డ్రైవింగ్‌లో గూగుల్ గ్లాస్ ధరించడం, మొబైల్ వినియోగించడం రెండూ ఒక్కటే!

By Ravi

సాంకేతిక రంగంలో 'గూగుల్ గ్లాస్' ఓ సరికొత్త విప్లవాన్ని తెచ్చిన సంగతి మనందరికీ తెలిసినదే. ప్రపంచం మొత్తం మన కంటి ముందు ఉంచగల ఈ చిన్న పరికరం, మనిషి భద్రతకు అండగా నిలబడతూనే, అడ్డంకిగా కూడా మారుతోంది. ఇటీవలి అధ్యయనం ప్రకారం, గూగుల్ గ్లాస్ ధరించి డ్రైవ్ చేయటం లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించడం రెండూ కూడా ఒకేరకమైన పరధ్యానాన్ని కలిగిస్తుందని తేలింది.

యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా సైకలాజికల్ రీసెర్చర్ బెన్ సాయెర్ చెప్పిన దాని ప్రకారం, ఊహించని ట్రాఫిక్ సందర్భంలో ప్రజలు ఎంత వేగంగా ప్రతిస్పందిస్తారో, వారి బ్రేక్‌లను ఎంత వేగంగా అప్లయ్ చేస్తారో అనే అంశాన్ని చూసినట్లయితే, గూగుల్ గ్లాస్ మరియు స్మార్ట్‌ఫోన్‌ల మధ్య పెద్ద వ్యత్యాసాన్ని తామేమీ గుర్తించలేదని అన్నారు.

driving with google glass

గూగుల్ గ్లాస్ సంస్థ ప్రతినిధి మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తున్నారు. వాయిస్ ఇన్‌పుట్స్, హెడ్ కమాండ్స్‌ను ఆధారంగా చేసుకొని గూగుల్ గ్లాసెస్ టెక్స్ట్ మెసేజెస్‌ను పంపించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి డ్రైవర్‌కు కావల్సిన పూర్తి సమాచారాన్ని అతి తక్కువ పరధ్యానంతో అందజేస్తాయని, దీని వలన డ్రైవల్ కళ్లు ఎల్లప్పుడూ రోడ్డుపైనే ఉంటాయని ఆయన చెబుతున్నారు.

గూగుల్ గ్లాసెస్ ధరించి డ్రైవ్ చేయటం వలన కళ్లు రోడ్డుపైనే ఉన్నప్పటికీ, మనస్సు మరియు ఆలోచన మాత్రం పరధ్యానానికి లోనవుతుందని సాయెర్ వాదిస్తున్నారు. దాదాపు 40 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో, డ్రైవింగ్ కోసం రియల్ కారుకు బదులుగా ఓ సిమ్యులేటర్‌ని ఉపయోగించారు. ఇందులో పాల్గొన్న వారు గూగుల్ గ్లాస్ ధరించి సిమ్యులేటర్ నడుపుతున్నప్పుడు మరియు సెల్‌ఫోన్ వినియోగిస్తూ సిమ్యులేటర్ నడుపుతున్నప్పుడు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి ఈ ఫలితాలను వెల్లడించారు.

ఏ సర్వేలు ఎలా ఉన్నప్పటికీ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పరధ్యానానికి గురిచేసే ఏ అంశాన్నైనా సరే పక్కన పెట్టి, పూర్తి ధీమాతో, సరైన అవగాహనతో, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, జాగ్రత్తగా డ్రైవ్ చేయటం అందరి ఆరోగ్యానికి మంచిది.

Most Read Articles

English summary
According to a recent study, wearing a Google Glass and using it while driving is as distracting as using a mobile phone while driving.
Story first published: Saturday, November 8, 2014, 13:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X