హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్ - ది ఫ్లయింగ్ బ్యూటీ

By Ravi

సరసమైన ధరలకే బెస్ట్ మైలేజ్‌నిచ్చే కార్లను తయారు చేసే హోండా త్వరలోనే జెట్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌‌ను కూడా తయారు చేయనుంది. ఇప్పటికే ఆటోమొబైల్స్, ఆల్-టెర్రైన్ వాహనాలు, లాన్ మూవర్స్, ఇంజన్స్, హ్యుమనాయిడ్ రోబోట్స్ వంటి పలు విశిష్ట ఉత్పత్తులను తయారు చేసిన జపనీస్ బ్రాండ్ హోండా ఇకపై చిన్న సైజు జెట్ విమానాలను కూడా తయారు చేయనుంది.

హోండా ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ తమ తొలి ప్రొడక్షన్ జెట్ విమానం 'హోండాజెట్' (HondaJet)తో విమానయాన రంగంలో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. హోండాజెట్ ఒక తేలికపాటి ప్రైవేట్ వాణిజ్య విమానం. అంతేకాదు, ఈ జెట్ విమానం ప్రైవేట్ జెట్స్ ప్రపంచంలో కెల్లా అత్యంత అందంగా కనిపించే విమానం. హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్ చాలా విశిష్టమైనది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

హోండా జెట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. తర్వాతి స్లైడ్‌లను పరిశీలించండి.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

హోండా 1980 నుంచి చిన్న సైజు విమానాలపై పరిశోధన, అభివృద్ధి పనులను నిర్వహిస్తూనే ఉంది. అయితే, ప్రత్యేకించి ఈ హోండాజెట్ ప్రాజెక్ట్‌ను 2003లో ప్రారంభించారు. మరికొద్ది నెలల్లోనే తొలి ప్రొడక్షన్ మోడల్ పూర్తిస్థాయిలో ఉత్పత్తికి చేరుకోనుంది.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

తొలి హోండాజెట్‌కు సంబంధించిన ఉత్పత్తి పనులు దాదాపు పూర్తయ్యాయి. మరో ఎనిమిది వివిధ దశలకు చెందిన పనులు పూర్తి కావల్సి ఉన్నాయి.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

జిఈ హోండా హెచ్ఎఫ్120 ఒక చిన్న టర్బోఫ్యాన్ జెట్ ఇంజన్. దీనిని జెనరల్ ఎలక్ట్రిక్ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది టేకాఫ్ సమయంలో 2050 ఎల్‌బి-ఎఫ్‌టిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

ఇలాంటి రెండు ఇంజన్లను హోండాజెట్‌లో అమర్చుతారు. ఈ ఇంజన్ల వలన హోండాజెట్ గాలిలో గరిష్టంగా గంటకు 420 నాట్ల (గంటకు 780 కి.మీ.) వేగంతో ప్రయాణిస్తుంది. దీని గరిష్ట ఆల్టిట్యూడ్ 30,000 అడుగులు, ఇది నిమిషానికి 3990 అడుగుల ఆల్టిట్యూడ్‌ను చేరుకోగలదు.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

ఈ ఎయిర్‌క్రాఫ్ట్ కేవలం 4000 అడుగుల పొడవు కన్నా తక్కువ ఉన్న రన్‌వే పైనే టేకాఫ్ కాగలదు, అలాగే 3000 అడుగుల కన్నా తక్కువ పొడవున్న రన్‌లేపై ల్యాండింగ్ కాగలదు.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

హోండాజెట్ ఈ విభాగంలో కెల్లా విశిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ విమానంలో రెండు ఇంజన్లను ఇరువైపుల రెక్కలలో అమర్చబడి ఉంటాయి. ఈ సెగ్మెంట్లోని సాధారణ విమానాల్లో ఇంజన్లు విమానం వెనుక భాగంలో ఇరువైపులా ఉంటాయి.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

ఈ విశిష్టమైన డిజైన్‌ను హోండా ఓవర్-ది-వింగ్ ఇంజన్ మౌంట్ (ఓటిడబ్ల్యూఈఎమ్) అని పిలుస్తోంది. రెక్కల వద్ద ఇంజన్లను అమర్చడం వలన విమానం లోపల మరింత ఎక్కువ స్పేస్ లభించడమే కాకుండా, శబ్ధం తగ్గుతుంది మరియు ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ పెరుగుతుంది.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

హోండా ఓవర్-ది-వింగ్ ఇంజన్ మౌంట్ (ఓటిడబ్ల్యూఈఎమ్) డిజైన్ కారణంగా హోండాజెట్ నోస్, ఆఫ్ట్ వద్ద 66 ఘనపు అడుగులు లగేజ్ స్థలం లభిస్తుంది.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

