నిబంధనలు ఉల్లంఘించే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కొరడా

Traffic Rules
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (హెచ్‌టిపి) గడచిన ఏడు వారాలుగా అస్తవ్యస్తమైన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు, వాహన పత్రాలకు సంబంధించి ఓ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. ఈ ఏడు వారాల్లో ఇప్పటికే వేలాది మందిపై కేసులు బుక్ అయ్యాయి. వీరంతా కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారేనని హెచ్‌టిపి ఓ ప్రత్రికా ప్రకటనలో పేర్కొంది.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిలో 2705 మందిని కౌన్సిలింగ్ కోసం టిటిఐలకు పపించామని, దీని ప్రయాణికుల్లో చాలా వరకూ మార్పు కనిపించిందని, అక్రమ నెంబర్ ప్లేట్ల సమస్య కూడా తగ్గుముఖం పట్టిందని హెచ్‌టిపి పేర్కొంది. ఈ స్పెషల్ డ్రైవ్ తర్వాత వాహన చోదకులు ఒరిజినల్ డిఎల్, ఆర్‌సిలను తమ వెంట తీసుకుని ప్రయాణిస్తున్నారని హెచ్‌టిపి వివరించింది.

ఈ సమయంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:

నిబంధన ఉల్లంఘన నమోదైన కేసుల సంఖ్య
సరిగ్గా లేని నెంబర్ ప్లేట్లు 7444
ఒరిజినల్ డిఎల్ చూపించకపోవటం 10956
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయటం 4000
ఆర్.సి. బుక్ లేకుండా డ్రైవ్ చేయటం 5710
వాహన కాలుష్య నిబంధన (పియూసి) 1587
వాహన బీమా లేకుండా డ్రైవ్ చేయటం 1285
రిజిస్ట్రేషన్ కాకుండా డ్రైవ్ చేయటం 810
సరైన పరిమితులు లేకుండా డ్రైవ్ చేయటం 43
మొత్తం కేసులు 31,835

ప్రస్తుతం రాజధానిలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు, రానున్న కాప్-11 కన్వెన్షన్‌ను దృష్టిలో ఉంచుకొని, క్రింద తెలిపిన కనిపించే ట్రాఫిక్ నిబంధల ఉల్లంఘనపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఓ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మీడియాకు తెలిపారు.

1. సిగ్నల్ జపింగ్
2 స్టాప్ లైన్ ఉల్లంఘన
3. ఫ్రీ లెఫ్ట్ ఉల్లంఘన
4. ఆర్‌టిసి బస్సులు, ఆటోల ద్వారా బస్ బే ఉల్లంఘన
5. డ్రైవింగ్‌లో సెల్ ఫోన్ ఉపయోగిచడం
6. రాంగ్ సైడ్‌లో డ్రైవ్ చేయటం
7. ట్రిపుల్ రైడింగ్
8. ఆటోలు/ఆర్‌టిసి బస్సుల ద్వారా ఓవర్‌లోడింగ్
9. నో ఎంట్రీ టైమింగ్ ఉల్లంఘన
10. అస్తవ్యస్త నెంబర్ ప్లేట్లు

Most Read Articles

English summary
The Hyderabad Traffic Police has been conducting a special drive on Irregular Number Plates and Vehicle Documents for the last 7 weeks. HTP has booked more than 31000 cases on traffic violations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X