వీడియో: వేలు చూపించారు, ఫలితం పొందారు..

By Ravi

అనేక రోడ్డు ప్రమాదాలకు కారణం రోడ్ రేజ్ (రోడ్డుపై గొడవపడటం). తనని ఓవర్‌టేక్ చేశారనో, వేగంగా వెళ్తున్నారనో, రాంగ్ టర్న్ తీసుకున్నారనో, అసభ్యంగా ప్రవర్తించారనో.. ఇలా కారణం ఏదైనా సరే, అది చివరకు రోడ్ రేజ్‌కు దారితీస్తుంది. అలాంటి ఓ రోడ్ రేజ్ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం రండి.

ఓ హ్యుందాయ్ కారులో వెళ్తున్న జంట రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలకు వేలు (మధ్యవేలు) చూపుతూ, గేలి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది చూసి చిర్రెత్తిపోయిన ఓ ఎస్‌యూవీ డ్రైవర్, సదరు హ్యుందాయ్ కారు వెనుకగా వెళ్లి మెల్లిగా ఢీకొట్టాడు. మెల్లిగా ఢీకొట్టినప్పటికీ, కారు వెనుక భాగం మాత్రం రిపేరు చేయటానికి వీలులేనంతగా సొట్టపోయింది.

ఓ చిన్నపాటి సరదా వలన హ్యుందాయ్ కారు ఓనర్‌కి భారీ నష్టమే కలిగింది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు సాటి డ్రైవర్లను గౌరవించడం నేర్చుకోవాలి. ఒకవేళ అవతలి వాళ్లు అసభ్యంగా ప్రవర్తించినా సరే, గొడవ పెట్టుకోకుండా సర్దుకుపోవటం నేర్చుకోవాలి. లేకపోతే, ఇదిగో ఈ వీడియోలో చూసినట్లుగా ఎదురుదెబ్బ తినాల్సి వస్తుంది.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/L-qvEgF12OA?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Road rage is a major cause for several accidents nowadays all over the world. Today we stumbled upon a video in which owners of a Hyundai vehicle are flipping people off by showing them the middle finger.&#13;
Story first published: Monday, October 27, 2014, 17:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X