ఈ కాలంలో జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు ఇలానే దాటాలి!!

ప్రస్తుతం దేశీయంగా ఉన్న అనేక నగరాల్లో జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులు రోడ్డు ఎలా దాటుతున్నారో తెలుసా..?

Written By:

పెద్ద పెద్ద నగరాలలో రద్దీగా ఉండే రహదారుల మీద సిగ్నల్స్ వద్ద ఉన్న జీబ్రా క్రాసింగ్ దాటడం ఎంతో రిస్క్‌తో కూడుకున్నదని ప్రతి నగర వాసుడికి తెలుసు... వారి సమస్యలు ఎలా ఉంటాయో తెలియని వారు మరియు జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులు ఎలా రోడ్డు క్రాస్ చేయాలి మరియు జీబ్రా క్రాసింగ్ మీద వాహనాలు నిలిపే వారందరూ ఈ కథనం చూడాల్సిందే.

వాహనాలు వినియోగించకుండా నడుచుకుంటా ఆఫీసులకు వెళ్లే వారి సంఖ్య నగరాలలో తక్కువేం లేదు, ఇలాంటి వారందరికీ జీబ్రా క్రాసింగ్ విలువ ఎంటో బాగా తెలుసు. రద్దీగా ఉండే రోడ్డును దాటాలంటే జీబ్రా క్రాసింగ్ మాత్రమే దిక్కు.

అయితే ఇలాంటి జీబ్రా క్రాసింగ్‌ల మీదకు వాహనదారులు వచ్చేసి గ్రీన్ సిగ్నల్ కోసం వేచిఉంటారు. నిజానికి జీబ్రాక్రాసింగ్ మొత్తం పాదచారులు రోడ్డు దాటడం కోసం వేయబడ్డాయి.

మరి గజిబిజీ నగర జీవనంలో జీబ్రా క్రాసింగ్ మీద కూడా వాహనాలు నిలిపితే రోడ్డు ఎలా దాటాలి అనే సందేహం... ఆ తరువాత అంతమందిని ఏమీ అనలేక అసహనం వ్యక్తం చేయడం. సాధారణంగా ప్రతి వ్యక్తి చేసేది ఇదే.

కలకత్తాలో రేడియో వన్ అనే రేడియో జాకీ ఈ ధోరణికి స్వస్తి పలకలాని వాహనదారుల్లో మార్పు తెచ్చేందుకు ఏం చేశాడో తెలుసా..? జీబ్రా క్రాసింగ్ మీద నిలిపి ఉన్న వాహనాలను ఎక్కి మరి రోడ్డు దాటడం ప్రారంభించాడు.

బైకు, కారు, ట్రక్కు ఇలా అన్ని వాహనాల మీదగా జీబ్రా క్రాసింగ్ దాటి, వాహన మరియు పాదచారుల్లో చైతన్యం తీసుకొస్తున్నాడు. తరవాత జీబ్రా క్రాసింగ్ వద్ద వాహనాలు ముందుకు రాకుండా వెనకే నిలిపి ఉంచాలని జీబ్రా క్రాసింగ్ విలువను వివరించడం ప్రారంభించాడు.

రేడియో జాకీ చేసిన ఈ పని జీబ్రా క్రాసింగ్ మీద వాహనాలు నిలిపే ప్రతి ఒక్కరినీ సిగ్గుపడేలా చేసిందని చెప్పవచ్చు. ఇండియాలో జీబ్రా క్రాసింగ్ వాడకం ఇలా ఉండటం నిజానికి అందరూ సిగ్గుపడాల్సిందే.

రేడియో జాకీ జీబ్రా క్రాసింక్ వాహనాల మీద రోడ్డును ఎలా దాటాడో వీడియో ద్వారా వీక్షించగలరు....

కాబట్టి జీబ్రా క్రాసింగ్ యొక్క ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని, దయచేసి దాని మీద వాహనలు నిలపకండి....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
RJ's Zebra Crossing Prank Teaches People To Respect Road Rules
Please Wait while comments are loading...

Latest Photos