ధర్మవరం నుండి విజయవాడకు షురూ అయిన రైలు సేవలు

By Anil

రాయలసీమలోని ధర్మవరం జంక్షన్ నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నూతన రైలు సర్వీస్ ప్రారంభం అయ్యింది. వారానికి మూడు రోజుల పాటు సర్వీసులు అందించనుంది ఈ రైలు. దీనిని రెండు రోజుల క్రితం 12 జూలై 2016 న దక్షిణ మధ్య రైల్వే అధికారుల సమక్షంలో కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఢిల్లీ నుండి రిమోట్ ద్వారా ప్రారంభించారు.

రాయలసీమను మరియు రాజధాని నగరాన్ని కలిపే రైలు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

ధర్మవరం విజయవాడ రైలు

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి సుచనా చౌదరి, రైల్వే బోర్డ్ చైర్మెన్ ఎ.కె మిట్టల్ మరియు ఇతర బోర్డ్ సభ్యులు ఢిల్లీలోని రైల్వే భవన్ నుండి రిమోట్ ద్వారా లాంఛనంగా ఈ రైలు ప్రారంభించారు.

ధర్మవరం విజయవాడ రైలు

ఈ రైలు వారంలోని సోమ, బుధ, శని వారాలలో విజయవాడ స్టేషన్ నుండి రాత్రి 11.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 లకు ధర్మవరంకు చేరుకుటుంది.

ధర్మవరం విజయవాడ రైలు

తిరుగు ప్రయాణంలో ధర్మవరంలో ప్రతి మంగళ, గురు మరియు ఆదివారాలలో సాయంత్రం 5.50 లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 లకు విజయవాడకు చేరుకుంటుంది.

ధర్మవరం విజయవాడ రైలు

విజయవాడ-ధర్మవరం రైలు నెంబరు - 17215 మరియు ధర్మవరం-విజయవాడ రైలు నెంబరు - 17216 గా ఉంది.

ధర్మవరం విజయవాడ రైలు

ధర్మవరం-విజయవాడ మార్గాలలో రైలు అనంతపురం, గుత్తి, డోన్, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం రోడ్, వినుకొండ, నర్సారావు పేట మరియు గుంటూరుల మీదుగా విజయవాడకు చేరుకుంటుంది.

ధర్మవరం విజయవాడ రైలు

మొత్తం 11 కోచ్‌లు ఇందులో ఉంటాయి. అందులో ఒకటి ఎయిర్ కండీషన్డ్ టు టైర్ కోచ్ మరియు రెండు ఏ/సి త్రీ టైర్ అదే విధంగా ఆరు స్లీపర్ క్లాస్ కోచ్‌లు వాటి ప్రక్కనే రెండు జనరేటర్ మరియు బ్రేకులున్న కోచ్‌లు కలవు.

ధర్మవరం విజయవాడ రైలు

దీని ప్రారంభోత్సవం నాడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమకు మరియు రాజధాని నగరానికి మధ్య రవాణా ఇప్పుడు ఎంతో సులభం అని తెలిపాడు.

ధర్మవరం విజయవాడ రైలు

సుమారుగా నాలుగు జిల్లాల మీదుగా 511 కిలోమీటర్ల మేర ఇది పరుగులు మేర నడుస్తోంది. దీనికి అనంతపురం జిల్లా తెలుగు దేశం పార్టీ నేత ఎమ్‌పి జెసి దివాకర్ రెడ్డి స్వాగతం పలికాడు. అనతరం రైలును పరిశీలింతి కేంద్ర రైల్వే మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

.

  • ఇండియా నుండి 10 ఇతర దేశాలకు ఉన్న రైలు మార్గాలు
  • .

    • ప్రేతాత్మలకు నిలయాలుగా మారిన ఇండియన్ రైల్వే స్టేషన్లు

Most Read Articles

Read more on: #రైలు #rail
English summary
Important Details About Vijayawada Dharmavaram train
Story first published: Thursday, July 14, 2016, 15:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X