భారతదేశపు మొదటి సెమి హై స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ గురించి ఆసక్తికరమైన విషయాలు

By Anil

భారత దేశపు రైల్వే వ్యవస్థ హై స్పీడ్ రైళ్ల నుండి సెమి-హై స్పీడ్ రైళ్ల వైపు ముందడుగు వేసింది. తాజాగా క్రితం రోజున కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభాకర్ ప్రభు ఢిల్లీలోని నిజామొద్దీని రైల్వే స్టేషన్ కేంద్రంగా గతిమాన్ హై స్పీడ్ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. దేశ రైల్వే అభివృద్దిలో ఈ హైస్పీడ్ రైలు కూడా ఒక భాగం అని ఈ సందర్బంగా తెలిపారు.

ఇండియన్ రైల్వే గతిమార్చనున్న గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

వేగం

వేగం

గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 225 కిలోమీటర్లుగా ఉంది.

శతాబ్ధి కన్నా తక్కువ సమయం

శతాబ్ధి కన్నా తక్కువ సమయం

ఢిల్లీ నుండి ఆగ్రా వరకు సాధరణంగా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణ సమయం రెండు గంటలుగా ఉంది. అయిదే ఇందులో అయితే కేవలం 100 నిమిషాల్లో చేరుకోవచ్చు.

అల్ట్రా మోడ్రన్ కోచ్‌లు

అల్ట్రా మోడ్రన్ కోచ్‌లు

గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో అల్ట్రా మోడ్రన్‌కు చెందిన 12 కోచ్‌లు కలవు.

ఫీచర్లు

ఫీచర్లు

ఆటోమేటిక్ ఫైర్ అలారమ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ప్రయాణికులు సమాచారం సాంకేతిక వ్యవస్థ మరియు స్లైడింగ్ డోర్లు వంటి తదితర ఫీచర్లు ఎన్నో ఇందులో కలవు.

వసతులు

వసతులు

ఇందులో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం, పర్యావరణహితమైన మరుగుదొడ్లు, మొదటి సారిగా విమాన తరహాలో హోస్టెస్ (పరిచారకులు) మరియు ఆగ్రా మరియు ఆగ్రా పరిసర పర్యాటక ప్రాంతాలను తెలుసుకునే ప్రత్యేక చిత్రమాళికలు అందుబాటులో ఉంచారు.

ఒక్కొక్క కోచ్ ధర

ఒక్కొక్క కోచ్ ధర

గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కొక్క అల్ట్రా మోడ్రన్ కోచ్ ధర సుమారుగా రూ. 2.5 కోట్లు వరకు ఉంది.

ప్రతి ఒక్కరి వినోదం కోసం ప్రత్యేక తెరలు

ప్రతి ఒక్కరి వినోదం కోసం ప్రత్యేక తెరలు

ఇందులో ప్రతి సీటు వెనుక కూడా 8-అంగుళాల ఎల్‌సిడి డిస్ల్పే గల వినోధాల తెర కలదు. ఇందులో మనకు నచ్చిన సినిమాలు చూడవచ్చు.

శాటిలైట్ టెలివిజన్

శాటిలైట్ టెలివిజన్

భవిష్యత్తులో వీటిని శాటిలైట్ టెలివిజన్‌కు అనుసంధానం చేస్తారు. తద్వరా టీవీలలో జరిగే ప్రత్యక్ష ప్రసారాలను చూడవచ్చు

ప్రత్యేక రైలు రూటు

ప్రత్యేక రైలు రూటు

ఢిల్లీ మరియు ఆగ్రా మధ్య ప్రయాణించే ఈ గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోవడానికి ఈ రూటులో ప్రత్యేకంగా దీని కోసం ఒక రైల్వే ట్రాక్‌ని నూతన సిగ్నలింగ్ వ్యవస్థతో అప్‌గ్రేడ్ చేశారు.

