ఫ్యూచర్ టాక్సీ కాన్సెప్ట్స్: భవిష్యత్ ప్రజా రవాణా వ్యవస్థ!

By Ravi

కలలు నిజమైతే.. ఊహలకు రూపం వస్తే.. భవిష్యత్తు చాలా అందంగా, అధునాతంగా ఉంటుంది కదూ..! మానవుడి మేధాశక్తికి ఆది అంతం అనేది లేదు. మానవుడు తలుకుచుకుంటే, దేన్నైనా సాధించగలడు. ఇప్పటికే ఇది కొన్ని విషయాల్లో నిరూపించబడినది కూడా. మన భావితరాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనని కొందరు నిపుణులు ఇప్పటికే పలు అధ్యయనాలు, పరిశోధనలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా. ఈ పరిశోధనలలో ఒక భాగమే ప్రజా రవాణా వ్యవస్థ.

భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ వంటి సహజ సిద్ధ ఇంధనాలు కరువైతే, పెరుగుతున్న జనాభాతో పాటే వాహనాల సంఖ్య పెరిగి రద్దీ గణనీయంగా పెరిగితే ప్రత్యామ్నాయం ఏమిటి? ఈ ఆలోచనే పరిశోధకుల మెదడును కదిలించింది. అంతే, ఇంకేముంది భవిష్యత్ ప్రజా రవాణా వ్యవస్థను ఇప్పటి నుంచే అభివృద్ధి చేసే పనులకు బీజం పడింది, కొన్ని అద్భుతమైన, అందమైన అధునాతన కాన్సెప్ట్ వాహనాలు పుట్టుకొచ్చాయి. అలాంటి కొన్ని ఫ్యూచర్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వాహనాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

పబ్లిక్ ట్రన్స్‌పోర్ట్ 2020

పబ్లిక్ ట్రన్స్‌పోర్ట్ 2020

ఈ ఫొటోలో కనిపిస్తున్న మినీ టాక్సీని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ 2020 అని వ్యాఖ్యానిస్తారు. స్లోవేకియాకు చెందిన మార్సెల్ జుజియాక్ ఈ కారును డిజైన్ చేశారు. ఇదొక డ్రైవర్ అవసరం లేని (డ్రైవర్‌లెస్) కారు.

పబ్లిక్ ట్రన్స్‌పోర్ట్ 2020

పబ్లిక్ ట్రన్స్‌పోర్ట్ 2020

భవిష్యత్తులో ఇలాంటి వందాలది కార్లు ఓ సాంకేతిక సిస్టమ్ ద్వారా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి, ప్రమాదరహిత వాతావరణాన్ని కల్పిస్తాయి. ఈ కార్లలో ప్యాసింజర్లు చేయాల్సిందిగా, సింపుల్ తాము చేరాలనుకున్న గమ్యస్థానాన్ని నమోదు చేయటమే. ఇవి సురక్షితంగా వారిని తమ గమ్య స్థానాలకు చేరవేస్తాయి.

క్రెడో ఈ-బోన్ బస్

క్రెడో ఈ-బోన్ బస్

ఈ ఫొటోలో కనిపిస్తున్న అధునాత బస్సు పేరు ఈ-బోన్. ఈ కాన్సెప్ట్ బస్సును పీటర్ సిమోన్ డిజైన్ చేశాడు. ఇది ప్రకృతి సాన్నిహిత్యమైన జీరో ఎమిషన్ బస్సు. ఈ బస్సు లిథియం అయాన్ బ్యాటరీలు, హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్ సాయంతో నడుస్తుంది.

క్రెడో ఈ-బోన్ బస్

క్రెడో ఈ-బోన్ బస్

ఈ-బోన్ బస్సు నాలుగు చక్రాలలో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. తేలికైన మరియు ధృడమైన ప్లాస్టిక్ భాగాలను ఉపయోగించడం ద్వారా ఈ బస్సు బరువును గణనీయంగా తగ్గించారు. ఇదొక రియలిస్టిక్ బస్సు.

ఎల్ఫ్

ఎల్ఫ్

ఈ ఫొటోలో కనిపిస్తున్న విచిత్ర వాహనం పేరు ఎల్ఫ్. దీనిని రిజ్కి టరిసా అనే డిజైనర్ డిజైన్ చేశాడు. ఇదొక సిటీ అండ్ ఆఫ్-రోడ్ పర్సనల్ వెహికల్. ఉండే ఈ బుజ్జి కారులో ఇద్దరు కూర్చోవచ్చు.

ఎల్ఫ్

ఎల్ఫ్

భవిష్యత్తులో సిటీ డ్రైవింగ్, పార్కింగ్ వంటి అంశాల్లో దీని కాంపాక్ట్ సైజు పెద్ద అడ్వాంటేజ్‌గా మారుతుందని భావిస్తున్నారు.

ఎయిర్‌ఫ్లో

ఎయిర్‌ఫ్లో

ఎయిర్‌ఫ్లో ఒక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కాన్సెప్ట్ హోవర్ క్రాఫ్ట్. దీనిని లుకార్ మెడీసిస్ అనే డిజైనర్ డిజైన్ చేశాడు. దీనిని ప్రత్యేకంగా ఫిన్‌లాండ్ లోని హెలెసింకిలో ఉపయోగించేందుకు డిజైన్ చేశారు. పేరుగు తగినట్లుగానే ఇది గాలితో నడిస్తుంది.

