ఘోరమైన హోండా సిబిఆర్250ఆర్ క్రాష్: మీరు ఇలాంటి తప్పు చేయకండి!

Written By:

ముంబాయ్‌లో అర్థరాత్రి ఓ రహదారి మీద హోండా సిబిఆర్ 250ఆర్ భారీ వేగంతో U-మలుపు తీసుకుంటున్న సంధర్బంలో జాగ్వార్ ఎక్స్ఇ కారును వేగంతో ఢీ కొట్టింది. అర్థరాత్రి రహదారులు నిర్మానుష్యంగా ఉంటాయి అయినప్పటికీ భారీ ప్రమాదం చోటు చేసుకుంది.

రెండు ఖరీదైన వాహనాలు ముంబాయ్‌లోని మెరీనా ప్లాజాకు సిగ్నల్‌కు సమీపంలో ఢీకొన్నాయి. ఇందులో జాగ్వార్ ఎక్స్ఇ కారు U-యుర్న్ తీసుకుంటుండగా హోండా సిబిఆర్ 250ఆర్ భారీ వేగంతో ఢీకొట్టింది.

ప్రమాద ప్రభావం కారు ఎడమ వైపు ఫ్రంట్ డోరు మీద తీవ్రంగా ఉంది. ఒక రైడర్ కారులోపలి దూసుకెళ్లగా మరొక రైడర్ కారు అద్దం మీద ఎగిరిపడ్డాడు.

కారు ఎడమ వైపు ముందు డోరు పూర్తిగా లోపలికి చొచ్చుకెళ్లింది. ప్రమాదం జరగడానికి ముందుగానే బైకు మీదున్న రైడర్లు రెండు మీటర్ల పాటు గాలిలో ఎగిరి కారు మీద పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

జాగ్వార్ ఎక్స్ఇ మరియు హోండా సిబిఆర్ 250ఆర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు.

జాగ్వార్ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి స్నేహితుడు మాట్లాడుతూ, హోండా సిబిఆర్ 250ఆర్ మోటార్ సైకిల్‌ భారీ వేగంతో దూసుకొచ్చందని, యు-టర్న జంక్షన్‌లో గమనించకుండా భారీ వేగంతో వచ్చి ఢీకొట్టినట్లు పేర్కొన్నాడు.

హోండా సిబిఆర్ 250ఆర్ బైకులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనే సేఫ్టీ ఫీచర్ ఉంది. అయినా కూడా ప్రమాద తీవ్రతను ఏ మాత్రం తగ్గించలేదు.

యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లాభం ఏమిటి ? యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండటం ద్వారా బ్రేకులు అప్లై చేసినప్పుడు నిలిచే దూరం చాలా వరకు తక్కువగా ఉంటుంది.

సాధారణ బ్రేకులను వినియోగించినప్పుడు కన్నా ఏబిఎస్ ఉన్నపుడు తక్కువ దూరంలోనే వాహనాన్ని నిలపవచ్చు. హోండా సిబిఆర్ 250ఆర్ లో ఈ ఏబిఎస్ ఫీచర్ ఉన్నప్పటికీ ప్రమాదాన్ని నివారించలేకపోయంది.

ఈ హోండా సిబిఆర్ 250ఆర్ మోటార్ సైకిల్‌లో అధునాత ఎగ్జాస్ట్ సిస్టమ్ కలదు. అయినప్పటికీ ఈ ప్రమాద తీవ్రత జాగ్వార్ కారు డోరు మీద తీవ్రంగా ఉంది.

జాగ్వార్ ఎక్స్ఇ కారులో ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు సమయానికి విచ్చుకుంది.తద్వారా ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్యాసింజర్ బయటపడ్డాడు.

యు-టర్న్ తీసుకునేటప్పుడు పాటించవలసిన కొన్ని చిట్కాలు మీ కోసం..... U-యుర్న్ తీసుకునే సమయంలో మీకు వ్యతిరేక రోడ్డులో వాహనాల రాక పోకలను గుర్తించండి.

ప్రధానంగా టూ వీలర్ల రాకపోకలను గుర్తించాల్సి ఉంటుంది. మీరు ఆ మార్గంలోకి యు-టర్న్ ద్వారా వెళుతున్న విషయాన్ని మీకు వ్యతిరేక రహదారిలో ప్రయాణించే వారికి తెలియజేయడం తప్పనిసరి.

అందుకు టర్న్ ఇండికేటర్స్ ఉపయోగించడం మరియు లైట్లను డిమ్ అండ్ డిప్ చేయడం, పగటి పూట అయితే హార్న్ మరియు టర్న్ సిగ్నల్స్ తప్పనిసరి.

ద్విచక్ర వాహనదారులు బైకుల యొక్క గరిష్ట వేగాన్ని రాత్రి వేళల్లో ఎట్టి పరిస్థితుల్లో పరీక్షించకూడదు. ప్రత్యేకించి గరిష్ట వేగంతో ప్రయాణించడాన్ని దాదాపుగా మానుకోవడం ఉత్తమం.

చీకటిలో గరిష్ట వేగంతో ప్రయాణించే సమయంలో దృష్టి సామర్థ్యం అంతగా ఉండదు. సాధారణ వేళల కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి షడన్‌గా మీ ముందుకు వచ్చే వాటిని గమనించలేరు.

ఒక రహదారిలోని డివైడర్లకు మధ్యలో అక్కడక్కడ గ్యాపులు ఉంటాయి మరియు కొన్ని మధ్య స్థాయి జంక్షన్‌లలో స్పీడ్ బంప్స్ ఉంటాయి. వీటిని సురక్షితంగా అధిగమించేందుకు నిర్ణత వేగాన్ని మాత్రమే పాటించాలి.

బైకు గరిష్ట వేగంతో ప్రయాణిస్తూ, యు-టర్న్ సందర్బంలో నియంత్రణ కోల్పోయి కారును ఢీకొట్టడానికి ఉదాహరణగా ఈ వీడియోను ఉదాహరణగా వీక్షించగలరు.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, April 18, 2017, 0:17 [IST]
English summary
Read in Telugu to know about Honda CBR 250R Hits Jaguar XE High Speed Crash Mumbai
Please Wait while comments are loading...

Latest Photos