మారుతున్న ఇండియన్ రైల్వే

Written By:

భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఇండియన్ రైల్వేలోని సేవల్లో నూతనంగా మరో అడుగు ముందుకేసింది. హై స్పీడ్ రైళ్లు ఇప్పుడు ఒక్కొక్కటిగా విభిన్న సౌకర్యాల పేరుతో మార్పును సంతరించుకుంటున్నాయి. అందుకోసం ఇండియన్ రైల్వే విభిన్నమైన రైల్వే సేవలను ప్రయాణికులకు పరిచయం చేస్తోంది.

అందులో భాగంగానే భారత రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు విలాసవంతమైన లగ్జరీ సౌకర్యాలు గల రైలు సర్వీసును ఇండియన్ రైల్వేలో ప్రారంభించారు. పూర్తిగా ఎయిర్ కండీషన్డ్‌ సౌకర్యంతో పరిచయం చేయబడిన హమ్‌సఫర్ రైలు గురించి ఈ కథనంలో తెలుసుకోగలరు.

త్రీ టైర్ స్లీపర్ కోచ్ లతో నిర్మించబడిన ఈ హమ్‌సఫర్ రైలులో పూర్తిగా ఎయిర్ కండీషనింగ్ ఫీచర్ అందించారు. హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును భారత దేశపు ఫుల్లీ ఎయిర్ కండీషన్డ్ రైలు అని కూడా పిలవవచ్చు.

హమ్‌సఫర్ రైలులో మొత్తం 22 భోగీలు కలవు. ఇందులో చివరి రెండు భోగీలలో జనరేటర్లు ఉన్నాయి. ఇక రైలుకు ఇరువైపులా లేత నీలం రంగు పూలను పై నుండి క్రిందకు జారవిడిచినట్లు పెయింటింగ్ చేయించారు.

హమ్‌సఫర్ రైలులోని అన్ని కోచ్‌లలో సిసిటివి కెమెరాలు, జిపిఎస్ ఫెసిలిటి ద్వారా రైలు వెళుతున్న ప్రదేశం, చేరుకోవాల్సిన ప్రదేశం వంటి వివరాలను ప్రయాణికులు పొందవచ్చు. అంధుల కోసం బ్రెయిలీ తెరని కూడా అందించారు. మరియు అనేక ఇతర ఫీచర్లను కుడా అందించారు.

ఈ రైలులో టీ, కాఫీ వంటి సౌకర్యాల కోసం వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు మరియు మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ ఛార్జింగ్ కోసం ప్రతి బెర్త్ వద్ద కూడా ఛార్జింగ్ పోర్ట్‌లను అందించారు.

హమ్‌సఫర్ రైలులోని చాలా వరకు బెర్త్‌లు అత్యంత సౌకర్యవంతమైన మరియు సుఖవంతమైన ప్రయాణం కోసం డిజైన్ చేయబడ్డాయి. రైలులోని ఫ్లోర్ మొత్తం వినైల్ షీట్లతో రూపొందించారు. స్టాండర్డ్ ఆక్ససరీలతో ఆకర్షణీయమైన పెయింటింగ్ అందించారు.

బాత్రూమ్ లను అత్యాధునిక హంగులతో నిర్మించారు. విదేశీ సొబగులు గల టాయిలెట్లను నిర్మించారు. ఆరోగ్యకరమైన ప్రయాణం కోసం చెత్తను రైలులో ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ప్రత్యేకమైన చెత్త కుండీలను అక్కడక్కడ ఉంచారు.

ఇండియన్ రైల్వే ఈ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ లను కపుర్తలా లోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నారు. ఒక్కొక్క హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు నిర్మాణానికి సుమారుగా రూ. 2.6 కోట్ల రుపాయలు ఖర్చవుతోంది.

గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ను హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. సాధారణ రైళ్లలో ప్రయాణ ధరల కంటే ఈ హమ్‌సఫర్ రైలులో 20 శాతం ఎక్కువ టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది.

 

Story first published: Monday, December 12, 2016, 11:28 [IST]
English summary
Humsafar Express Train Unveiled
Please Wait while comments are loading...

Latest Photos