ప్రపంచపు అత్యంత ధనికుల్లో ఒకరైన హెచ్‌సిఎల్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ కార్ కలెక్షన్

Written By:

ప్రపంచపు అత్యధిక ధనిక టెక్ దిగ్గజాల సంపద ఆధారంగా ఫోర్బ్స్ ప్రచురించిన ప్రపంచపు 100 మంది ధనిక టెక్ దిగ్గజాల జాబితాలో భారతీయులు కూడా కొంత మంది ఉన్నారు. ఇందులో 16బిలియన్ డాలర్ల సంపదతో శివ్ నాడార్‌ గారు 17వ స్థానంలో నిలిచారు.

దేశీయ టెక్ దిగ్గజాలలో మొదటి స్థానంలో అజీమ్ ప్రేమ్‌జీ నిలవగా రెండవ స్థానంలో శివ్ నాడార్‌‌ గారు నిలిచారు. శివ్ నాడార్ గారు 1976 లో హిందుస్తాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ [HCL] స్థాపించారు.

తన మేధస్సుతో ప్రపంచ దేశాలకు సుపరిచితమైన శివ్ నాడార్ ప్రారంభంలో డైలీ టెలిగ్రాఫ్ మరియు డైలీ న్యూస్ పేపర్ అనే వాటిని ప్రారంభించారు. ఈయన 1945లో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని తిరుచెండూరుకు సమీపంలోని మూలైపొజి గ్రామంలో జన్మించారు.

వ్యాపారంలోనే కాదు, అనేక అంకుర సంస్థలకు ప్రాణం పోస్తూ వచ్చాడు. విద్యా మరియు ఆరోగ్య వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టి తనదైన పాత్రపోషించాడు శివ్ నాడార్. వీటితో ఇతనికి కార్లంటే అమితమైన ఇష్టం. ప్రస్తుతం శివ్ నాడార్‌ వద్ద ఉన్న లగ్జరీ కార్లు మరియు విమానాలు గురించి చూద్దాం రండి...

ప్రతి ధనికుడికి కలల కారు ఏదైనా ఉందంటే, అది రోల్స్ రాయిస్ ఫాంటమ్ మాత్రమే, దేశవ్యాప్తంగా ఈ కారు ఉన్న వారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. అందులో ఒకరు శివ్ నాడార్ వద్ద కూడా ఈ కారు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఖరీదైన లగ్జరీ కార్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

గతంలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ రెండుగా విడిపోయి రోల్స్ రాయిస్ గా అవతరించింది. రోల్స్ రాయిస్ సంస్థ 2003లో ప్రపంచ కార్ల ప్రియులను మంత్రముగ్దుల్ని చేస్తూ ఈ ఫాంటమ్ లగ్జరీ కారు అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుండి హోదాకు చిహ్నంగా దీనిని ఎంచుకోవడానికి తహతహలాడిపోయేవారు.

కారులో సాంకేతికత ఇంజన్, మరియు కారు బాడీ నిర్మాణం పరంగా అనేక ప్రమాణాలతో అద్బుతంగా రూపొందించబడినా... ఇందులో ఉన్న ఫీచర్లకు ప్రపంచ వ్యాప్తంగా దీనికి అతి తక్కువ కాలంలో భారీ అభిమానులు పోగయ్యారు. ఫాంటమ్ ఇంటీరియర్‌లో నాణ్యమైన లెథర్ సీట్లు, కలపతో తీర్చిదిద్దిన సొబగులు వంటివి దీని ఇంటీరియర్‌కు మంచి లుక్ తెచ్చిపెట్టాయి.

రోల్స్ రాయిస్ ఇందులో 6.75-లీటర్ సామర్థ్యం గల వి12 ఇంజన్ అందించింది. ఇది గరిష్టంగా 453బిహెచ్‌పి పవర్ మరియు 720ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇంజన్ ఆర్‌పిఎమ్ 1000 ఉన్నపుడు గరిష్టంగా 75శాతం పవర్ ఉత్పత్తి అవుతుంది.

భారీ బరువున్న కారును అత్యంత వేగంగా నడపడానికి ఇందులోని వి12 ఇంజన్ ఎంతగానో సహకరించిందని చెప్పవచ్చు. ఇది కేవలం 5.8 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 97 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది.

సురక్షితమైన ప్రయాణానుకూలం ఉన్న ఇందులో సౌకర్యవంతమైన సీటింగ్ కోసం దీనిని 5.3మీటర్ల పొడవుతో, 1.98 మీటర్ల వెడల్పుతో 3.3 మీటర్ల పొడవైన వీల్ బేస్‌తో నిర్మించారు. ఇందులో 420వాట్స్ సామర్థ్యం ఉన్న 15-స్పీకర్ల మ్యూజిక్ సిస్టమ్ కలదు.

శివ్  నాడార్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ధర ఇండియాలో సుమారుగా రూ. 7 కోట్ల వరకు ఉంది.

క్లాసిక్ హోదాని నిలబట్టే మెర్సిడెస్ బెంజ్ 300 ఎస్ఎల్ కారును కూడా వినియోగించాడు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుకు అభిమాని కాకమునుపు శివ్ నాడార్ గారి ఫేవరెట్ కారు ఈ క్లాసిక్ మెర్సిడెస్ బెంజ్ 300ఎస్ఎల్.

చూడటానికి పాత కాలం నాటి కారు అనే భావన కలిగినప్పటికీ ఈ కారు పనితీరు స్పోర్ట్స్ కారు పనితీరుకు సమానం. మెర్సిడెస్ బెంజ్ సంస్థ ఈ 300 ఎస్ఎల్ కారులో 6.3-లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంజన్ అందించింది.

మెర్సిడెస్ బెంజ్ 300 ఎస్ఎల్ లోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 240బిహెచ్‌పి పవర్ మరియు 500ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. రెండు టన్నుల బరువున్న ఈ కారు గరిష్ట వేగం గంటకు 229 కిలోమీటర్లుగా ఉంది.

కార్లు మాత్రమే కాదు, శివ్ నాడార్ తన వ్యక్తిగత మరియు వ్యాపార అవసరాలకు ఎంబ్రాయర్ లెగసీ 650 ఎక్జ్సిక్యుటివ్ జెట్ విమానాన్ని కలిగి ఉన్నాడు.

ఈ జెట్ విమానంలో 13 మంది ప్రయాణించే సామర్థ్యం కలదు. శాటిలైట్ టివి, ఆఫీస్ పనులకు మరియు సమావేశాలకు అనువైన ఫీచర్లు అదే విధంగా వై-ఫై ఇంటర్నెట్ సదుపాయం కలదు.

ఈ విమానం ధర రూ. 175 కోట్ల రుపాయలుగా ఉంది. ఇందులో ఇద్దరు పైలట్లు ఉంటారు. ఎంబ్రాయర్ సంస్థ ఈ జెట్ విమానంలో రోల్స్ రాయిస్‌ ఉత్పత్తి చేసిన 3007ఏ అనే రెండు ఇంజన్‌లను అందించింది.

ఈ జెట్ విమానంలో ఒక్క సారి ఇంధన నింపితే 7,223కిలోమీటర్ల పాటు ప్రయాణిస్తుంది. మరియు గంటకు 850కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Monday, April 24, 2017, 10:22 [IST]
English summary
Read In Telugu To know About HCL Founder Shiv Nadar Car Collection
Please Wait while comments are loading...

Latest Photos