గుర్గావ్ నుండి జైపూర్ ట్రావెల్ కేవలం 90 నిమిషాల్లోనే

Written By:

భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం మేరకు గుర్గావ్ నుండి జైపూర్ కు కేవలం 90 నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. అందుకోసం ఈ రెండు నగరాల మధ్య నూతన ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి ఫైళ్లను సిద్దం చేస్తోంది.

ఇప్పుడు గురుగ్రామ్‌గా పిలువబడుతున్న ఒకప్పటి గుర్గావ్ నుండి రాజస్థాన్‌లోని జైపూర్‌ మధ్య దూరాన్ని కేవలం 90 నిమిషాల కాల వ్యవధిలోనే చేరుకునే విధంగా కేంద్రం నూతన రహదారి నిర్మాణం చేపట్టనుంది.

ఈ రహదారిని సూపర్ హై వే గా పిలవడం జరుగుతోంది. త్వరలో దీని నిర్మాణానికి సంభందించిన ప్రదిపాదనలు సిద్దం చేసి అతి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నాడు.

ప్రస్తుతం గురుగ్రామ్ నుండి జైపూర్ మధ్య దూరం 260కిలోమీటర్లుగా ఉంది. ఈ రెండు నగరాల మధ్య నూతన ప్రతిపాదిత రహదారిని 200 కిలోమీటర్లతో నగర శివారు ప్రాంతం మీదగా నిర్మించనున్నారు.

ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌వే యొక్క గరిష్ట స్పీడ్ లిమిట్ గంటకు 100 కిలోమీటర్లు మరియు జాతీయ రహదారుల మీద స్పీడ్ లిమిట్ గంటకు 90కిలోమీటర్లుగా ఉంది. ఈ వేగంతో వెళితే 90 నిమిషాల్లో ఈ రెండు నగరాల మధ్య దూరాన్ని చేధించడం దాదాపు అసాధ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని నూతన రహదారిని నిర్మించనున్నట్లు గడ్కరీ వివరించాడు.

నితిన్ గడ్కరీ గారు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రతిపాదిత ఎక్స్‌‌ప్రెస్‌వే ద్వారా వీలైనంత వరకు గరిష్ట వేగాన్ని అందుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించాడు. దీనిని గురుగ్రామ్ నుండి జైపూర్ ప్రధాన రింగ్ రోడ్డుకు అనుసంధానించనున్నట్లు తెలిపాడు.

ఈ రెండు నగరాల మధ్య నిర్మించతలపెట్టిన రహదారి మొత్తం పొడవు 200కిలోమీటర్లుగా ఉంటుందనే అంచనాతో తెలిపారు.
గమనిక: కథనంలోని ఫోటోలు కేవలం కేవలం అవగాహన కోసం మాత్రమే

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, March 14, 2017, 11:02 [IST]
English summary
Gurgaon To Jaipur Travel Time To Be Cut To Just 90 Minutes
Please Wait while comments are loading...

Latest Photos