పాకిస్తాన్‌పై ధీటైన పోరాటానికి భారత వైమానిక ధళానికి రాఫెల్ అస్త్రాలు

By Anil

పాకిస్తాన్ భారత దేశాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక పరోక్షంగా తీవ్రవాదులను ఇండియా మీదకు ఉసిగొల్పి యురిలో సైనికుల మీద దాడి చేయించింది. ఈ ఘటనతో యావత్ భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్‌పై తీవ్రంగా నిప్పులు చెరిగాయి.

అర్థిక, విద్యా, సాంకేతిక వంటి అనేక ముఖ్య రంగాలలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న భారత్ మీద పాకిస్తాన్ ఈ తరహా దాడులకు దిగుతోంది. అయితే ఇలాంటి దాడులను సహించకుండా తిప్పికొట్టేందుకు భారత్ ఫ్రాన్స్‌ నుండి శక్తివంతమైన సుమారుగా 36 రాఫెల్ యుద్ద విమానాలను కొనుగోలు చేసింది.

రాఫెల్ యుద్ద విమానాలు

క్రితం రోజు (సెప్టెంబర్ 23,2016)న ఇండియా ఫ్రాన్స్ నుండి సుమారుగా 36 రాఫెల్ యుద్ద విమానాలను కొనుగోలు చేసింది. దీనికి సంభందించి ఇరు దేశాల ప్రతినిధులు పరస్పర ఒప్పందంపై సంతకాలు చేసారు.

రాఫెల్ యుద్ద విమానాలు

ఫ్రాన్స్‌కు చెందిన దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ ఉత్పత్తి చేసే రాఫెల్ యుద్ద విమానాలను కొనుగోలు చేయడానికి భారత దేశపు రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో చోటు చేసుకున్న వివాదాస్పద ఒప్పందాలను ప్రక్కన పెట్టి 36 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు సుముఖం చూపింది.

రాఫెల్ యుద్ద విమానాలు

రాఫెల్ ఫైటర్ జెట్‌ల యొక్క ప్రత్యేకతల్లో అత్యంత ముఖ్యమైనది, శత్రు రాడార్ వ్యవస్థలకు పట్టుపడకుండా తప్పించుకుని ప్రయాణించే విధంగా దీనిని డిజైన్ చేసారు.

రాఫెల్ యుద్ద విమానాలు

రాఫెల్ యుద్ద విమానం యొక్క వేగం మరియు దాని స్థితిని మరియు అది ఉన్న ప్రదేశాన్ని గుర్తించడం చాలా సవాలుతో కూడుకున్న పని.

రాఫెల్ యుద్ద విమానాలు

ఈ రాఫెల్ యుద్ద విమానం గగన తలం నుండి వివిధ భూ బాగాల్లో ఉన్న శత్రువుల మీద సమర్థవంతంగా దాడులు జరుపుతుంది. దీనిని కొనుగోలు చేసిన దేశం యొక్క వైమానిక దళం చేత నియంత్రించబడుతుంది.

రాఫెల్ యుద్ద విమానాలు

దస్సాల్ట్ యొక్క రాఫెల్ యుద్ద విమానాలు శత్రువుల యొక్క సాధారణ మిస్సైల్స్, యుద్ద విమానాలను, క్షిపణులను గుర్తించి సుమారుగా 37.04 కిలోమీటర్ల నుండి వాటి మీద దాడులు చేసి నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

రాఫెల్ యుద్ద విమానాలు

రాఫెల్ యుద్ద విమానాల్లో నూతనంగా ప్రవేశ పెట్టిన రాడార్ పరికరాల ద్వారా శత్రువుల యొక్క గగన తలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తుంది.

రాఫెల్ యుద్ద విమానాలు

భారీ సంఖ్యలో రాఫెల్ యుద్ద విమానాలను మరియు తమ పొరుగు దేశం నుండి రెండు శక్తివంతమైన మిస్సైల్స్‌ను కొనుగోలు చేయడం పాకిస్తాన్‌కు భారీ షాక్ అని చెప్పవచ్చు. ఎందు కంటే రాఫెల్ యుద్ద విమానాలలోని పైలట్ల యొక్క శిరస్త్రాణం మీద ఇజ్రాయెల్‌కు చెందిన అధునాతన తెరలను అందించారు.