అధిక స్థాయిలో పవర్ ఉత్పత్తి

అధిక స్థాయిలో పవర్ ఉత్పత్తి

ఈ గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో గల ఇంజన్ దాదాపుగా 5,400 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే మన మాటల్లో చెప్పాలంటే ఈ రైలును 5,400 గుర్రాలు లాక్కెళ్లడం అన్నమాట.

కోచ్‌ల డిజైన్

కోచ్‌ల డిజైన్

గతిమాన్ ఎక్స్‌‌ప్రెస్ రైలులో వినియోగించినటువంటి కోచ్‌లను ఆర్‌డిఎస్‌ఒ (రీసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) వారు డిజైన్ చేశారు.

టెకెట్ ధరలు

టెకెట్ ధరలు

ఎక్సిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ. 1500 లు

ఏ/సి ఛైర్ కార్ టికెట్ ధర రూ. 750 లు

(శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ రైలు కన్నా 25 శాతం అధిక దరలు)

శుక్ర వారం తప్పించి

శుక్ర వారం తప్పించి

గతిమాన్ ఎక్స్‌‌ప్రెస్ రైలు వారలం శుక్ర వారం తప్పించి మిగిలిన అన్ని రోజులలో సేవలు అందిస్తుంది. శుక్రవారం గతిమాన్‌కు మరియు తాజ్‌మహల్ రెండిటికి సెలవే (ప్రతి శుక్రవారం తాజ్‌మహల్ సందర్శనం నిలిపివేస్తారు).

గతిమాన్ రైలు నెంబర్లు

గతిమాన్ రైలు నెంబర్లు

ఎప్పుడైనా ఢిల్లీకి వెళితే గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం చేయాలనుకుంటే, 12050/12049 నెంబర్లతో రైలు బండి అందుబాటులో ఉంటుంది.

WAp-5 లోకోమోటివ్ ఇంజన్

WAp-5 లోకోమోటివ్ ఇంజన్

ఇండియన్ రైలు ప్రారంభించిన మొట్టమొదటి సెమి-హై స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌లో WAP-5 లోకో మోటివ్ ఇంజన్‌ను వినియోగించింది, దీని గురించి మరిన్ని వివరాలు తరువాత స్లైడర్ల ద్వారా తెలుసుకుందాం రండి.

WAP-5 ఇంజన్

WAP-5 ఇంజన్

WAP-5లో W అనగా విడ్త్ ఆఫ్ రైల్వే గేజ్ (అంటే రైల్వే ట్రాక్ మీద రెండు పట్టాల మధ్యం ఉన్న దూరం),A అనగా యానోడ్ నుండి విద్యుత్‌ను గ్రహించి రైలు నడవడానికి ఉపయోగడపే ఆల్ట్రనేట్ కరెంట్ మరియు P అనగా ప్యాసింజర్ (ప్రయాణికుడు). అయితే WAP-5 అనగా WAP కుటుంబంలో ఐదవ శ్రేణి ఇంజన్.

తొలి పరిచయం

తొలి పరిచయం

ఇండియన్ రైల్వే WAP-5 శ్రేణి రైలింజన్లను దాదాపుగా 10 వరకు స్విట్జర్లాండ్ నుండి దిగుమతి చేసుకున్నారు. స్విస్ లాక్ 2000 డిజైన్ కాన్సెప్ట్ మరియు జర్మనీకు చెందిన డిబి క్లాస్ 120 అనే మెకానికల్ ఛాసిస్‌లను ఈ WAP-5 ఇంజన్‌లు కలిగి ఉన్నాయి.

దేశీయంగా ఉత్పత్తి

దేశీయంగా ఉత్పత్తి

దిగుమతి చేసుకోవడం మానేసి ఇండియన్ రైల్వే ఈ WAp-5 లోకోమోటివ్ ఇంజన్‌లను దేశీయంగా పశ్చిమ బెంగాల్‌లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (CLW) కేంద్రంగా 2000 సంవత్సరం నుండి ప్రారంభించింది.