ఎయిర్‌ఫ్లో

ఎయిర్‌ఫ్లో

ఈ హోవర్‌క్రాఫ్ట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాహనంలో 40 ప్రయాణికులు, (డ్రైవర్‌తో కలిపి), రెండు వీల్ చైర్స్ లేదా బేబీ ట్రాలీస్‌లకు చోటు ఉంటుంది. దీనిపై భాగంలో పారదర్శకమైన సోలార్ ప్యానెళ్లు ఉంటాయి. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి స్టీరింగ్ ప్రొపెల్లర్లను నడిపేందుకు బదిలీ అవుతుంది.

ఫ్యూచర్ టాక్సీ క్యాబ్

ఫ్యూచర్ టాక్సీ క్యాబ్

డిజైనర్ పీటర్ కుబిక్స్ బుర్ర లోనుంచి పుట్టుకొచ్చినదే ఈ ఫ్యూచర్ టాక్సీ క్యాబ్ కాన్సెప్ట్. ఇదొక రోబోటిక్ టాక్సీ, అంటే డ్రైవర్‌లెస్ కారు మాదిరిగా అన్నమాట. ఈ ఫ్యూచర్ టాక్సీలో ఇద్దరు కూర్చోవచ్చు, కొంత లగేజ్ కూడా తీసుకెళ్లవచ్చు. మరింత లగేజ్‌ తీసుకెళ్లాలనుకునే వారి కోసం సింగిల్ సీటర్ వెర్షన్‌ను కూడా డిజైన్ చేశారు.

ఫ్యూచర్ టాక్సీ క్యాబ్

ఫ్యూచర్ టాక్సీ క్యాబ్

భవిష్యత్తులో ఈ ఫ్యూచర్ టాక్సీలను మెగా సిటీల్లో ఉపయోగించనున్నారు. ఇవి యాంత్రికంగా నావిగేట్ అవుతూ, ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ చేసుకుంటూ, రోడ్డుపై వెళ్ల ఇతర వాహనాలను, అడ్డంకులను తప్పించుకుంటూ సురక్షితంగా గమ్యస్థానాలు చేరుతాయి.

సిటీ ఆక్వాటిక్ ట్రాన్స్‌పోర్ట్ (క్యాట్)

సిటీ ఆక్వాటిక్ ట్రాన్స్‌పోర్ట్ (క్యాట్)

ఈ ఫొటోలో కనిపిస్తున్న సిటీ ఆక్వాటిక్ ట్రాన్స్‌పోర్ట్ (క్యాట్) వాహనాన్ని కాల్ క్రావెన్ అనే డిజైనర్ డిజైన్ చేశాడు. పేరుకు తగినట్లుగానే ఇది నీటిపై నడిచే వాహనం. నీటి ప్రాంతాల్లో ఉండే నగరాలను దృష్టిలో ఉంచుకొని ఈ వాహనాన్ని డిజైన్ చేశారు.

సిటీ ఆక్వాటిక్ ట్రాన్స్‌పోర్ట్ (క్యాట్)

సిటీ ఆక్వాటిక్ ట్రాన్స్‌పోర్ట్ (క్యాట్)

క్యాట్‌లో ఎక్కి కూర్చునే ప్రయాణికులు దీనిని తామే స్వయంగా డ్రైవ్ చేసుకోవచ్చు లేదా ఆటోమేటిక్ మోడ్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో వై-ఫై, కాన్ఫరెన్స్ టేబుల్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఫలితంగా మార్గమధ్యంలోనే సమావేశాలు నిర్వహించుకునే వెసలుబాటు ఉంటుంది. దీనిని టూరిస్ట్ వెహికల్‌గా కూడా వాడుకోవచ్చు.

రెనో రన్నర్

రెనో రన్నర్

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న విచిత్ర వాహనాన్ని చూడండి. దీని పేరు 'రెనో రన్నర్'. రెనో రన్నర్ ఒక ఫ్యూచరిస్టిక్ టాక్సీ కాన్సెప్ట్. సిటీ టాక్సీగా వాడుకునే ఈ వాహనాన్ని ట్రైన్‌లా మార్చుకోవటం దీని ప్రత్యేకత. ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ అధునాతన వాహనాన్ని అభివద్ధి చేసింది.

రెనో రన్నర్

రెనో రన్నర్

ఇలాంటి రెనో రన్నర్ వాహనాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయటం ద్వారా (రైలు భోగీల మాదిరిగా) దీనిని ఓ రకమైన పబ్లిక్ ట్రాన్స్‌‌పోర్ట్ సిస్టమ్‌గా మార్చుకోవచ్చు. సెక్యూర్ వైర్‌లెస్ కమాండ్ ద్వారా రెనో రన్నర్ వాహనాలను ఆటోమేటిక్‌గా ఒకదానితో ఒకటి రైలుగా మాదిరిగా జతచేయవచ్చు. ఇలా మొత్తం 3 యూనిట్లు/క్యాబిన్లను జచతచేయవచ్చు.

Most Read Articles

English summary
Following is a small list of futuristic concept designs of what may or may not be the taxis and public transports of the future. Take a look.
Story first published: Tuesday, October 29, 2013, 12:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X