సముద్రగర్బంలో పరుగులుపెట్టనున్న భారతదేశపు మొదటి బుల్లెట్ రైలు

Written By:

భారతీయులకు ఒక శుభ వార్త సముద్ర గర్భంలో బుల్లెట్ రైలులో ప్రయాణించే అవకాశాన్ని ఇండియన్ రైల్వే అందిస్తోంది. ఎలా అంటారా ? ఇండియన్ రైల్వే ముంబాయ్ మరియు అహ్మదాబాద్‌ల మధ్య చేపట్టిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ రైలును సముద్ర గర్భంలో కొంత దూరం మేర నడపాలని నిర్ణయించారు. ఏ ప్రాంతంలో, ఎన్ని కిలోమీటర్లు మేర ఎంత సమయం పాటు అనే సందేహాలు మొదలయ్యాయి కదా, మరెందుకు ఆలస్యం క్రింది కథనం మీద ఓ చూపు చూడండి మీకే తెలుస్తుంది.

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ రోజు రోజుకీ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఎందుకంటే ఇది భారత దేశపు మొదటి బుల్లెట్ రైలు అంతే కాకుండా దీనిని ఇప్పుడు సుమారుగా 21 కిలోమీటర్ల పాటు సముద్ర గర్బంలో నడపాలని నిర్ణయం తీసుకున్నారు.

నూతనంగా ఏర్పడిన నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఈ మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌ను పూర్తిని చేయనుంది.

భారతీయులకు ఇండియన్ రైల్వే ఒకేసారి బుల్లెట్ మరియు సముద్ర గర్భంలో ప్రయాణించే అవకాశాన్నిఅందిస్తోంది. ముంబాయ్ అహ్మదాబాద్‌ల మధ్య ఉన్న థానేలో అతి పొడవైన సముద్ర గర్భ టన్నెల్‌ను నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం సుమారుగా 97,636 కోట్ల రుపాయలను వినియోగించనున్నారు. ఇందులో సుమారుగా 81 శాతం వరకు జపాన్ నుండి రుణ రూపంలో తీసుకుంటున్నారు.

అయితే సాఫ్ట్ లోన్ రూపంలో ఈ మొత్తానికి ఏడాదికి 0.1 శాతం చొప్పున 15 ఏళ్ల పాటు వడ్డీ చెల్లిస్తూ మరియు ఈ లోపు అసలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్‌కు కావాల్సిన సుమారుగా 500 కోట్లు విలువ చేసే స్పెషల్ పర్పస్ వాహనాలను కొనుగోలు చేయనుంది.

భారతీయులంతా గర్వంగా చెప్పుకునే ఈ ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు చెందిన నిర్మాణ పనులు 2018 ఏడాది చివరి నుండి మొదలుకానున్నాయి.

ఈ ప్రాజెక్ట్ నిర్మానికి కావాల్సిన ప్రత్యేక వాహనాల కొనుగోలు ఇప్పటికే రైల్వే 200 కోట్ల రుపాయలు కేటాయించి, అయితే దీనికి కావాల్సిన మిగతా 50 శాతం వాటాను గుజరాత్ మరియు మహరాష్ట్ర రాష్ట్రాలు 25 శాతం చొప్పును కేటాయించుకోవాలని నిర్ణయించింది.

ముంబాయ్ మరియు అహ్మదాబాద్‌ల మధ్య ఉన్న దూరం సుమారుగా 508 కిలోమీటర్లుగా ఉంది.

ఈ రెండు నగరాల మధ్య పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది, మరియు దీని గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లుగా ఉంది.

ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ఉన్న దూరాన్ని దురంతో రైలు ఏడు గంటలపాటు ప్రయాణించి 508 కిలోమీటర్ల దూరాన్ని ఛేదిస్తోంది.

Read more on: #రైలు #rail
English summary
India To Get Bullet Train That Would Travel Under Sea
Please Wait while comments are loading...

Latest Photos