ఐఏఎఫ్ అమ్ముల పొదిలోకి తేజాస్ మార్క్ 1ఎ ఫైటర్ జెట్

ప్రభుత్వం రంగం విమానయాన తయారీ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రతిపాదన మేరకు భారత వాయుద దళం తేజాస్ మార్క్ 1-ఎ యుద్ద విమానాల సేకరణకు అంగీకరించింది.

Written By:

శక్తివంతమైన దేశంగా అవతరించే కొద్దీ పొరుగు దేశాలతో ముంచుకొస్తున్న ముప్పు నానాటికీ పెరుగుతోంది. అధిక సంఖ్యలో శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చకోవడం యావత్ మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నప్పటికీ దేశ భద్రత విషయానికి వస్తే ఆయుధాలను సమకూర్చుకోవడంలో తప్పులేదని చెప్పవచ్చు.

భారత త్రివిధ దళాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వాయు దళంలోకి ఇప్పుడు నూతనంగా తేజాస్ మార్క్ 1-ఎ విమానాలను ఎంచుకునేందుకు మార్గం సుగమం అయ్యింది.

అయితే దీని చేరికతో భారత్ శత్రు దేశాలలో మరింత భయపడాల్సిన అవసరం ఏర్పడింది. నేటి కథనంలో తేజాస్ మార్క్ 1-ఎ యుద్ద విమానం యొక్క ప్రత్యేకతలను తెలుసుకుందాం రండి....

తేజాస్ ఎమ్‌కె-1 విమానం ఆధారంగా తేజాస్ మార్క్-1ఎ విమానాన్ని అభివృద్ది చేయడం జరిగింది. ప్రస్తుతం వాయు దళంలో సేవలందిస్తున్న ఎమ్‌కె-1 మరియు ఎమ్‌కె-2 యుద్ద విమానాలకు మధ్య ప్రముఖ పాత్రను వహించనుంది.

ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ తెలిపిన వివరాలు మేరకు ఈ ఎమ్‌కె-1ఎ యుద్ద విమానంలో ఆధునిక ఏఇఎస్ఏ రాడార్ మరియు ఎలక్ట్రానిక్ వార్‌పేర్ సిస్టమ్‌లను అందించినట్లు తెలిపింది.

దీనికి మునుపటి వేరియంట్ యుద్ద విమానం ఎమ్‌కె-1 కన్నా 1000 కిలోలు తక్కువ బరువును కలిగి ఉంది. ఎమ్‌కె-1 విమానం యొక్క బరువు 6500 కిలోలుగా ఉంది.

తాజా నివేదికల ప్రకారం హెచ్ఏఎల్ నుండి సుమారుగా 120 ఎమ్‌కె-1ఎ విమానాలను సేకరించడానికి ఐఎఫ్ ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఏఎల్ ఈ మొదటి ఎమ్‌కె-1ఎ విమానా తయారీ మీద దృష్టిసారిస్తోంది. దీని పూర్తి స్థాయిలో పరీక్షించిన అనంతరం పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ ప్రారంభించే అవకాశం ఉంది.

ఈ ఎమ్‌కె-1ఎ కేవలం తేలికపాటి విమానమే కాదు, ఇందులో అత్యాధునికి ఏవియానిక్ ఫీచర్లు, అత్యంత చురుకైన తనం మరియు సులభతరమైన నిర్వహణ వంటి లక్షణాలను కలిగి ఉంది.

ఇందులో పరిచయం చేయనున్న అతి ముఖ్యమైన పరికరాలు రెండు అవి, ఎఇఎస్ఎ రాడార్ మరియు ఎలక్ట్రో ఆప్టిక్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సెన్సార్. ప్రస్తుతం ఈ రెండింటిని ఎమ్‌కె-1ఎ లో అమర్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఎమ్‌కె-1ఎ విమానం ఐఒసి లేదా ఎఫ్ఒసి వద్దకు పరీక్షలకు వెళ్లడం లేదని తెలిసింది. మోడ్రన్ ఎక్విప్‌డ్ మార్క్ కలిగి ఉన్న ఎమ్‌కె-1ఎ యుద్ద విమానాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించిన అనంతరం హెచ్‌ఎల్ ప్రొడక్షన్ ప్రారంభించనుంది.

గతంలో కూడా హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎమ్‌కె-2 గురించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను ప్రశ్నించింది. అప్పుడు ఐఎఫ్ అవసరం మేరకు హెచ్‌ఏఎల్ ఎమ్‌కె-2 యుద్ద విమానాన్ని అభివృద్ది చేసింది. ఈ విషయాన్ని డిఫెన్స్ అనలిస్ట్ రానేష్ రాజన్ గుర్తు చేసాడు.

భారత వాయు దళంలో అవసరానికి తగ్గట్లుగా హెచ్‌ఎఎల్ సూచించడం ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంగీకరిస్తోంది. ఐఎఎఫ్ అవసరాల మేరకే ఇప్పుడు ఈ ఎమ్‌కె-1ఎ శ్రేణి విమానాన్ని ప్రతిపాదించింది. అయితే దీనిని ఐఎఫ్ కోరుకుంటున్న నేపథ్యంలో హెచ్‌ఎల్ అభివృద్ది చేస్తోంది.

ఈ ఏడాదిలోపు తొలుత ఒక విమానాన్ని అభివృద్ది చేసి అన్ని అంశాల పరంగా పరీక్షించనుంది, తరువాత 2017 ఏడాది ముగిసే లోపు పూర్తి స్థాయి ప్రొడక్షన్‌ను ప్రారంభించడానికి సిద్దం కానున్నట్లు హెచ్‌ఏఎల్ తెలిపింది.

పాక్ ను చిధ్రం చేసే భారతదేశపు 10 శక్తివంతమైన యుద్ద విమానాలు
క్షణ కాలంలో పాకిస్తాన్‌ను బూడిద చేయగల భారత దేశపు శక్తివంతమైన 10 యుద్ద విమానాలు

చైనాకు రష్యా అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్లు: భారత్ పరిస్థితి ఏంటి ?

  

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Friday, February 3, 2017, 16:58 [IST]
English summary
Important Things About Tejas Mark 1a Fighter Jet
Please Wait while comments are loading...

Latest Photos