60 ఏళ్ల క్రిందట ప్రారంభమైన చెవర్లే కార్వెట్టే ఉత్పత్తి

By Ravi

ప్రపంచపు ఆటోమొబైల్ దిగ్గజాలలో ఒకటైన అమెరికన్ కంపెనీ జనరల్ మోటార్స్‌కు చెవర్లే బ్రాండ్‌లో కంపెనీ అందిస్తున్న అత్యంత పాపులర్ అమెరికన్ స్పోర్ట్స్ కార్ 'చెవర్లే కార్వెట్టే' ఉత్పత్తి ప్రారంభ రేపటితో 60 ఏళ్లు పూర్తికానున్నాయి. జూన్ 30, 1953లో మొట్టమొదటి చెవర్లే కార్వెట్టే కారును మిచ్‌లోని ఫ్లింట్‌లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో తయారయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 15 లక్షలకు పైగా కార్వెట్టే స్పోర్ట్స్ కార్లను జనరల్ మోటార్స్ ఉత్పత్తి చేసింది.

ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్కున చేర్చుకుంటూ జనలర్ మోటార్స్ తమ చెవర్లే కార్వెట్టేను ఆయా తరాల వినియోగదారులకు అనుకూలంగా అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది. గడచిన ఆరు దశాబ్ధాలుగా చెవర్లే కార్వెట్టే ఎంతో మంది అభిమానలను సొంతం చేసుకుంది. సినీతారలు, సంగీత కళాకారులు, వ్యోమగాములకు కూడా ఈ కారు హాట్ ఫేవరేట్‌గా మారిపోయింది.

మరి ఐకానిక్ అమెరికన్ స్పోర్ట్స్ కార్‌గా మిగిలిపోయిన ఈ చెవర్లే కార్వెట్టే 60 ఏళ్ల చరిత్రలో కొన్ని కీలక నిజాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

అప్పటి నుండి ఇప్పటి వరకు..

అప్పటి నుండి ఇప్పటి వరకు..

చెవర్లే కార్వెట్టే ప్రపంచంలో కెల్లా దీర్ఘకాలంగా, నిరంతరాయంగా ఉత్పత్తి చేయబడుతున్న ప్యాసింజ్ కారు.

మొట్టమొదటి ప్రదర్శన

మొట్టమొదటి ప్రదర్శన

జనవరి 17, 1953లో న్యూయార్క్ సిటీలో జరిగిన జనరల్ మోటార్స్ ఆటోరమా ప్రదర్శనలో తొలిసారిగా కాన్సెప్ట్ రూపంలో కార్వెట్టేను ప్రదర్శించబడినది.

తొలి ఉత్పత్తి

తొలి ఉత్పత్తి

అదే సంవత్సరం(1953)లో జూన్‌ 30న ఈ కారు ఉత్పత్తి ప్రారంభమైంది. అప్పట్లో దీని ఉత్పత్తిని 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు.

అద్భుతమైన సేల్స్

అద్భుతమైన సేల్స్

ఆ రోజుల్లో ఈ కారు హాట్ కేకుల్లా అమ్ముడుపోయి కంపెనీకు మంచి సక్సెస్‌ను సాధించి పెట్టింది.

ఎక్స్టీరియర్, ఇంటీరియర్ కలర్స్

ఎక్స్టీరియర్, ఇంటీరియర్ కలర్స్

అన్ని 1953 మోడళ్లు కూడా పోలో వైట్ ఎక్స్టీరియర్ రంగును, రెడ్ ఇంటీరియర్ రంగును కలిగి ఉండేవి.

1953 చెవర్లే కార్వెట్టే ధర

1953 చెవర్లే కార్వెట్టే ధర

1953లో చెవర్లే కార్వెట్టే ధర 3,498 అమెరికన్ డాలర్లు మాత్రమే. ఇప్పటి మన కరెన్సీ రేటు ప్రకారం చూసుకుంటే, మన దేశం కరెన్సీలో దీని విలువ కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే.

వేలంలో రికార్డు ధర

వేలంలో రికార్డు ధర

2006లో నిర్వహించిన ఓ వేలంలో అప్పట్లో కంపెనీ ఉత్పత్తి చేసిన మూడవ 1953 కార్వెట్టే మోడల్ ఏకంగా 10.6 లక్షల డాలర్ల వెల పలికింది.

