ఆఫ్రికా ఏనుగుల దాడి నుంచి కాస్తలో తప్పించుకున్నారు

ఈ భూమ్మీద అతి ప్రమాదకరమైన జంతువుల్లో ఆఫ్రికా ఏనుగు కూడా ఒకటి. ఆఫ్రికా ఏనుగులు చూడటానికి గాంభీర్యంగా ఉంటాయి. ఈ ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి ఇతర జంతువులతో పోల్చుకుంటే, ప్రతి ఏటా ఇవే మనుషులను ఎక్కువగా చంపేస్తుంటాయట. ప్రధానంగా అడవుల్లో సంచరించే ఆఫ్రికా ఎనుగులు మరింత ప్రమాదకరంగా ఉంటాయి. అసలు ఈ ఏనుగుల గోల ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా..!

జర్మనీకి చెందిన పర్యాటకుల బృందం ఒకటి ఆఫ్రికా సఫారీకి (ఆఫ్రికా అడువుల్లో ప్రయాణం) కారును అద్దెకు తీసుకొని వెళ్లారు. అక్కడ ఓ రెండు ఆఫ్రికా ఏనుగులు ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. అయితే, ఈ పర్యాటకులు కారులో రావటాన్ని గమనించి ఆ రెండు ఏనుగులలో దాదాపు 5 టన్నుల బరువును ఉన్న ఏనుగు ఒకటి కారు దగ్గరకు వచ్చి తన దంతంతో కారు అద్దాన్ని పగలగొట్టేసింది.

అదృష్టవశాత్తు ఈ ఏనుగు దాడిలో ఎవ్వరూ గాయపడలేదు. అడవిలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి, ఏనుగలకు కోపం రానంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదు, కానీ వచ్చిందో అది సృష్టించే భీభత్సం అంతా ఇంతా కాదు. ఇలా అడవిలో వివిధ ఏనుగుల దాడిలో నలిగిపోయిన కార్లను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి. చివరి స్లైడ్‌లో ఏనుగు దాడి చేస్తున్నప్పుడు తీసిన వీడియోను కూడా వీక్షించండి.

కారుపై ఆఫ్రికా ఏనుగుల దాడి

ఆఫ్రికా ఏనుగు దాడికి గురై, నుజ్జు నుజ్జు అయిన కారు.

కారుపై ఆఫ్రికా ఏనుగుల దాడి

ఆఫ్రికా ఏనుగు దాడికి గురైన ఫోక్స్‌వ్యాగన్ సెడాన్ కారు.

కారుపై ఆఫ్రికా ఏనుగుల దాడి

ఆఫ్రికా ఏనుగు దాడికి గురైన ఫోక్స్‌వ్యాగన్ కారు.

వాహనలపై జంతువుల దాడి

కారును వెళ్లికిలా తిప్పేస్తున్న మధపుటేనుగు.

వాహనలపై జంతువుల దాడి

కోతల పిక్నిక్.. కారును అటాక్ చేసిన కోతుల మూక.

వాహనలపై జంతువుల దాడి

ఇలాంటి సంఘటన మన ఊర్లో చూసే ఉంటాం. ట్రాలీ ఆటోను తరుముతున్న కుక్క.

వాహనలపై జంతువుల దాడి

పంజా.. అదృష్టం ఉంటేనే ప్రాణాలు దక్కుతాయ్..

వాహనలపై జంతువుల దాడి

సింగం.. సఫారీలో పర్యాటకులను షాక్‌కు గురి చేసిన సింహం.

ఫారెస్ట్ సఫారీ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన చిట్కాలు

అడవిలో సఫారీకి వెళ్లినప్పుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం ఏ రూపంలో ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కంగారు పడకం

కంగారు పడకం

అడవిలో సఫారీకి వెళ్లినప్పుడు క్రూర మృగాలు మీ వాహనాన్ని చుట్టిముట్టినట్లయితే, కంగారు పడకుండా, ప్రశాంతంగా ఉండండి. కాసేపయ్యాక అవే వెళ్లిపోతాయి.

గట్టిగా కేకలు పెట్టకండి

గట్టిగా కేకలు పెట్టకండి

జంతువులు మీ వైపు వస్తున్నప్పుడు కంగారులో గట్టిగా కేకలు పెట్టడం చేయకండి. అలా చేస్తే, సదరు జంతువులు విచిత్రంగా ప్రవర్తించే ఆస్కారం ఉంటుంది.

