుగ థీమ్‌తో కస్టమర్లను బెంబేలెత్తించిన ఫోర్డ్

By Ravi

దేవతల కోసం మనం పండుగలు చేసుకోవటాన్ని చూశాం, కానీ దెయ్యాల కోసం పండుగను చేసుకోవటాన్ని ఎప్పుడైనా చూశామా..? ఆ దెయ్యాల పండుగ పేరే హాలోవీన్. పేరుకు తగినట్లుగానే ఇదొక విచిత్రమైన పండుగ. ప్రతి ఏటా అక్టోబర్ 31 తేదీని హాలోవీన్ ఫెస్టివల్‌‍గా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ప్రజలు దెయ్యాల రూపంలో వేషధారణ కట్టి ఇతరులను భయపెడుతుంటారు.

ఈ దెయ్యాల పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో, అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ తమ కస్టమర్లకు కూడా ఓ విచిత్రమైన (భయంకరమైన) అనుభూతిని కలిగించింది. ఫోర్డ్ తమ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేయాల్సిందిగా కొందరు కస్టమర్లను, కోరి ఒకానొక ప్రాంతంలో కార్ వాష్ చేయించమని చెబుతారు. అలా కార్ వాష్‌కి ఫోర్డ్ కారులో వచ్చిన కస్టమర్లకు మధ్యలో అనుకోని అనుభవం ఎదురవుతుంది.

కార్ వాష్ సెంటర్‌లోకి ప్రవేశించే వరకు అందరూ మనుషుల మాదిరిగానే ఉంటారు. ఆ బేలో అలా కొంత దూరం వెళ్లిన తర్వాత, లైట్లు ఆగిపోతాయి, వెంటనే ఉన్నట్టుండి రాక్షసుల మాదిరిగా ఉండే కొందరు కారుపై పడి, లోపల ఉండే వారిని భయపెడుతారు. వీరంతా ఫోర్డ్ ఉద్యోగులే. హోలోవీన్ థీమ్ స్టయిల్‌లో డ్రెస్సప్ చేసుకొని ఈ ప్రాంక్ చేస్తారు. చివరిగా భయపడిన కస్టమర్లను సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు హ్యాపీ హోలోవీన్ అవి విష్ చేస్తారు. మరి ఆ ఫన్నీ అండ్ స్కేరీ ప్రాంక్‌ను మనం కూడా చూసేద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/MfEelkmpqc8?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
American automobile giant Ford has got itself into the Halloween spirit and decided to provide a scare to a few of their customers. They had given their vehicles to individuals for a test drive and asked them to stop at a particular car wash. Ford had rigged this car wash facility with their own employees.&#13;
Story first published: Monday, October 20, 2014, 16:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X