బరువు మరియు ప్రత్యేకతలు

బరువు మరియు ప్రత్యేకతలు

WAp-5 లోకోమోటివ్ ఇంజన్‌ 79 టన్నుల బరువు కలదు. మరియు ఇందులో ఎయిర్ బ్రేకులు కలవు, ఈ బ్రేకులు ఆటోమేటిక్‌గా పవర్‌ను రీజనరేట్ చేసుకుంటాయి.

విధ్యుత్ మోటార్లు

విధ్యుత్ మోటార్లు

ఇందులోని ఇంజన్‌కు 4 ఎబిబి గ్రూప్ 6ఎఫ్ఎక్స్ఎ 7059 గల ఎలక్ట్రిక్ మోటార్లు కలవు. ఇవి దాదాపుగా 5,500 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేయును.

సాహసోపేతమైన పరీక్ష

సాహసోపేతమైన పరీక్ష

WAp-5 లోకోమోటివ్ ఇంజన్‌కు జూలై 3, 2014న ఢిల్లీ మరియు ఆగ్రా మధ్య గతిమాన్ ఎక్స్‌ప్రెస్ కోసం పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో ఈ WAp-5 లోకోమోటివ్ ఇంజన్‌ దాదాపుగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టింది.

శక్తివంతమైన ఇంజన్

శక్తివంతమైన ఇంజన్

WAp-5 లోకోమోటివ్ ఇంజన్‌ను ఇండియన్ రైల్వే ఢిల్లీ-భోపాల్ మధ్య తిరిగే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలులో వినియోగించారు. ఈ రూటులో ఇది 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లుగా కూడా ఉంది. ఇండియన్ రైల్వేలో అత్యంత శక్తివంతమైన ఇంజన్ అంటే ఇదే అని చెప్పవచ్చు.

అత్యధిక వేగం

అత్యధిక వేగం

ఇండియన్ రైల్వే గత ఏడాది అక్టోబర్‌లో WAp-5 కుటుంబంలోని 30086 అనే నెంబర్ గల ఇంజన్‌ను పూర్తి స్థాయిలో అప్ గ్రేడ్ చేసి పట్టాలపై పరీక్షించారు. ఆ పరీక్షలలో ఇది గంటకు 225 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసింది. అయితే 200 కిలోమీటర్లుగా దీనిని అనుమతించారు.

ఉత్తర భారత దేశంలో ఎక్కువగా

ఉత్తర భారత దేశంలో ఎక్కువగా

WAp-5 లోకోమోటివ్ ఇంజన్‌ను ఇండియన్ రైల్వే రాజధాని, దురంతో మరియు శతాబ్ధి రైళ్లలో వినియోగించారు. దక్షిణ భారత రైల్వే కన్నా ఈ ఇంజన్‌లను ఉత్తర భారత రైల్వేలో ఎక్కువగా ఉపయోగించారు.

ఇండియన్ రైల్వేకు చెందిన మరిన్ని కథనాలు

భారత దేశపు అతి వేగవంతమైన రైలు

170 సంవత్సరాల ఇండియన్ రైల్వే చరిత్రలో :49 ఆసక్తికరమైన నిజాలు
ఎక్కువ మంది చదివిన కథనాలు.....

దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే

ISIS తీవ్రవాదుల అంతానికి ఇవే సరైన విమానాలు అంటున్న అమెరికా

100 కు పైబడి లగ్జరీ కార్లను కలిగి ఉన్న ఫేమస్ బాక్సర్

ఎక్కువ మంది చదివిన కథనాలు.....

వివేక్ ఎక్స్ ప్రెస్ గురించి అబ్బురపరిచే ఆసక్తికరమైన విషయాలు

ఖరీదైన కార్లు గల దక్షిణ భారత సినీతారలు

Most Read Articles

Read more on: #రైలు #rail
English summary
Suresh Prabhakar Prabhu Flags off First New Semi High-Speed Train “Gatimaan Express”
Story first published: Wednesday, April 6, 2016, 11:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X