వర్షాకాలంలో ఘాట్ రోడ్ డ్రైవింగ్ టిప్స్..!!

By Vinay

ఈ వర్షాకాలంలో హిల్ స్టేషన్‌కు వెళ్లాలని ఆలోచన కలిగి ఉన్నారా? వర్షాకాలంలో ఘాట్ రోడ్ ప్రయాణంలో చాలా రకాల సూచనలు పాటించాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఘాట్ రోడ్‌లో డ్రైవింగ్ మామూలు రోడ్ డ్రైవింగ్ కన్నా పూర్తీగా భిన్నంగా ఉంటుంది. డ్రైవింగ్ స్టైల్‌ను కూడా పూర్తి స్థాయిలో మార్చుకోవాల్సి ఉంటుంది.
క్రింది కథనం ద్వారా వర్షాకాలంలో ఘాట్ రోడ్ డ్రైవింగ్‌లో పాటించవలసిన టిప్స్ గురించి తెలుసుకుందాం............

1. ఇన్సూరెన్స్ మరియు వాహన పత్రాలు :

1. ఇన్సూరెన్స్ మరియు వాహన పత్రాలు :

వర్షాకాలంలో ఘాట్ రోడ్ డ్రైవింగ్‌లో ఇన్సూరెన్స్ మరియు వాహన పత్రాలు తప్పని సరిగా వెంట తీసుకెళ్లాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగినపుడు అన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

2. వేగాన్ని నియంత్రించుకోవాలి :

2. వేగాన్ని నియంత్రించుకోవాలి :

ఘాట్ రోడ్ డ్రైవింగ్‌లో సాధ్యమైనంత వరకూ వేగాన్ని నియంత్రించుకోవాలి. మలుపుల్లో ఎదురు వాహనాలు కన్పించవు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. తడి వాతావరణంలో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.

3. టైర్లను చెక్ చేసుకోవాలి :

3. టైర్లను చెక్ చేసుకోవాలి :

రోడ్డుతో సంభందం కలిగి ఉండేవి టైర్లు మాత్రమే. కాబట్టి మొదట టైర్లను చెక్ చేసుకోవాలి. రుపాయి బిళ్లతో త్రెడ్ లోతును పరీక్షించాలి. కనీసం 1.6 మి.మీ లోతు ఉండాలి. లేకపోతే టైర్లను మార్చడం మంచిది.

4. వైపర్స్‌ను చెక్ చేసుకోవాలి :

4. వైపర్స్‌ను చెక్ చేసుకోవాలి :

కారు అద్దాన్ని వర్షపు నీటితో నిండుకోకుండా వైపర్స్‌ చాలా ఉపయోగపడుతాయి. కాబట్టి వైపర్స్‌ సరిగ్గా పని చేస్తున్నాయా అని చెక్ చేసుకోవాలి. లేకుంటే దారి కనపడకుండా ఉంటుంది.

5. హెడ్‍‌లైట్స్ వాడండి :

5. హెడ్‍‌లైట్స్ వాడండి :

వర్షం వల్ల పగలు కూడా రాత్రి మాదిరి మబ్బుగా కన్పించని విధంగా ఉంటుంది. అప్పుడు హెడ్‍‌లైట్స్ వాడటం ద్వారా మనం వెలుతురును పొందవచ్చు.

6. సరైన గేర్‌లో నడపాలి :

6. సరైన గేర్‌లో నడపాలి :

ఘాట్ రోడ్ డ్రైవింగ్‌లో క్రిందకి దిగుతున్నప్పుడు న్యూట్రల్‌లో నడుపుతుంటారు. న్యూట్రల్‌లో ఒక్కో సారి బ్రేక్‌లు పని చేయవు. కాబట్టి వాహనాన్ని గేర్‌లో నడపడం ఉత్తమం.

7. తరచు గేర్‌ను తగ్గించాలి :

7. తరచు గేర్‌ను తగ్గించాలి :

ఘాట్ రోడ్ డ్రైవింగ్‌లో ఎక్కువ వేగంతో వెళ్లడం సాధ్యం కాదు. కాబట్టి పరిస్థితిని బట్టి తరచు గేర్‌ను తగ్గించాలి.

8. హార్న్‌ను వాడండి :

8. హార్న్‌ను వాడండి :

ఘాట్ రోడ్ డ్రైవింగ్‌లో మలుపులో ముందున్న వాహనాలు కన్పించవు. హార్న్‌ను వాడటం వలన అవతలి వాహనానికి సంకేతం ఇచ్చినట్లు అవుతుంది.

9. దారి ఇచ్చి నడపండి :

9. దారి ఇచ్చి నడపండి :

ఘాట్ రోడ్ డ్రైవింగ్‌లో రోడ్డు మొత్తం మీరే ఆక్రమించకుండా అవతలి వాహనానికి దారి ఇచ్చి నడపండి. అప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు.

10. అన్ని డిస్టార్షన్స్‌ను దూరం చేయండి :

10. అన్ని డిస్టార్షన్స్‌ను దూరం చేయండి :

ఘాట్ రోడ్ డ్రైవింగ్‌లో స్టీరియో మరియు ప్యాసింజర్ వంటి అనవసర శబ్దాలను దూరం చేయండి. సెల్‌ఫోన్‌ను అసలు వాడకండి . పరధ్యానం వాహనం నడపటం మంచిది కాదు.

11. ఓవర్‌టేకింగ్ తగ్గిచండి :

11. ఓవర్‌టేకింగ్ తగ్గిచండి :

ఘాట్ రోడ్ డ్రైవింగ్‌లో చాలా వరకు ముందున్న వాహనాలను ఓవర్‌టేకింగ్ చేయడం తగ్గిచండి. ఓపికతో వాహనాన్ని నడపండి.

12. నీటిలో నడపడం :

12. నీటిలో నడపడం :

నీటి గుండా వాహనాన్ని నడపడం అత్యంత ప్రమాదకరం. తప్పక నీటిలో నడపాల్సివస్తే ఒకటో గేర్‌లో నెమ్మదిగా వాహనాన్ని నడపండి.

13. అనువైన ప్రాంతంలో నిలపండి :

13. అనువైన ప్రాంతంలో నిలపండి :

ఘాట్ రోడ్ డ్రైవింగ్‌లో వాహనాన్ని నిలపాల్సి వస్తే విశాలంగా అనువైన ప్రాంతంలో నిలపండి. దీని ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.

చివరిమాట

చివరిమాట

వర్షాకాలంలో ఘాట్ రోడ్ డ్రైవింగ్‌లో పాటించవలసిన టిప్స్ తప్పక పాటించండి. క్షేమంగా గమ్యాన్ని చేరుకోండి........

Also Read : మరిన్ని ఆసక్తికర విషయాలు


Also Read :
మరిన్ని ఆసక్తికర విషయాలు

Most Read Articles

English summary
Planning a trip to a hill station this monsoon? Then you should be aware of some ghat driving etiquette that will help ensure that you have a safe holiday. Because driving on hill roads is entirely different to driving in the plains, and one has to adjust their driving style to suit these very different conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X