గాడిదతో కారును లాగించి నిరసన తెలిపిన వ్యక్తి: ఎందుకో తెలుసా ?

Written By:

కాలం ఎంత వేగంగా ముందుకెళ్తున్నా మనం తెలిపే నిరసనలో బలం ఉంటేనే అనుకున్నది పొందుతాం. అచ్చం దీనిని ఫాలో అవుతూ లుధియానాకు చెందిన ఓ కారు యాజమాని ఆ కార్ల తయారీ సంస్థకు తన సమస్యను పరోక్షంగా తెలియజేయడానికి ఇదిగో ఇలా రెండు గాడిదలను తెప్పించి భారీ రద్దీగా ఉన్న రహదారి మీద లాగించి తన నిరసనను వ్యక్తపరిచాడు.

లుధియానాకు చెందిన ఓ వ్యక్తి తన స్కోడా ఆక్టావియా కారును లుధియానాలోని అత్యంత రద్దీగా ఉన్న రహదారి మీద రెండు గాడిదులతో నడిపించాడు. దీనికి సంభందించి ఏఎన్‌ఐ న్యూస్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది.

నిజానికి ఈ కారును గాడిదులతో ఇలా ఎందుకు లాగించాడో అనే విషయాన్ని ఏఎన్ఐ స్పష్టంగా వివరించలేదు. అయితే తన కారు మెయింటెన్స్‌తో అసంతృప్తిగా ఉన్నందుకే అని తెలిసింది.

తన కారుకు తగిన మరమ్మత్తు మరియు సర్వీస్ చేయడంలో సంస్థ యొక్క అసమర్థతను వ్యతిరేకిస్తూ, కంపెనీ యొక్క అలసత్వానికి నిరసనగా ఇలా తన కారును రెండు గాడిదలతో లాగించి మరి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

నాణ్యమైన సేవలు మరియు సర్వీసులు అందివ్వడంలో స్కోడా ఇండియా ఎప్పటి నుండో ఇబ్బందులు ఎదుర్కుంటోంది. అయితే మార్కెట్లో తమ జాడను తెలిపే విధంగా కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక స్కీమ్‌లను అందిస్తోంది.

తమ ఉత్పత్తులపై వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు, నాలుగేళ్ల పాటు ఉచిత వారంటీ, అలాగే కొత్త కార్లను కొనుగోలు చేసే వారికి కొన్ని మోడళ్ల మీద ఇప్పుడు కొనండి... తర్వాత చెల్లించండి అనే స్కీమ్ కూడా అందుబాటులో ఉంచింది.

ఏదేమయినప్పటికీ స్కోడా కస్టమర్ ఒకరు, తన నిరసనను కంపెనీకి తెలియజేసేందుకు ఇదిగో ఇలా మన పాత పద్దతిని వినియోగించాడు.

ఈ కథనానికి సంభందించి మరే సమాచారం లేదు, దీనికి సంభందించిన ఏదైనా సమాచారం ఉంటే ఇదే కథనంలో డ్రైవ్‌స్పార్క్ తెలుగు కొనసాగింపుగా తెలియజేస్తుంది.

హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి 2017 సిటి సెడాన్ ప్రీమియమ్ సెడాన్ కారును విడుదల చేసింది. ఈ ఫోటోలను వీక్షించేందుకు క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

Story first published: Wednesday, March 8, 2017, 16:28 [IST]
English summary
Skoda owner gets his Octavia towed by donkeys to protest against the brand’s service
Please Wait while comments are loading...

Latest Photos