విపరీతమైన ఎండ వేడిమి కారణంగా కారు మీదకు దూసుకెళ్లిన అశ్వం

Written By:

మనం ఇంత వరకు ఎన్నో కార్ల ప్రమాదాలు చూసుంటాం లేదా చదివి ఉంటాం. కానీ ఈ కథనంలో మీరు చదవబోయే క్రాష్ స్టోరీ కాస్త భిన్నమైనది. ఓ అశ్వం నియంత్రణ కోల్పోయి వేగంగా వస్తున్న కారు మీదకు దూసుకెళ్లి ఈ భయంకరమైన ప్రమాదం చోటు చేసుకుంది.

కారు మీదకు నియంత్రణ కోల్పోయిన గుర్రం దూసుకెళ్లిన కారణంగా చోటు చేసుకున్న ప్రమాదం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూరు సమీపంలోని హసన్‌పూర్ ప్రాంత పరిధిలో సంభవించింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ మరియు అశ్వం స్వల్ప గాయాలతో బయటపడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

జట్కా నిర్వాహకుడు ఈ గుర్రాన్ని రోడ్డుకు అనుకుని ఉన్న స్తంభానికి తాడుతో బంధించి, ఓ సంచిలో మేత వేశాడు. అయితే తీవ్రమైన ఎండ వేడిమిని తట్టుకోలేక తాడును తప్పించుకుంది. అశ్వం కళ్లకు గంతలుండటంతో నియంత్రణ లేకుండా రోడ్డు మీద అడ్డదిడ్డంగా పరిగెడుతూ, ఎదురుగా వస్తున్న కారు మీదకు దూసుకుపోయింది.

తొలుత ద్విచక్ర వాహనాదారుడు మీదకు దుమికి గాయపరిచిన అనంతరం కారు ముందు అద్దం మీదుగా ఇంటీరియర్ లోని చొచ్చుకుపోయి ఇరుక్కుపోయింది.

స్థానికుల కథనం మేరకు, తీవ్రమైన ఎండ వేడిమి కారణంగానే గుర్రం ఇలా ప్రవర్తించిందని తేలింది. అటవీ శాఖ అధికారులు మరియు స్థానికులు శ్రమించి అశ్వాన్ని కారును వెలికి తీశారు. ముందు వైపు అద్దం చిన్నగా ఉండటంతో అశ్వం సగ భాగం కారులోనికి చొచ్చుకెళ్లింది.

జంతు వైద్యుడు అరవింద్ మాథుర్ ప్రస్తుతం అశ్వానికి చికిత్సను అందిస్తున్నాడు. విపరీతమైన ఎండ వేడిమి కారణంగానే ఇలా జరిగిందని డాక్టర్ తెలిపాడు. ప్రమాదానికి గురైన కారు హ్యుందాయ్ ఐ10 అని తెలుస్తోంది. అయితే అశ్వంతో పాటు కారు డ్రైవర్ కూడా సురక్షితంగా ఉన్నాడు.
Picture credit: Rajasthan Patrika

కారు లోపలికి చొచ్చుకుపోయిన గుర్రాన్ని మరియు ప్రమాద స్థలిని వీడియో ద్వారా వీక్షించగలరు...

English summary
Read In Telugu About Horse Collides With Car In A Freak Accident.
Please Wait while comments are loading...

Latest Photos