9 అంకె అంటే సెంటిమెంట్ లేదు, ఇష్టం మాత్రమే: జూ. ఎన్టీఆర్

టాలీవుడ్ ఏ-వన్ స్టార్ నందమూరి తారక రామారావు (జూ. ఎన్టీఆర్) కార్ల నంబర్లన్నీ నాలుగు తొమ్మిదిల అంకెను కలిగి ఉంటాయి. మరి దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో జూ. ఎన్టీఆర్ ఓ టెలివిజన్ షోలో వెల్లడించారు. సాధారణంగా ఆటోమొబైల్ వాహన రిజిస్ట్రేషన్లకు నంబర్ 9 అంటే అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ఇదే విషయాన్ని జూ. ఎన్టీఆర్‌తో ప్రస్తావించగా... తనకు అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవని 9 అంకె తనకు కేవలం ఇష్టం మాత్రమేనని స్పష్టం చేశారు.

గతంలో ఈటీవీలో ప్రసారమయిన ప్రేమతో మీ లక్ష్మీ అనే ఓ సెలబ్రిటీ టాక్ షో కార్యక్రమంలో జూ.ఎన్టీఆర్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ షోలో జూ.ఎన్టీఆర్‌ను తన కార్ల నంబర్లన్నీ 9999 రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉంటాయి ఎందుకని మంచు లక్ష్మీ ప్రశ్నించగా, ఆయన సమాధానమిస్తూ.. తనకు 9 అంకె సెంటిమెంట్ లేదని కేవలం ఇష్టం మాత్రమేనని, తన నాన్నగారి కార్ల నంబర్లు కూడా అన్నీ 9999 లను కలిగి ఉంటాయని చెప్పారు.

అంతేకాకుండా, తన తాతగారైన నందమూరి తారక రామారావు కార్లు కూడా ఇదే అంకెను రిజిస్ట్రేషన్ నెంబర్‌గా కలిగి ఉండేవని, అస్సలు 9999 ట్రెండ్ మొదలైంది తమ తాత గారి దగ్గర నుంచేనని చెప్పుకొచ్చారు. జూ. ఎన్టీఆర్ వద్ద కొన్ని కార్ల నంబర్లను పరిశీలిస్తే.. ఇలా ఉన్నాయి. AP 20 9999 పోర్షే కారు, AP 37 D 9999 టాటా సఫారీ, AP 01 G 9999 స్కోడా కారు.

Jr NTR
Most Read Articles

English summary
Tollywood A-One star Jr. NTR's all the car rgistration numbers are having 9999. In a TV talk show Jr. NTR reveled that, he does not have number sentiment, but he likes the number 9, and also said, the 9999 trend had started from his grand father.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X