సూసైడ్ థీమ్ ప్రకటనపై క్షమాపణలు చెప్పిన హ్యుందాయ్

By Ravi

ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకునేందుకు వివిధ రకాల ప్రకటనలను రూపొందించి కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. అందులో కొన్ని ప్రకటనలు హిట్ మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అవుతాయి. అక్కడితో ఆగకుండా వివాదాలకు దారితీస్తాయి. మొన్నామధ్య ఫోర్డ్ ఇండియా తమ చిన్న కారు 'ఫోర్డ్ ఫిగో'ను ప్రమోట్ చేసేందు కోసం ఇటాలియన్ మాజీ ప్రధానమంత్రి, కిమ్ కర్దాషియాన్, మైఖేల్ షుమాకర్‌ను టార్గెట్ చేస్తూ ఓ వివాదాస్పద ప్రకటన రూపొందించి, చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే.

తాజాగా హ్యుందాయ్ కూడా ఓ వివాదాస్పద ప్రకటన రూపొందించి చిక్కుల్లో పడింది. గ్లోబల్ మార్కెట్లలో హ్యుందాయ్ అందిస్తున్న 'హ్యుందాయ్ ఐఎక్స్35' (Hyundai ix35) ఎస్‌యూవీని ప్రమోట్ చేసేందుకు ఓ టెలివిజన్ కమర్షియల్‌ను రూపొందించింది. ఈ ప్రకనటలో 40-50 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వ్యక్తి ఆత్మహత్య (సూసైడ్) చేసుకుందామని నిర్ణయించుకొని, తన గ్యారేజ్‌లో పార్క్ చేసి ఉంచిన హ్యుందాయ్ ఐఎక్స్35 కారు సైలెన్సర్‌కు ఓ పైప్‌ను అమర్చి అందులో నుంచి వచ్చే కార్బన వ్యర్థాలను కారులోని వచ్చేలా ఏర్పాటు చేసుకుంటాడు.

ఆ వ్యక్తి కారులో కూర్చుకొని అన్ని డోర్లు లాక్ చేసి, ఇంజన్‌ను రైజ్ చేస్తూ సైలెన్సర్ నుంచి వచ్చే కార్బైన్ డైఆక్సైడ్‌ను పీల్చి చనిపోవాలనుకుంటాడు. అయితే, కాసేపయ్యాక ఆ వ్యక్తి గ్యారేజ్‌లోని సురక్షితంగా బయటకు రావటాన్ని మనం ఈ వీడియోలో గమనించవచ్చు. ఈ ప్రకటన ఉద్దేశ్యం ఏంటంటే, తమ హ్యాందాయ్ ఐఎక్స్35 కారు అతి తక్కువ కర్భన వ్యర్థాలను విడుదల చేస్తుందని చెప్పే ప్రయత్నమే ఇది. అయితే, ఇందుకు సూసైడ్ థీమ్‌ను ఎంచుకోవటంపై సర్వత్రా నిరసనలు రావటంతో చేసేది లేక హ్యుందాయ్ బహిరంగంగా క్షమాపణలు తెలుపుకుంది. ఆ వీడియోను మనం కూడా చూద్దాం రండి..!

హ్యుందాయ్ ఐఎక్స్35 'పైప్ జాబ్' టివిసి (వీడియో)

హ్యుందాయ్ ఐఎక్స్35 ఎస్‌యూవీ

హ్యుందాయ్ ఐఎక్స్35 ఎస్‌యూవీ

హ్యుందాయ్ ఐఎక్స్35 ఎస్‌యూవీ

హ్యుందాయ్ ఐఎక్స్35 ఎస్‌యూవీ

హ్యుందాయ్ ఐఎక్స్35 ఎస్‌యూవీ

హ్యుందాయ్ ఐఎక్స్35 ఎస్‌యూవీ

హ్యుందాయ్ ఐఎక్స్35 ఎస్‌యూవీ

హ్యుందాయ్ ఐఎక్స్35 ఎస్‌యూవీ

Most Read Articles

English summary
Its Hyundai this time which has attracted bad publicity with a controversial TV advertisement. The commercial, titled "Pipe Job", depicts a man trying to commit suicide by inhaling toxic exhaust fumes. In the ad the man directs the exhaust fumes into the car's cabin and locks himself up. But he is later shown coming out of his garage unharmed.
Story first published: Saturday, April 27, 2013, 11:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X