వీడియో: హ్యుందాయ్ జెనిసిస్ డ్రైవర్‌లెస్ కాన్వాయ్..

మనం ఇప్పటికే అనేక డ్రైవర్‌లెస్ కార్ల గురించి తెలుసుకున్నాం. డ్రైవర్‌తో పనిలేకుండా యాంత్రికంగా తనంతట తాను ముందుకు సాగిపోయే కార్లను పలు సంస్థలు అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ కూడా తమ ప్రీమియం సెడాన్‌లో ఇలాంటి టెక్నాలజీనే జోడించింది. హ్యుందాయ్ నుంచి రానున్న కొత్త 2015 జెనిసిస్ సెడాన్ అనేక అధునాత సేఫ్టీ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

హ్యుందాయ్ తమ అధునాతన సేఫ్టీ సిస్టమ్‌ను డెమోనిస్ట్రేట్ చేసేందుకు ఓ డ్రైవర్‌లెస్ కాన్వాయ్ స్టంట్‌ను చేసి చూపింది. ఇందులో ఆరు హ్యుందాయ్ జెనిసిస్ కార్లలో ముందుగా డ్రైవర్లు ఎక్కి కూర్చుని కారును ఆటోమేటిక్‌గా నడిచేలా సిస్టమ్ యాక్టివేట్ చేసిన తర్వాత, కారు పైభాగంలో ఉన్న సన్‌రూఫ్ నుంచి వారు తమ కార్లకు పక్కనే వచ్చే ఓ పెద్ద ట్రక్కుపైకి దూకేస్తారు.

ఈ కాన్వాయ్‌లో ముందున్న కారులో మాత్రమే ఒకే ఒక్క డ్రైవర్ ఉంటాడు, అతను కూడా తన చేతులు కట్టుకొని ఉంటాడు. ఈ కొత్త 2015 హ్యుందాయ్ జెనిసిస్ కారులోని అడ్వాన్స్డ్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు కారును ఆటోమేటిక్‌గా ఒకే లైనులో సురక్షితంగా నడిపేందుకు సహకరిస్తాయి. ఆ అద్భుతమైన వీడియోని మనం కూడా చూసేద్దాం రండి.

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/EPTIXldrq3Q?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Korean carmaker Hyundai has demonstrated the Advanced Smart Cruise Control, Automatic Emergency Braking and Lane Keeping Assist on the all-new 2015 Genesis. Hyundai headed to its California proving ground with six of the new sedans and six courageous stunt drivers.&#13;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X