హోండాజెట్ ఈ సెగ్మెంట్లోని లైట్ బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో పోల్చుకుంటే, అతి తక్కువ మోతాదులో నైట్రోజెన్ డైఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది. వాస్తవానికి ఇది ఈ క్లాస్‌లో కెల్లా అత్యుత్తమ ఫ్యూయెల్ ఎఫీషియన్సీని అందిస్తుంది.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

ఫ్యూజ్‌లాగ్‌ను అల్యూమినియంతో కాకుండా కార్బన్‌ఫైబర్‌తో తయారు చేసిన అతికొద్ది ఎయిర్‌క్రాఫ్ట్‌లలో హోండాజెట్ కూడా ఒకటి. కో-క్యూర్డ్ ఇంటిగ్రల్ స్ట్రక్చర్ మరియు హనీకోంబ్ శాండ్‌విచ్ స్ట్రక్చర్‌ల యొక్క కటింగ్-ఎడ్జ్ కాంబినేషన్ నుంచి ఈ ఫ్యూజ్‌లాగ్‌ను తయారు చేశారు.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

హోండాజెట్ డిజైన్‌లో న్యాచురల్ లామినార్ ఫ్లో (ఎన్ఎల్ఎఫ్) టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ వలన జెట్ ఏరోడైనమిక్ ఎఫీషియెన్సీ మెరుగుపడుతుంది. ఎన్ఎల్ఎఫ్, ఓటిడబ్ల్యూఈఎమ్‌లు కలిసి ఈ విభాగంలో కెల్లా హోండా జెట్ అత్యంత అధునాత జెట్ విమానంగా నిలిచేలా చేశాయి.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

హోండాజెట్ లైట్‌వెయిట్ ప్రైవేట్ జెట్ విభాగం క్రిందకు వస్తుంది. ఇందులో గరిష్టంగా 7 మంది (ఇద్దరు పైలట్లతో కలిపి) వరకు ప్రయాణించవచ్చు. స్టాండర్డ్ సీటింగ్ కాన్ఫిగరేషన్ 2+4గా ఉంటుంది.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

హోండాజెట్ మొబైల్-డివైజ్-కంట్రోల్డ్ క్యాబిన్‌తో లభిస్తుంది. ప్యాసింజర్లు క్యాబిన్ ఆడియో, లైటింగ్, టెంపరేచర్ మరియు ఎలక్ట్రోక్రోమిక్ విండో షేడ్లను స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్ల సాయంతో కంట్రోల్ చేసుకోవచ్చు.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

పైలట్లు కూర్చునే కాక్‌పిట్‌లో నెక్స్ట్ జనరేషన్ గార్మిన్ జి3000 ఆల్-గ్లాస్ ఏవియేషన్ సిస్టమ్, డ్యూయెల్ టచ్‌స్క్రీన్ కంట్రోలర్స్ మరియు 14-ఇంచ్ ల్యాండ్‌స్కేప్ హై-రెజల్యూషన్ డిస్‌ప్లే సిస్టమ్స్ ఉంటాయి.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

ఈ యూజర్ ఫ్రెండ్లీ కాక్‌పిట్ ఒక పైలట్ లేదా ఇద్దరు పైలట్లు దీనిని ఆపరేట్ చేసేలా డిజైన్ చేయబడి ఉంటుంది.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

మొట్టమొదటి హోండాజెట్‌కు కొత్త ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్‌ను జోడించనున్నారు. ఇది పెరల్ గ్రీన్, గోల్డెన్ స్ట్రైప్‌ను కలిగి ఉంటుంది. ఇతర ఎక్స్టీరియర్ కలర్లలో సిల్వర్, రెడ్, యల్లో, బ్లూ వంటివి ఉన్నాయి.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

హోండా ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ మరియు తమకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డీలర్ నెట్‌వర్క్ మరియు సప్లయర్ల నెట్‌వర్క్ ద్వారా ఈ విమానాల గురించి కస్టమర్లకు సమాచారం అందించేందుకు కలిసి పనిచేస్తున్నట్లు హోండా ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ మిషిమసా ఫుజినో తెలిపారు.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

మొట్టమొదటి వాహనం డెలివరీ చేసే సమయానికి అన్ని సిద్ధంగా ఉండేలా చూసుకోవటమే తమ లక్ష్యమని, మొదటి రోజు నుంచే కస్టమర్లకు మంచి యాజమాన్య అనుభూతిని కల్పించేందుకు కట్టుబడి ఉంటామని ఫుజినో చెప్పారు.

హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్

మరి మీకూ నచ్చిందా ఈ హోండాజెట్ ఎయిర్‌క్రాఫ్ట్..?

మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాతో పంచుకోగలరు..!

Most Read Articles

English summary
Honda, the manufacturer of affordable and fuel efficient passenger cars, motorcycles, ATVs, lawn mowers, engines and humanoid robots, will soon also be called the manufacturer of jet aircrafts.
Story first published: Friday, May 23, 2014, 12:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X