రాఫెల్ యుద్ద విమానాలు

సుమారుగా 560 కిలోమీటర్ల ఎత్తు నుండి శత్రువుల భూ బాగంలో నిర్ధేశించిన ప్రదేశాల్లో మిస్సైల్స్ ద్వారా దాడులు చేసే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

రాఫెల్ యుద్ద విమానాలు

రాఫెల్ యుద్ద విమానాల్లో ఉన్న ప్రత్యేకతల్లో అణు బాంబులను మోసుకెళ్లడం మరియు వాటి ద్వారా దాడులు నిర్వహించడం

రాఫెల్ యుద్ద విమానాలు

ఇందులో పైలట్లు ఏ మాత్రం ప్రమాదానికి గురికాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆక్సిజన్ అందని సమయంలో ఆటోమేటిక్‌గా ఆక్సిజన్‌ను విడుదల చేయడం, మరియు శత్రు భూబాగాల్లో ఈ విమానాలు ప్రమాదానికి గురైనపుడు భౌతిక ప్రమాదాలు చోటుచేసుకోకుండా డిజైన్ చేసారు.

రాఫెల్ యుద్ద విమానాలు

రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలు పొడవు 15.30 మీటర్లు, వెడల్పు 10.90 మీటర్లు, ఎత్తు 5.30 మీటర్లు కలదు. శత్రువుల యొక్క రాడార్ వ్యవస్థలకు చిక్కకుండా పారిపోయే విధంగా డిజైన్ చేసారు.

రాఫెల్ యుద్ద విమానాలు

దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ ఈ రాఫెల్ యుద్ద విమానంలో రెండు స్నెక్మా ఎమ్-88 ఇంజన్‌లను అందించింది. ఈ రెండు ఇంజన్‌లు కూడా అత్యంత అద్బుతమైన పనితీరును కనబరుస్తాయి.

రాఫెల్ యుద్ద విమానాలు

త్రికోణాలలో చిత్రాలను గీసుకుని శత్రువులను నాశనం చేస్తుంది, మరిన్ని అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో ఇది చక్కగా విధులు నిర్వర్తిస్తుంది.

రాఫెల్ యుద్ద విమానాలు

ఈ రాఫెల్ యుద్ద విమానాలు మ్యాక్ 1.8 వేగంతో ప్రయాణిస్తాయి. అంటే గంటకు సుమారుగా 2,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెలుతాయి.

రాఫెల్ యుద్ద విమానాలు

వీటికి ఒక్కసారి ఇంధనాన్ని నింపితే గరిష్టందా 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. తద్వారా సుదూరంగా ఉండే టెర్రరిస్టులు మరియు శత్రు భూ భాగాలను చేరుకున్న తరువాత తిరిగి స్వభూబాగాలను చేరుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

రాఫెల్ యుద్ద విమానాలు

రాఫెల్ శ్రేణి యుద్ద విమానాలు మూడు మోడల్స్‌లో ఉన్నాయి. అందులో రాఫెల్ ి మోడల్ సింగల్ సీటర్, మరియు రెండు సీట్ల గల దానిని రాఫెల్ బి అంటారు.

రాఫెల్ యుద్ద విమానాలు

అదే విధంగా ఎయిర్ క్రాఫ్ట్‌లను మోసుకెళ్లడానికి వీలుగా ఉండే వాటిని రాఫెల్ ఎమ్ అంటారు. ఇది కూడా సింగల్ సీటర్ యుద్ద విమానమే. ఇవి నేల మీద తక్కువ ప్రదేశంలోనే ల్యాండ్ అవుతాయి.

రాఫెల్ యుద్ద విమానాలు

ప్రస్తుతం సుమారుగా 59,000 కోట్ల రుపాయల విలువైన రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తున్నారు.

రాఫెల్ యుద్ద విమానాలు

రానున్న 36 మాసాల్లో దస్సాల్ట్ ఈ 36 రాఫెల్ యుద్ద విమానాలను అందివ్వనుంది. ఒక దాని తరువాత ఒకటి వచ్చే 36 నెలల్లోపు 36 రాఫెల్ విమానాలను కూడా డెలివరీ ఇవ్వనుంది. అయితే ఈ విమానాల కోసం పైలట్లకు అదనపు శిక్షణ అవసరం ఉంటుంది.

రాఫెల్ యుద్ద విమానాలు

  • హ్యాట్సాఫ్ టు ఇండియన్ ఆర్మీ: చైనాకు ముప్పు తిప్పలు పెడుతున్న భారతీయ సైన్యం
  • సమర్థవంతమైన దాడి చేయగల ప్రపంచ టాప్ 10 సైనిక హెలికాప్టర్లు
  • రాఫెల్ యుద్ద విమానాలు

    • నాగసాకి, హిరోషిమా నగరాల మీద బాంబుల వర్షం కురిపించిన విమానం దొరికింది
    • భయంకరమైన లేజర్ భీమ్ అట్టాక్: కొత్త ముప్పు ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు
    • ప్రపంచానికి చురకలంటిచనున్న జపాన్ తొలి స్టెల్త్ యుద్ద విమానం

Most Read Articles

English summary
Read In Telugu: Important Details About Rafale Fighter Jet
Story first published: Saturday, September 24, 2016, 19:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X