వెయ్యి మైళ్ల సూపర్‌సోనిక్ కారు వేగం వెనుక దాగున్న రహస్యం!

By Ravi

గంటకు 1600 కిలోమీటర్ల (1000 మైళ్ల) వేగంతో వెళ్లే కారు (బ్లడ్‌హౌండ్) మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు జెట్ ఇంజన్‌తో నడిచే 'బ్లడ్‌హౌండ్' (Bloodhound) అనే సూపర్‌సోనిక్ కారును అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. కాగా.. తాజాగా ఈ కారుకు వెయ్యి మైళ్ల వేగాన్ని సాధ్యం చేయగలిగే మార్గాన్ని శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు.

ఈ విషయంపై అధ్యయనం చేసిన స్కాన్సియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, భూమిపై నడిచే వాహనాలు సురక్షిత స్థితిలో ఇంత వేగాన్ని ఎలా అందుకోగలవోననే అంశాన్ని డీకోడ్ చేశారు. ఫార్ములా వన్ ఇంజనీరింగ్ పద్ధతులు మరియు వైమానిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారు ఏరోడైనమిక్స్ ద్వారా ఇది సాధ్యమవుతుందని తేల్చారు.

ఈ కారు ఏరోడైనమిక్స్ రోడ్డుపై వెళ్లేటప్పుడు వాహనం పక్కకు ఒరిగిపోయే ప్రమాదాన్ని తగ్గించి, ఏరోడైనమిక్ బలాలు నిట్టనిలువుగా ప్రయోగించడం వలన గంటకు 1000 మైళ్ల వేగంలోను ఈ కారుకి స్థిరత్వాన్ని కల్పించవచ్చని పరిశోధకలు చెబుతున్నారు.

బుల్లెట్ కంటే వేగంగా ప్రయాణించే ఈ సూపర్ కారు పేరు 'బ్లడ్‌హౌండ్' సూపర్‌సోనిక్ కారుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

బ్లడ్‌హౌండ్ ప్రాజెక్ట్

బ్లడ్‌హౌండ్ ప్రాజెక్ట్

బ్లడ్‌హౌండ్ ప్రాజెక్టుకు రిచర్డ్ నోబెల్ సారథ్యం వహిస్తున్నారు. ఆయన ఈ తరహా కారు నిర్మించడం ఇదే మొదటిసారి కాదు. ఈ కారు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. వాస్తవానికి ఈ కారు 2012లో నిజం రూపం దాల్చాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నెమ్మదిగా సాగుతోంది. 2016లో ఇది ప్రతిపాదిత వేగాన్ని అందుకోనుంది.

బ్లడ్‌హౌండ్ ప్రాజెక్టులో మన ఇండియన్

బ్లడ్‌హౌండ్ ప్రాజెక్టులో మన ఇండియన్

దక్షిణాఫ్రికాలోని భారతీయ సంతతికి చెందిన 29 ఏళ్ల మహిళ ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే బ్లడ్‌హౌండ్ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించనున్నారు. యూకెలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన నిపులైన ఇంజనీర్ల బృందంలో 'బెవర్లీ సింగ్' కూడా ఒకరు. పోర్ట్ ఎలిజబెత్ నుంచి మెకానికల్ ఇంజనీర్ అయిన బెవర్లీ సింగ్, యూకేలోని బ్రిస్టల్‌కు సమీపంలోని ఓ హైటెక్ కేంద్రంలో నిర్మిస్తున్న 'బ్లడ్‌హౌండ్ సూపర్‌‌సోనిక్ కార్'ను నిర్మిస్తున్న 30 మంది ఇంజనీర్ల బృందంలో ఈమె కూడా తన వంతు సాయం చేయనుంది.

రోల్స్ రాయిస్ మద్దతు

రోల్స్ రాయిస్ మద్దతు

ఈ బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారు ప్రాజెక్టుకు బ్రిటీష్ ఆటో దిగ్గజం రోల్స్ రాయిస్ కూడా తమ వంతు మద్దతు అందిస్తోంది. ఇందులో భాగంగానే, ఈ ప్రాజెక్టుకు కావల్సిన ఇంజన్, ఆర్థిక మరియు సాంకేతిక మద్ధతులను రోల్స్ రాయిస్ అందిస్తోంది.

జెట్ ఇంజన్

జెట్ ఇంజన్

బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారులో రోల్స్ రాయిస్ ఈజె200 జెట్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇదే ఇంజన్‌ను యూరోఫైటర్ టైఫూన్ కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉపయోగించారు.

దక్షిణాఫ్రికాలో టెస్టింగ్

దక్షిణాఫ్రికాలో టెస్టింగ్

గంటకు గరిష్టంగా 1600 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే ఈ కారును నడపాలంటే సాధారణ రోడ్లు పనికిరావు. అందుకే ఈ బ్లడ్‌హౌండ్ కారును దక్షిణాఫ్రికాలోని నార్తర్న్ కేప్ ప్రావిన్స్‌లో ఉన్న హాక్‌స్కీన్ పాన్ అనే ఎండిపోయిన సరస్సు లోపల మాత్రమే టెస్ట్ చేయనున్నారు.

హాక్‌స్కీన్ పాన్ సరస్సు

హాక్‌స్కీన్ పాన్ సరస్సు

ఈ కారును టెస్టింగ్ చేసేందుకు దక్షిణాఫ్రికాలోని నార్తర్న్ కేప్ ప్రావిన్స్‌లో ఉన్న హాక్‌స్కీన్ పాన్ అనే ఎండిపోయిన ఈ సరస్సు గర్భాన్ని రేస్‌ ట్రాక్‌గా మారుస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

సరస్సు క్లీనింగ్

సరస్సు క్లీనింగ్

బ్లడ్‌హౌండ్ సూపర్‌కారు అంత గరిష్ట వేగంతో వెళ్తుంది కాబట్టి, కారుకు ఏ చిన్న రాయి తగిలినా చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే సుమారు 20 కిలోమీటర్ల పొడవు, 1.5 కిలోమీటర్ల వెడల్పు ఉండేలా ఈ సరస్సు గర్భాన్ని దాదాపు 300 మంది కార్యకర్తలు శుభ్రం చేస్తున్నారు. చిన్నచిన్న రాళ్లను ఏరిపారేస్తున్నారు.

థ్రస్ట్-2 సూపర్‌సోనిక్ కార్

థ్రస్ట్-2 సూపర్‌సోనిక్ కార్

గతంలో రిచర్డ్ నోబెల్ గరిష్టంగా గంటకు 1019 కిలోమీటర్ల వేగంతో నడిచే ‘థ్రస్ట్-2'ను విజయవంతంగా నడిపి చూపించారు.

థ్రస్ట్ సూపర్‌సోనిక్ కార్

థ్రస్ట్ సూపర్‌సోనిక్ కార్

ఆ తరువాత ఈయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న థ్రస్ట్ సూపర్‌సోనిక్ కార్ 1997లోనే గంటకు 1228 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ వేగాన్ని కన్నా 30 శాతం ఎక్కువ వేగం (గంటకు సుమారు 1609 కి.మీ.)తో 2016లో ఈ బ్లడ్‌హౌండ్ సూపర్‌సోనిక్ కారుతో రికార్డును నెలకొల్పనున్నారు.

Most Read Articles

English summary
Researchers may have cracked the formula by which a supersonic car (SSC) capable of reaching a record speed of 1,000mph (1,600 kmph) will cope with the aerodynamic characteristics of traveling that fast.
Story first published: Monday, April 14, 2014, 10:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X