అద్దె భారం తగ్గించుకోవడానికి పాత వ్యాన్‌ను ఇల్లుగా మార్చుకున్నాడు: ఎలాగో మీరే చూడండి

By Anil

జీవితం కలసిరాకపోతే ఇండియా అయినా ఒకటే ఇంగ్లాండ్ అయినా ఒకటే, దీనితో మీరు ఏకీభవిస్తారా ? ఖచ్చితంగా ఏకీభవించాల్సిందే. ఎందుకంటే సాధారణంగా భారత్‌లో కూడు, నీడ కోసం కోటి విద్యలు చేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌లో ఇలా కాదు నీడ కావాలంటే కోట్లు వెచ్చించాల్సిందే.

అయితే జమీ వాడ్డింగ్‌టన్ అనే సైనికుడు అందరినీ అశ్చర్యపరిచేలా ఇంటి అద్దె భారం తగ్గించుకునేందు పాత వ్యాన్‌ను సర్వాంగ సుందరంగా అచ్చం ఇంటిలాగే తీర్చిదిద్దుకున్నాడు. ఇప్పుడు ఇతను అద్దె భారానికి ఏ మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇతని ఇళ్లు ఎలా ఉందో చూడాలి అనుకుంటున్నారా ? మరెందుకు అలస్యం క్రింది గల కథనాలను చకచకా చదివేయండి.

మాజీ సైనికుడు

మాజీ సైనికుడు

జామీ వాడ్డింగ్‌టన్ వయస్సు 25 ఏళ్లు ఉంటాయి. ఇతను ఇంగ్లాండ్ జాతీయుడు. ఆ దేశ ఆర్మీలో పని చేసిన మాజీ సైనికుడు.

 నెల వారి అద్దె

నెల వారి అద్దె

ప్రతి నెల కూడా ఇతను పని చేసిన ఆర్మీ నుండి నెల వారి అద్దెను అందుకునేవాడు. నెలకు 800 పౌండ్లు వరకు అద్దె కోసం చెల్లించాల్సి వచ్చేది.

 జామీ ఇబ్బంది

జామీ ఇబ్బంది

ఇతను పనిచేసిన ఆర్మీ నుండి వచ్చే అద్దె సొమ్ము ఇతనికి సరిపోయేది కాదు. 800 పౌండ్ల సొమ్ము ఏ మాత్రం సరితూగలేదు.

ఆలోచన

ఆలోచన

ఈ సమస్యను అధిగమించడానికి పాత వ్యాన్‌ను కొనుగోలు చేసితనకు అనుగుణంగా అనుకూళీకరించుకోవాలని అనుకున్నాడు.

 పాత వ్యాను

పాత వ్యాను

ఇతను కేవలం ఒక నెల అద్దె సొమ్ముతో పనికిరాని పాత వ్యానును కొనుగోలు చేశాడు.

 అలంకరణ

అలంకరణ

తుప్పు పట్టి పాడైపోయిన పాత వ్యానును శుభ్రం చేసి దానికి తిరిగి కొత్తగా ప్రాణం పోశాడు జామీ. అంతే కాకుండా లోపలివైపున అల్మారాలు మరియు ఇంటిని తలపించే సౌకర్యాలతో రీడిజైన్ చేసుకున్నాడు.

 గృహప్రవేశం

గృహప్రవేశం

మూడు నెలల శ్రమ తరువాత జామీ వాడ్డింగ్‌టన్ తన కలల ఇంటిని తనకు నచ్చినట్టుగా నిర్మించుకున్నాడు. ఇంటిలో ఉండాల్సిన అన్ని వసతులను ఇందులో కల్పించుకున్నాడు.

 ధర

ధర

ఇతను ఈ వ్యాన్ ఇంటిని నిర్మించుకోవడానికి ముందు ఇతను నివసిస్తున్న ఇంటి కోసం ప్రతి నెలా 800 పౌండ్లను అద్దెగా చెల్లించేవాడు. అయితే కేవలం 750 పౌండ్లతో ఒక వ్యాన్‌ను ఇంటిగా మార్చేసుకున్నాడు.

 వాడ్డింగ్‌టన్ మాటల్లో

వాడ్డింగ్‌టన్ మాటల్లో

ప్రస్తుతం నేను ఎంతో సంతోషంగా మరియు అద్దె డబ్బు కోసం ఏ మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంతే కాకుండా ప్రతి నెల కూడా అధిక మొత్తం ఇంటి అద్దె చెల్లించాలి అనే ఆలోచనే లేకుండా రిలాక్స్‌గా ఉన్నాను.

 సదుపాయాలు

సదుపాయాలు

ఇందులో ఫ్రిడ్జ్, సోఫా, మడత మంచం, అగ్నిమాపక పరికరాలు, పొగ మరియు నిప్పును పసిగట్టే వార్నింగ్ పరికరాలు, విశ్రాంతి గది, ఆకాశాన్ని ఇంటీరియర్‌లో నుండి చూసే విధంగా ఉన్న ప్రత్యేక డిజైన్ మరియు ఇందులో ఇలాంటి ఎన్నో అధనపు ఫీచర్లను కల్పించుకున్నాడు.

ఎక్కువ మంది చదివిన కథనాలు మీ కోసం.....

15 లక్షల విలువ చేసే విమాన ప్రయాణాన్ని రూ. 7,000 లతో చేశాడు

విమాన వసతుల్ని తలదన్నే అత్యంత విలాసవంతమైన కారు

ఎక్కువ మంది చదివిన కథనాలు మీ కోసం.....

100 కు పైబడి లగ్జరీ కార్లను కలిగి ఉన్న ఫేమస్ బాక్సర్

ఊహలకందని అమీర్ ఖాన్ వ్యక్తిత్వం మరియు కార్ల ప్రపంచం

Most Read Articles

English summary
Former Soldier Fed Up Home Rent Transforms Rusty Old Van New Home
Story first published: Wednesday, April 13, 2016, 10:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X