భారత్ అగ్ని-V అణు క్షిపణి పరీక్షలపై ప్రపంచ దేశాల్లో నెలకొన్న సందిగ్దత

అగ్ని-V అణు క్షిపణిని ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేసుకుంది. ఈ తరుణంలో చైనాతో పాటు భారత్ శత్రు దేశాలు భారత్‌ను చూసి మరింత భయపడే పరిస్థితి ఏర్పడింది.

By Anil

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అణు సామర్థ్యం గల గరిష్ట పరిధి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి చైనా వద్ద ఉంది. అయితే భారత్ చైనాను ఎదుర్కునేందుకు అగ్ని-V ఇప్పటికే పలు దశలలో నిర్వహగించిన పరీక్షలలో విజయం సాధించిన అగ్ని-V ఇప్పుడు చివరి దశ పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్దమైంది. ఈ పరీక్షల అనంతరం పూర్తి స్థాయిలో సేవలను ప్రారంభించనుంది. ఈ అగ్ని-V అందుబాటులోకి వస్తే చైనా యొక్క క్షిపణి ప్రపంచ వ్యాప్తంగా తన ప్రాబల్యాన్ని కోల్పోయినట్లే.

అగ్ని-V అణు క్షిపణి

భారత్ తన మొట్టమొదటి ఖండాంతర బాలిస్టిక్ అణు క్షిపణి అగ్ని-V యొక్క చివరి ఆకృతీకరణ(configuration) పరీక్షలకు సిద్దమవుతోంది. అణు సామర్థ్యం గల ఈ అగ్ని-V క్షిపణికి ఇది నాలుగవ మరియు ఆఖరి పరీక్ష. భారత వ్యూహాత్మక దళాలు వినియోగించడానికి ముందుగా అన్నిఅంశాల పరంగా పూర్తి స్థాయి పరీక్షలకు సిద్దమవుతోంది.

అగ్ని-V అణు క్షిపణి

ఖండాంతర బాలిస్టిక్ అణు క్షిపణి అగ్ని-V ని రెండు సంవత్సరాల అనంతరం ఒడిసాలోని అబ్దుల్ కలాం దీవిలో పరీక్షించనున్నారు. అబ్దుల్ కలాం దీవిని వీలర్ ఐలాండ్ అని కూడా అంటారు. ఒడిసా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుండి బంగాళాఖాత సముద్రంలో 150 కిలోమీటర్ల దూరంలో ఈ దీవి కలదు. ఇక్కడ ప్రత్యేకించి అణు క్షిపణులను ప్రయోగించి పరీక్షిస్తుంటారు.

అగ్ని-V అణు క్షిపణి

ఈ అగ్ని-V క్షిపణిని ప్రయోగించడానికి క్యానిస్టర్ మీద ఏర్పాటు చేసినట్లు తెలిసింది. డిసెంబర్ చివరిలో లేదా వచ్చే ఏడాది జనవరి మొదట్లో ఈ క్షిపణిని పరీక్షించనున్నారు. క్యానిస్టర్ అనగా - క్షిపణుల్ని ప్రయోగించే భాగాన్ని క్యానిస్టర్ అంటారు.

అగ్ని-V అణు క్షిపణి

ప్రస్తుతం ఈ అగ్ని-V క్షిపణిలో స్వల్ప సాంకేతిక మార్పులు మరియు చేర్పులకు సంభందించిన పనులు జరుగుతున్నాయి. చివరి సారిగా 2015 జనవరిలో పరీక్షించిన సమయంలో గుర్తించిన లోపాలను సరిచేసే పనిలో సాంకేతిక నిపుణులు నిమగ్నమయ్యారు.

అగ్ని-V అణు క్షిపణి

అగ్ని-V ఖండాతర బాలిస్టిక్ అణు క్షిపణిలో చివరి పరీక్షల ప్రకారం అంతర్గత బ్యాటరీ మరియు విద్యుత్ ఆకృతీకరణ (Electronic Configurations) లకు సంభందించిన వ్యవస్థలకు కీలక సర్దుబాట్లు జరుగుతున్నట్లు రక్షణ రంగం సమాచార వర్గాలు స్పష్టం చేశాయి.

అగ్ని-V అణు క్షిపణి

ఇండియా ప్రపంచ వ్యాప్తంగా న్యూక్లియర్ సప్లయర్స్‌కు సంభందించిన 48 దేశాలతో వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది, 34 దేశాల సభ్యత్వం ఉన్న క్షిపణి సాంకేతిక నియంత్రణా పాలక మండలితోపాటు ఈ మధ్యనే జపాన్‌తో సివిల్ న్యూక్లియర్ కో ఆపరేషన్ ఒప్పందం కూడా చేసుకుంది.

