ప్రపంచాన్ని వణికించిన రష్యన్ మిస్సైల్స్ కొనుగోలు చేస్తున్న ఇండియా

By Anil

ఇండియన్ మిలిటరీకి మందుగుండు సామాగ్రి బలాన్ని మరింత పెంచడానికి భారత ప్రభుత్వం రష్యాతో అతి పెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఒకప్పుడు అమెరికా, రష్యాకు చెందిన ఈ మిస్సైల్స్ కారణంగా భయపడింది. అమెరికానే కాదు ప్రపంచ దేశాలు వీటిని కదిలిస్తే కష్టం అని మిన్నుకుండిపోయాయి. మరి అవే శక్తివంతమైన మిస్సైల్స్ భారత్ వద్ద ఉంటే పాక్ మరియు చైనా చేష్టలు సాగేనా....?

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

అత్యంత శక్తివంతమైన ఎస్-400 మిస్సైల్ సిస్టమ్‌ను కొనుగోలు చేయడానికి మోడీ ప్రభుత్వం రష్యా రక్షణ రంగంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో పాక్ మరియు చైనా సరిహద్దుల్లో నియంత్రణ రేఖల వద్ద మన సైన్యానికి మరింత బలం చేకూరనుందని చెప్పవచ్చు.

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్ సిస్టమ్ కోసం సుమారుగా 40,000 కోట్ల రుపాయలను వెచ్చించనున్నారు.

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

గగన తలంలో ఎగిరే శత్రు ఆయుధాలను లక్ష్యంగా చేసుకుని ఢీకొట్టే విధంగా ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్స్‌ను ఏరోడైనమిక్‌గా డిజైన్ చేసారు.

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్ సిస్టమ్ బలీయమైన దాడులను జరిపేవింధంగా అభివృద్ది చేసారు. ఇవి 400 కిలోమీటర్ల పరిధిలో ఎదురుగా వచ్చే మిస్సైల్స్‌ను నాశనం చేయడం, శత్రువుల డ్రోన్లను మరియు శత్రువిమానాలను కూల్చివేయగల శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నాయి

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

రష్యా అభివృద్ది చేసిన ఎస్-300 మిస్సైల్ సిస్టమ్‌లోని ఒక వేరియంట్ ఈ ఎస్-400. అయితే దీని తోబుట్టువు ఎస్-300 కన్నా 2.5-రెట్ల ఫైరింగ్ వేగాన్ని కలిగి ఉంది.

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

అత్యాధునిక డిఫెన్స్ సామ్రాజ్యాన్ని కలిగిన దేశాలలో కూడా ఇలాంటి మిస్సైల్స్ జాడలేదు. నాటో కూటమిలో ఉన్న అన్ని దేశాలు కూడా ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్ దాటికి వణికిపోతున్నాయి.

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్స్ నిర్మాణం అద్భుతం అని చెప్పాలి. ఇందులో అత్యంత పొడవైన పరిధిని కలిగి ఉండే రాడార్లు సాంకేతిక వ్యవస్థ కలదు. ఈ వ్యవస్థ ద్వారా ఒక దిశలో ఉన్న 100 టార్గెట్లను కూడా ఒకే సారి పసిగట్టి దాడులు నిర్వహించగలదు.

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

రష్యా మరియు భారత్ మధ్య కుదిరిన ఎస్-400 ట్రయంఫ్ ఒప్పందం గురించి డిఫెన్స్ మరియు వ్యూహాత్మక పరిమాణాలపై స్పందించే నిపుణులు మాట్లాడుతూ, భారత్ పాక్ మరియు చైనా నుండి ముప్పు ఎదుర్కుంటోంది. ఇప్పుడు రష్యా భారత్‌తో చేతులు కలపడంతో భారత్ శత్రు దేశాలు వెనక్కి తగ్గుతాయంటున్నారు.

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

అయితే చైనా కూడా 2014 లో రష్యా నుండి ఈ ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్స్‌ను కొనుగోలు చేసింది. సుమారుగా 3 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం జరిగింది. వీటిని 2017 నాటికి చైనాకు డెలివరీ ఇవ్వనుంది రష్యా.

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

ఇండియన్ ఆర్మీ భారత్‌కు పడమర వైపున ఉన్న పాకిస్తాన్ వైపు మూడు ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్ వ్యవస్థలను మరియు తూర్పులో చైనా సరిహద్దు వద్ద రెండు మిస్సైల్ వ్యవస్థలను నెలకొల్పనుంది. చిన్న మరియు మధ్యమ తరగతి పరిధి గల బాలిస్టిక్ మిస్సైల్స్ ముప్పును వీటి ద్వారా ఎదుర్కోవచ్చు.

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

ఎస్-400 మిస్సైల్ సిస్టమ్ మొత్తం ఎనిమిది లాంచర్లను కలగి ఉంది. గుర్తించడం మరియు నయంత్రించడంలో ఇవి ఎంతో కీలకం. చివరి వ్యవస్థ ఆధారంతో తరువాత వాటి పై ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

2015 లో రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్ల పాలక సంఘం, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆధ్వర్యంలో 5 ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి పచ్చ జెండా ఊపారు. ప్రస్తుతం వీటిని దిగుమతి చేసుకునే పనిలో ఇండియా ఉంది.

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

భారత దేశ రక్షణలో భాగంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించే బృహత్ కార్యాన్ని ప్రారంభించి ప్రపంచ దేశాలను మమేకం చేస్తూ అదే విధంగా అగ్రదేశాలకు కలిగి ఉన్న అవే శక్తివంతమైన యుద్ద సామాగ్రిని కొనుగోలు చేయడంలో భారత ప్రభుత్వం ఎంతో చురుకుగా పనిచేస్తోంది అని చెప్పవచ్చు.

ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

  • సర్జికల్ స్ట్రైక్స్‌లో కీలకమైన ధుృవ్ హెలికాప్టర్ గురించి...
  • మోడీ ఎఫెక్ట్; భారతదేశ రక్షణ ఒప్పందంపై ప్రపంచ దేశాల పోటీ
  • పాకిస్తాన్‌ను బూడిద చేయడానికి వీటికి క్షణం చాలు...!!
  • ఎస్-400 ట్రయంఫ్ మిస్సైల్

    • కలకత్తా చారిత్రాత్మక నగరంలో టీవీఎస్ విగోతో దుర్గా పూజ సంబరాలు: ఫోటోలు

Most Read Articles

English summary
Read In Telugu: Important Facts About S400 Triumf Missile System
Story first published: Friday, October 14, 2016, 16:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X