ఆ వీడియోను పది లక్షల మందికి పైగా వీక్షించారు

By Ravi

హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 కోసం కంపెనీ రూపొందించిన ఓ వాణిజ్య ప్రకటన గురించి గడచిన నెలలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఆ ప్రకటన ఆన్‌లైన్‌లో పెద్ద సంచలనంగా మారిపోయింది. ఈ ప్రకటన విడుదలైన కేవలం 3 వారాల్లోనే, యూట్యూబ్‌లో ఈ వీడియోనే ఇప్పటికే 10 లక్షలకు మందికి పైగా వీక్షించారు.

హ్యుందాయ్ ఐ20 కారులో ఉండే విశిష్టమైన ఫీచర్లను హైలైట్ చేసేందుకు కంపెనీ ఓ విచిత్రమై వాణిజ్య ప్రకటనను తయారు చేసింది. ఈ ప్రకటను చూడాలంటే గుండె ధైర్యం కావాలని, లేదంటే చూడొద్దని ఈ ప్రారంభంలో హ్యుందాయ్ ఈ విషయాన్ని పేర్కొంది. వాస్తవానికి ఇందులో అంత భయపట్టే అంశం ఏమీ లేదు.

ఈ టెలివిజన్ కమర్షియల్ కాస్తంత భయంకరంగాను, కాస్తంత సరదాగాను ఉంటుంది. ఈ ప్రకటన కోసం హ్యుందాయ్ దెయ్యం థీమ్‌ను ఎంచుకుంది. బహుశా ఇది ఇంకా టెలివిజన్లలో విడుదల కాలేదేమో. మరి ఇంత క్రేజ్ సంపాధించుకున్న ఆ సరదా ప్రకటను మనం కూడా ఈ వీడియోలో చూసేద్దాం రండి..!

Hyundai i20 Casts a Spell Campaign

ఓ వ్యక్తి హ్యుందాయ్ ఐ20 కారులో స్మశానం మీదుగా వెళ్తుంటే, అక్కడ ఓ అందమైన అమ్మాయి కనిపిస్తుంది. అతను కాస్తంత ముందుకు వెళ్లి వెనక్కు తిరిగి చూస్తే అక్కడ ఆ అమ్మాయి మాయమై నేరుగా కారులో ప్రత్యక్షవుతుంది.

Hyundai i20 Casts a Spell Campaign

దీంతో తన కారులోకి వచ్చింది దెయ్యమని గుర్తించిన సదరు వ్యక్తి షాక్ గురై కంగారుగా డ్రైవ్ చేస్తుంటాడు. అయితే, ఆటోమేటిక్‌గా హెడ్‌లైట్స్ ఆన్ కావటం, ఆన్ చేయకుండానే వైపర్లు ఆన్ అవటం మరియు వెనక్కు తిరిగి చూడకుండానే రివర్స్ పార్కింగ్ సెన్సార్ల సాయంతో రివర్స్ చేయటం చూసిన ఆ దెయ్యం ఈ ఫీచర్లను చూసి కారు నడిపే వ్యక్తి పెద్ద దెయ్యమని భావించి పారిపోతుంది.

వీడియో

ఈ కారులో వర్షం పడటాన్ని గమనించి ఆటోమేటిక్‌గా పనిచేసే రెయిన్ సెన్సింగ్ వైపర్స్, సూర్యకాంతి తగ్గగానే ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే హెడ్‌ల్యాంప్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Hyundai Motor India Ltd. has launched a unique viral campaign ‘Hyundai i20 Casts a Spell’ to promote the i-Gen i20. The 'Cast a Spell' video has gone viral and garnered over 1 Million views on YouTube and other digital platforms within a span of 3 weeks.
Story first published: Monday, July 1, 2013, 16:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X