సిక్స్-సిలిండర్ ఇంజన్‌ బంద్

సిక్స్-సిలిండర్ ఇంజన్‌ బంద్

1955 వరకు చెవర్లే కార్వెట్టేలో ఇన్‌‌లైన్ సిక్స్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఆ సంవత్సరంలో 90 శాతం మంది కొనుగోలుదారురు ఆప్షన్ వి-8 ఇందన్ కోసం ఆర్డర్లు చేశారు.

వి-8 ఇంజన్ ప్రవేశం

వి-8 ఇంజన్ ప్రవేశం

1956లో సిక్స్-సిలిండ్ ఇంజన్‌ను నిలిపివేసి, దాని స్థానంలో వి-8 ఇంజన్‌ను ప్రవేశపెట్టారు.

తొలి 10 ఏళ్లు కన్వర్టిబల్ మాత్రమే

తొలి 10 ఏళ్లు కన్వర్టిబల్ మాత్రమే

కార్వెట్టేను మొదటి 10 సంవత్సరాల వరకు కన్వర్టిబల్ రూపంలో మాత్రమే తయారు చేసేవారు. 1963లో ఫిక్స్డ్ రూఫ్, స్ప్లిట్ విండో కలిగిన కార్వెక్టే స్టింగ్ రే కూపేను రెండవ తరం (సెకండ్ జనరేషన్) కార్వెట్టేగా విడుదలల చేశారు.

కొత్త మోడల్‌తో అమ్మకాలు రెట్టింపు

కొత్త మోడల్‌తో అమ్మకాలు రెట్టింపు

చెవర్లే కార్వెక్టే స్టింగ్ రే కూపేను విడుదల చేసిన కంపెనీ అమ్మకాలు మునపటి కన్నా రెట్టింపు అయ్యాయి.

15 లక్షలకు పైగా కార్వెట్టేలు

15 లక్షలకు పైగా కార్వెట్టేలు

జూన్ 30, 1953 నుంచి ఇప్పటి వరకు సుమారు 15.6 లక్షల కార్వెట్టేలను ఉత్పత్తి చేశారు. 5,00,000వ కార్వెట్టేను 1977లో 10,00,000వ కార్వెట్టేను 1992లో మరియు 15,00,000వ కార్వెట్టేను 2009లో ఉత్పత్తి చేశారు.

ఉత్పత్తి కేంద్రాలు

ఉత్పత్తి కేంద్రాలు

కార్వెట్టేను మూడు ఉత్పత్తి కేంద్రాల్లో తయారు చేశారు. 1. ఫ్లింట్, మిచ్ (1953), 2. సెయింట్ లూయిస్ మో. (1954-1981), 3. బౌలింగ్ గ్రీన్. కెవై (1981-2014).

1984 కార్వెట్టే

1984 కార్వెట్టే

సరికొత్త 1984 కార్వెట్టేను తయారు చేయటం కోసం 1983 కార్వెట్టేలను ప్రజలకు విక్రయించలేదు. ఆ మోడల్ ఉత్పత్తిని నిలిపివేశారు.

44 ప్రోటోటైప్‌లలో ఒక్కటి మాత్రమే

44 ప్రోటోటైప్‌లలో ఒక్కటి మాత్రమే

1983 మోడళ్లుగా 44 కార్వెట్టే ప్రోటోటైప్‌లను తయారు చేశారు. అందులో ఒక్కదానిని మాత్రమే ఎంచుకొని, బౌలింగ్ గ్రీన్‌లోని నేషనల్ కార్వెట్టే మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.

1990 చెవర్లే కార్వెట్టే

1990 చెవర్లే కార్వెట్టే

1997 చెవర్లే కార్వెట్టే

1997 చెవర్లే కార్వెట్టే

2005 చెవర్లే కార్వెట్టే

2005 చెవర్లే కార్వెట్టే

2011 చెవర్లే కార్వెట్టే

2011 చెవర్లే కార్వెట్టే

2011 చెవర్లే కార్వెట్టే

2011 చెవర్లే కార్వెట్టే

చెవర్లే కార్వెట్టే: నాడు - నేడు

చెవర్లే కార్వెట్టే: నాడు - నేడు

చెవర్లే కార్వెట్టే 60వ వార్షికోత్సవ ఎడిషన్ టీజర్

చెవర్లే కార్వెట్టే 60వ వార్షికోత్సవ ఎడిషన్ టీజర్

Most Read Articles

English summary
Chevrolet today marked its 60th anniversary of the Corvette, an iconic American sports car. The first Corvette went into production in Flint, Mich. on June 30, 1953. Since then, more than 1.5 million Corvettes have been produced. Here are some key facts highlighting 60 years of Corvette history:
Story first published: Saturday, June 29, 2013, 16:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X