వేసవి కాలంలో ఎండవేడిమి నుండి మీ కారును రక్షించుకోవడానికి శక్తివంతమైన చిట్కాలు

By Anil

వేసవి కాలం ఆరంభమయ్యింది, ఎప్పిటిలాగే చాలా మంది తమ సమ్మర్ లాంగ్ డ్రైవ్‌లకు సిద్దమవుతుంటారు. అద్దాలన్నింటిని క్రిందకు దించేసి, చల్లగా గాలి బయటి నుండి మన వెంట్రుకల గుండా వెలుతుంటే భలే ఉంటుంది కదూ. అసలు ఆ మజాయే వేరుగా ఉంటుంది.

అయితే మీరు అలా ఎంజాయ్ చేసేదానికంటే ముందు, మీ కారు ఎండవేడిమి తట్టుకుంటుందా ? విపరీతమైన ఎండలలో కూడా ప్రయాణించడానికి మీ కారు సిద్దమేనా ? వీటిలో మీకు అవును అనే అనుమానమే ఉంటే క్రింద గల స్లైడర్లను చూడండి. ఇక్కడ మీ కారు కోసం అత్భుతమైన వేసవి చిట్కాలు కలవు . ఈ చిట్కాలు వేసవిని సైతం తరిమివేసి మీ కారును చక్కగా పరుగులు తీసే విధంగా చేస్తాయి.

1. పెయింట్

1. పెయింట్

మీ సూర్యుని క్రింద అందమైన మీ కారు బాగా చక్కగా మెరుస్తూ ఉంటుంది, కాని నిజంగా ఏమి జరుగుతుందో తెలుసా ? సూర్యుడు మీ కారు మీద ఉన్న పెయింట్‌ను మెల్లగా తినేస్తాడు తద్వారా మెరిసే మీ కారు కాస్త ఉన్న మెరుపులు కోల్పోతుంది. దీనిని నివారించాలంటే మీ కారును నీడ పాటున పార్క్ చేయడం ఎంతో ఉత్తమం.

2. ఇంటీరియర్ లేదా అప్ హోల్‌‌స్ట్రే

2. ఇంటీరియర్ లేదా అప్ హోల్‌‌స్ట్రే

బాగా మండే ఎండలు మీ కారు పెయింట్ మీదనే కాదు, ఇంటీరియర్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాడు. ఎందుకంటే కారు లోపల లెథర్ మరియు నలుపు రంగు గల సీట్లు, అప్‌హోల్‌స్ట్రే ఉన్నట్లయితే అవి ఎండను ఎక్కువగా గ్రహిస్తాయి. మీరు కారులోకి వెళ్లిన తరువాత కాసేపు సరిగా ఊపిరి కూడా తీసుకులేరు. అందుకోసం కారు తలుపులు కొద్ది సేపు తెరిచి తరువాత లోనికి వెళ్లడం మంచింది.

3. అద్దం

3. అద్దం

సూర్యుని వేడికి మీ కారు అద్దాలను సైతం పగలగొట్టే శక్తి కలదు. కాబట్టి మీ కారును వీలైనంత వరకు నీడ పాటున పార్క్ చేయడం లేదా అద్దాల మీద ఎండ పడకుండా వాటని కార్ కవర్లతో కప్పివేయడం మంచింది.

4. టైర్లు

4. టైర్లు

మీరు వేసవి కాలంలో ప్రయాణించే ముందు టైర్లను బాగా గమనించుకోవాలి. టైరు ప్రెసర్, అలైన్‌మెంట్, మరియు అరుగుదల వంటి వాటిని క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి ఎందుకంటే టైర్లు సరిగా లేకుంటే బాగా వేడిగా ఉన్న తారు రోడ్లు పంక్ఛర్ చేయడానికి ప్రయత్నిస్తాయి.

5. ఇంజన్ కూలెంట్

5. ఇంజన్ కూలెంట్

మీ కారుకు సరిపోయే ఇంజన్ కూలెంట్‌ను, రేడియేటర్ లెవల్‌కు తగ్గట్లుగా నింపుకోండి. ఎందుకంటే కారులో కూలెంట్ లేకపోతే ఇది ఇంజన్‌ను పూర్తిగా డ్యామేడజ్ చేస్తుంది.

6. ఇంజన్ అయిల్

6. ఇంజన్ అయిల్

ఇంజన్ ఆయిల్ కారుకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు ఇంజన్ వేడిని తగ్గిస్తూ ఉంటుంది. అంతే కూకుండా ఇంజన్‌లోని అన్ని భాగాలకు కూడా ఇది ప్రవహిస్తుంటుంది. కాబట్టి ఆయిల్ యొక్క చిక్కదనం కోల్పోయి ఇంజన్ భాగాలను రాపిడికి గురిచేస్తుంది.తద్వారా పరికరాలు త్వరగా అరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఎప్పుడు ఇంజన్ ఆయిల్ యొక్క పరిమాణం తగ్గకుండా నాణ్యమైన ఆయిల్‌ను నింపాల్సి ఉంటుంది.

7. ఎయిర్ కండీషనింగ్

7. ఎయిర్ కండీషనింగ్

ఎయిర్ కండీషనింగ్ ఈ వ్యవస్థకు ఇబ్బందిలేనంత వరకు ఎటువంటి సమస్య లేదు. కాని ఏదయినా సమస్య తలెత్తితే మొత్తం వాహనాన్ని దహించివేస్తుంది. కాబట్టి మీరు ఎ/సి లోని గ్యాస్, ఎక్కడయినా లీక్ అవ్వడం, గ్యాస్ పైపులో స్ట్రక్ అవ్వడం వంటి గుర్తించుకోవాలి. అంతే కాకుండా ఏ/సి ఆన్‌లో ఉన్నప్పుడు కార్ స్టార్ట్ చేయకండి, ఎందుకంటే బ్యాటరీ మీద ఎక్కువ ఒత్తిడి కలిగి, ఫ్యూస్‌లు డ్యామేజ్ మరియు బ్యాటరీ వీక్ అవ్వడం వంటివి జరుగుతాయి. అందుకోసం కార్ స్టార్ట్ చేసిన తరువాత ఏ/సి ఆన్ చేసుకోవడం ఎంతో ఉత్తమం.

8. బ్యాటరీ

8. బ్యాటరీ

యాటరీను మీరు తరచూ గమనించుకుంటూ ఉండాలి . బ్యాటరీ మీద తుప్పుపట్టి ఉన్నటెర్మినల్స్‌ను శుభ్రం చేయడం, డిస్టిల్ వాటర్‌తో బ్యాటరీని నింపుతూ ఉండాలి. ఎందుకంటే ఎండాకాలంలో ఏ/సి ఎక్కువగా ఆన్ చేసుకుని ఉండటం వలన బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి.

 మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం.......
  • దక్షిణ భారత సినీ తారల ఖరీదైన కార్లు: తెలుగు యంగ్ హీరోల కార్లు
  • మూత్రం నుండి కాఫీ చేసుకున్నాం: వ్యోమగాముల అనుభవాలు
  • 170 సంవత్సరాల ఇండియన్ రైల్వే చరిత్రలో :49 ఆసక్తికరమైన నిజాలు

Most Read Articles

English summary
Summer Car Care: Maintenance Tips To Beat The Heat
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X