ప్రారంభానికి సిద్దమైన భారతదేశపు అత్యంత పొడవైన సొరంగ మార్గం

Written By:

భారతదేశపు అత్యంత పొడవైన సొరంగ రహదారి మార్గం ప్రారంభానికి సిద్దమైంది. చెనాని మరియు జమ్మూకాశ్మీర్ లోని నాశ్రి ప్రాంతాలను కలిపే మార్గంలో ఈ సొరంగ మార్గం కలదు. మార్చి 2017 లో దీనిని ప్రారంభించి రహదారి సేవలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇతర రహదారి మార్గంతో పోల్చితే ఈ సొరంగ మార్గం ద్వారా చెనాని మరియు నాశ్రి ప్రాంతాల మధ్య 38 కిలోమీటర్ల దూరం తగ్గినట్లు తెలిసింది. దీనిని టన్నెల్ ఆఫ్ హోప్ అని కూడా పిలుస్తున్నారు.

తాజాగ అందిన నివేదకల ప్రకారం ప్రధాన మంత్రి కార్యాలయం నుండి తెలిసిన సమాచారం మేరకు నరేంద్ర మోడీ గారు ఈ సొరంగ మార్గాన్ని ప్రారంభిస్తారని తెలిసింది.

9.2 కిలోమీటర్ల మేర ఉన్న ఈ సొరంగ మార్గాన్ని చెందిన పనులు 2011లో ప్రారంభమయ్యాయి. అప్పట్లో దీనిని 2016 ఆగష్టు నాటికి ప్రారంభానికి సిద్దం చేయాలని భావించారు.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు మాట్లాడుతూ, ఇదే మార్గంలో ఉన్న ఈ సొరంగంతో పాటు క్వాజీగుండ్ మరియు బనిహాల్ మధ్య మరో సొరంగం ఉందని తెలిపాడు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో జమ్మూ మరియు కాశ్మీర్‌లను ఈ రెండు సొరంగాలు కలుపుతాయి.

ఈ రెండు సొరంగ మార్గాలు ఒకే సారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం ద్వారా జమ్మూ మరియు కాశ్మీర్ ల మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గి సుమారుగా రెండున్నర గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.

చెనాని మరియు నాశ్రి ప్రాంతాల మధ్య ఉన్న సొరంగ మార్గం యొక్క వెడల్పు 9.3 మీటర్లుగా ఉంది. అదే విధంగా క్వాజీగుండ్ మరియు బనిహాల్ మధ్య ఉన్న సొరంగం మార్గంలో 7 మీటర్ల చుట్టు కొలతతో రెండు ట్యూబ్‌లు ఉన్నాయి.

అన్ని వాతావారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టిన ఈ సొరంగ మార్గాల ద్వారా రవాణా సేవలు మరింత విసృతం కానున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుండి దేశంలోని వివిధ ప్రధాన నగరాలకు పండ్ల రవాణా మరియు ఇది వరకు జమ్మూ కాశ్మీర్‌కు చేరని వస్తువుల సరఫరా ఇప్పుడు సాధ్యం అవుతుంది.

ఈ ప్రాంతంలో రవాణా మెరుగైన నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు పెరిగి, ప్రాంతీయంగా ఉండే యువతకు ఉద్యోగ ఉపాధి మరింత పెరగనుంది.

రవాణా, వ్యాపార మరియు పర్యాటక రంగాల వారీగా కూడా ఈ మార్గం ద్వారా ఆ రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

 

Story first published: Friday, March 10, 2017, 10:52 [IST]
English summary
India's Longest Road Tunnel Set To Open — The Tunnel Of Hope
Please Wait while comments are loading...

Latest Photos