దేశాధిపతుల రాయల్ కార్లు.. ఎప్పుడైనా చూసారా..!!

By N Kumar

అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా భారత పర్యటనలో భాగంగా ఉపయోగించిన కారు గురించి మీరు వినేఉంటారు. ఈ కారు పేరు'లిమోసిన్' మరికొందరు ముద్దుగా మృగం అనిపిలుస్తారు. అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుని వాహనం ఆధునిక భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఒక్క బటన్ నొక్కడం ద్వారా అధ్యక్షుడి చుట్టూ 10 అంగుళాల మందం ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ ద్వారాలు తెరచుకొని ఆయన చుట్టూ రక్షణగా నిలుస్తాయి.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధిపతులు ఉపయోగించే స్పెషల్ కార్‌లను మీముందుంచుబోతున్నాం. ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నఈ కార్లు లగ్గరీ ఇంకా రక్షణాత్మక ఫీచర్లను కలిగి ఉంటాయి. రండి దేశాధిపతుల రాయిల్ కార్లను ఓ లుక్ వేద్దాం...

దేశాధిపతుల రాయిల్ కార్లు!

శక్తివంతమైన మనుషులు వారివారి శక్తివంతమైన కార్లు. ప్రవేశానికి స్వాగతం.....

దేశాధిపతుల రాయిల్ కార్లు!

యునైటెడ్ స్టేట్స్ - కాడిలాక్ వన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉపయోగించే కారు 'లిమోసిన్'. ఈ నలుపు రంగు కాడిలాక్ కారు సాంకేతికంగా ప్రపంచంలోనే పటిష్టమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనంగా గుర్తింపు తెచ్చుకుంది. బరువు 3 టన్నులు. టైర్లు పేలిపోయినా కారు ఆగకుండా ప్రయాణించగలదు.

దేశాధిపతుల రాయిల్ కార్లు!

భారత రాష్ట్రపతి మెర్సిడెస్ S600 పుల్ మాన్: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మెర్సిడెస్ - బెంజ్ ఎస్600 పుల్ మాన్ మోడల్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ మోడల్ కారును వివిధదేశాల పెద్దలు ఉపయోగించారు.

దేశాధిపతుల రాయిల్ కార్లు!

జపాన్ చక్రవర్తి ప్రత్యేక టయోటా: జపాన్ చక్రవర్తి హోదాలో కొనాసాగే వారు ఈ ప్రత్యేక టయోటా వాహనాన్ని ఆనవాయితీగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ కాబడిన ఈ కారు పేరు 'సెంచురీ రాయల్'.

దేశాధిపతుల రాయిల్ కార్లు!

జర్మనీ అధ్యక్షుడి ప్రీతిపాత్రమైన మెర్సిడెస్: జర్మనీ దేశాధ్యక్షునికి ఆడీ, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్-బెంబ్ వంటి ప్రత్యేక బ్రాండెడ్ కార్లను ఎంపిక చేసుకునే అవకాశముంది. అయితే, జర్మన్ అధ్యక్షుని అధికారిక వాహనంగా మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ వాహనం కొనసాగుతోంది.

దేశాధిపతుల రాయిల్ కార్లు!

న్యూజీల్యాండ్ గవర్నల్ జనరల్ - జాగ్వార్ ఎక్స్ జే8: కామెన్‌వెల్త్ దేశాల్లో న్యూజీల్యాండ్ ఒకటి. ఈ దేశ గవర్నర్ జనరల్ ఉపయోగించే బ్రిటీష్ బ్రాండ్ కారు జాగ్వార్ ఎక్స్ జే8 ప్రీమియమ్ సిడాన్ ప్రత్యేక వసతులను కలిగి ఉంటుంది.

దేశాధిపతుల రాయిల్ కార్లు!

హాంగ్ కాంగ్ అడ్మినిస్ట్రేటర్ లెక్సస్: హాంగ్ కాంగ్ పరిపాలనా విభాగానికి సంబంధించి చైనా ప్రభుత్వం ప్రత్యేక విభాగాధిపతిని నియమించింది. ఈయన ఉపయోగించే కారు లెక్సస్ ప్రీమియమ్ సిడాన్.

దేశాధిపతుల రాయిల్ కార్లు!

ఇంగ్లాండ్ ప్రధాన మంత్రి జాగ్వర్: ఇంగ్లాండ్ ప్రధానమంత్రి జేమ్స్ కామెరూన్ పొడవు చక్రాలు కలిగిన జాగ్వార్ ఎక్స్‌జే సెంటినల్ వాహనాన్ని అధికారికంగా ఉపయోగిస్తున్నారు.

దేశాధిపతుల రాయిల్ కార్లు!

కింగ్ ఆఫ్ మలేషియా - మేబాచ్: మలేషియా రాజు 'మేబ్యాక్ ఎస్62' కారులో ప్రయాణిస్తారు. ఈ విలాసవంతమైన వాహనం ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది.

దేశాధిపతుల రాయిల్ కార్లు!

స్వీడన్ రాజు క్లాసిక్ డైమ్లెర్: స్విడెన్ రాజు అధికారికగా ఉపయోగించే కారు 'క్లాసిక్ డైమ్లెర్ డీఎస్ 420'.

దేశాధిపతుల రాయిల్ కార్లు!

ఇటలీ అధ్యక్షుని కస్టమ్ బుల్ట్ కార్: ఐటలీ అధ్యక్షుడు ప్రత్యేకంగా రూపొందించబడిన లాన్సియా ఫ్లామినియా లిమౌసన్‌ను ఉపయోగిస్తున్నారు.

దేశాధిపతుల రాయిల్ కార్లు!

రోమానియా అధ్యక్షుని మెర్సిడెస్ - బెంజ్ ఎస్- క్లాస్.

దేశాధిపతుల రాయిల్ కార్లు!

సింగపూర్ అధ్యక్షుని మెర్సిడెస్ - బెంజ్ ఎస్350ఎల్ ప్రీమియమ్ సలోన్.

దేశాధిపతుల రాయిల్ కార్లు!

కెన్యా అధ్యక్షుని మెర్సిడెస్ -బెంజ్‌పుల్ మ్యాన్ ఎస్600.

దేశాధిపతుల రాయిల్ కార్లు!

చిలీ అధ్యక్షుని బ్లాక్ ఫోర్డ్ గెలాక్సీ ఎక్స్ఎల్. కన్వర్టబుల్ ఫీచర్లను ఈ కారు కలిగి ఉంది.

దేశాధిపతుల రాయిల్ కార్లు!

క్రొయేషియా అధ్యక్షుని మెర్సిడెస్ - బెంజ్ ఎస్-క్లాస్ కార్.

Most Read Articles

English summary
The heads of states, PMs, kings and queens get to ride cars that are powerful, luxurious and well protected. Here is a collection of presidential cars.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X