కారులోనుంచి బయటకు రాకండి

కారులోనుంచి బయటకు రాకండి

రోడ్డుపై క్రూర మృగాల వచ్చినప్పుడు వాటిని చూసేందుకు కానీ లేదా ఫొటోలను తీసేందుకు కానీ వాహనం లోనుంచి బయటకు రాకండి.

వేగంగా నడపకండి

వేగంగా నడపకండి

సఫారీలో ఏదైనా జంతువు మీ వాహనాన్ని వెంబడిస్తుంటే, కంగారుపడి వేగంగా డ్రైవ్ చేయకండి. అలా చేస్తే మీరు ఇతర జంతువులకు హాని కలిగించే ప్రమాదం ఉంటుంది.

రివర్స్ చేసేటప్పుడు చూసుకోండి

రివర్స్ చేసేటప్పుడు చూసుకోండి

వాహనాలను గుడ్డిగా రివర్స్ చేయకండి. రివర్స్ చేసే సమయంలో మీ వెనుక ఏవైనా జంతువులు ఉన్నాయో లేవో చూసుకోండి.

కారు లోంచి తల, చేతులు బయట పెట్టకండి

కారు లోంచి తల, చేతులు బయట పెట్టకండి

సఫారీలో ఉన్నప్పుడు లేదా అటవీ రోడ్లపై వెళ్తున్నప్పుడు క్రూర మృగాలను చూసేందుకు కారు కిటికీలలో నుంచి తల, చేతులు బయటపెట్టడం చేయకండి.

హారన్ కొట్టకండి

హారన్ కొట్టకండి

రోడ్డుపై అడ్డుగా వచ్చిన జంతువులను తప్పించేందుకు గట్టిగా పదే పదే హారన్ కొట్టకండి. ఇది చాలా ప్రమాదకరం.

జంతువులకు ఆగ్రహం తెప్పించకండి

జంతువులకు ఆగ్రహం తెప్పించకండి

సఫారీలో జంతువులకు ఆగ్రహం తెప్పించేలా ప్రవర్తించకండి. జంతువులను చేసి వెర్రికేకలు పెట్టటం, వెకిలి చేష్టలు చేయటం మానుకోండి.

కారు డోర్లను లాక్ చేసి ఉంచండి.

కారు డోర్లను లాక్ చేసి ఉంచండి.

సఫారీలో ఉన్నప్పుడు కారు డోర్లను ఎల్లప్పుడూ లాక్ చేసి ఉంచండి. ఈ ఫొటోలో చూపినట్లుగా మాత్రం చేయకండి.

సన్‌రూఫ్

సన్‌రూఫ్

మీ కారులో సన్‌రూఫ్ ఉంటే, అందులోని పైకి లేచి జంతువులను చూడటం చేయకండి.

ఫ్లాష్ కెమెరాలు

ఫ్లాష్ కెమెరాలు

జంతువులను ఫ్లాష్ కెమరాలతో ఫొటోలు తీయకండి.

ప్రశాంతంగా ఉండండి

ప్రశాంతంగా ఉండండి

సఫారీలో ఎప్పుడైనా అవాంఛనీయం పరిస్థితిని ఎదుర్కుంటే, కంగారు పడిపోకుండా ప్రశాంతంగా ఉండంటం నేర్చుకోండి.

ఓపెన్ టాప్ వెహికల్స్

ఓపెన్ టాప్ వెహికల్స్

వైల్డ్ సఫారీకి వెళ్లేటప్పుడు ఓపెన్ టాప్ వాహనాలను ఉపయోగించకండి.

దారిని బ్లాక్ చేయకండి

దారిని బ్లాక్ చేయకండి

జంతువులు వెళ్లే దారిని మీ వాహనాలతో బ్లాక్ చేయకండి.

మీరు కూడా ఇలాంటి సంఘటను ఎప్పుడైనా ఎదుర్కున్నారా..?

మీరు కూడా ఇలాంటి సంఘటను ఎప్పుడైనా ఎదుర్కున్నారా..?

మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఎప్పుడైనా ఎదురైందా..?

వీడియో

కారుపై ఆఫ్రికా ఏనుగు దాడి చేస్తున్నప్పుడు తీసిని వీడియోని వీక్షించండి.

Most Read Articles

English summary
Have you ever faced elephant attack, while your on wheels? These German tourists, who were on a safari in South Africa, encountered one. A five-ton male elephant was minding its own business fighting another elephant, when suddenly the out-of-town visitors caught its eye.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X