అగ్ని-V అణు క్షిపణి

త్వరలో జరగబోయే నాలుగవ అగ్ని-V పరీక్షల్లో ఈ మిస్సైల్ ఉత్తర చైనాలోని దాదాపు అన్ని భూ భాగాలను తాక గల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇప్పటికే మూడు పరీక్షల్లో విజయవంతమైన దీనికి ఇదే చివరి పరీక్ష.

అగ్ని-V అణు క్షిపణి

భారత వ్యూహాత్మక దళాలు ఇప్పటికే ఈ అగ్ని-V అణు క్షిపణిని మూడు దశలలో పరీక్షించింది. మొదటి సారి ఏప్రిల్ 2012 లో, రెండవ సారి సెప్టెంబర్ 2013 లో మరియు మూడవ సారి 2015 జనవరిలో పరీక్షించడం జరిగింది.

అగ్ని-V అణు క్షిపణి

మూడవ దశలో జరిగిన 2015 జనవరిలో దీనిని పరీక్షించడానికి ఉన్న సాధ్యాసద్యాలను కూడా గమనించడం జరిగింది. దీనిని టట్రా లాంచర్ ట్రక్కు మీద నుండే మిస్సైల్ లాంచర్ క్యానిస్టర్ ఆధారంతో ప్రయోగించడం జరిగింది. ఊహించని రీతిలో అత్యంత భయంకరంగా ప్రయాణించింది.

అగ్ని-V అణు క్షిపణి

మూడవ దశలో జరిగిన పరీక్షల ప్రకారం 50-టన్నుల బరువున్న అగ్ని-V అణు క్షిపణిని ఎలాంటి నైసర్గిక స్వరూపం నుండి అయినా సునాయాసంగా ప్రయోగించే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. దేశ రక్షణ రంగంలో ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకోనుంది.

అగ్ని-V అణు క్షిపణి

ఈ అగ్ని చివరి దశ పరీక్షలు పూర్తి చేసుకుంటే ఖండాంతర బాలిస్టిక్ మిస్సైళ్ల(మిస్సైల్ పరిధి 5,000 నుండి 5,500 కిలోమీటర్లు) పరిజ్ఞానం గల సూపర్ ఎక్స్‌క్లూజివ్ దేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ దేశాల సరసన చేరనుంది.

అగ్ని-V అణు క్షిపణి

ప్రస్తుతం భారత్ వద్ద తక్కువ పరిధి గల ఫృథ్వి మరియు ధనుష్ మిస్సైళ్లతో పాటు అగ్ని-I అగ్ని-II అదే విధంగా అగ్ని-III లను కలిగి ఉంది. వీటిని ప్రత్యేకించి పాకిస్తాన్ కోసం సిద్దం చేసుకుంది.

అగ్ని-V అణు క్షిపణి

చైనాతో సత్సంభందాలు కోల్పోతున్న నేపథ్యంలో చైనా వలన కలిగే ముప్పును ఎదుర్కోవడానికి అగ్ని-IV మరియు అగ్ని-V అణు క్షిపణులను ప్రత్యేకంగా అభివృద్ది చేసినట్లు వ్యూహాత్మక భత్రతా దళాలు పేర్కొన్నాయి.

అగ్ని-V అణు క్షిపణి

శత్రు స్థావరాల నుండి దూసుకొచ్చే అణు క్షిపణులను నాశనం చేయడానికి కూడా ఈ అగ్ని-V క్షిపణి ఉపయోగపడుతుంది. ఇందుకోసం అగ్ని క్షిపణిలో మల్టిపుల్ ఇండిపెండెట్లి టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ (MIRVs) అనే పరిజ్ఞానాన్ని అందివ్వడం జరిగింది.

అగ్ని-V ప్రత్యేకతలు

అగ్ని-V ప్రత్యేకతలు

  • పొడవు: 17 మీటర్లు
  • చుట్టు కొలత: 2 మీటర్లు
  • మొత్తం బరువు: 50 టన్నులు
  • వార్ హెడ్: 1.5 టన్నులు (న్యూక్లియర్ సామర్థ్యం)
  • వేగం: శబ్దానికన్నా 24 రెట్లు గరిష్ట వేగంతో
  • ఇంధనం: మూడు దశలలో ఘణ రూపం ఇంధనం
  • పరిధి: 5,000 కిలోమీటర్ల వరకు
  • మిస్సైళ్లు వాటి గరిష్ట పరిధి

    మిస్సైళ్లు వాటి గరిష్ట పరిధి

    ప్రయోగించబడినవి

    • పృథ్వి- 350 కిలోమీటర్లు
    • అగ్ని-I 700కిలోమీటర్లు
    • అగ్ని-II 2,000కిలోమీటర్లు
    • అగ్ని-III 3,000కిలోమీటర్లు
    • ప్రయోగించాల్సినవి

      • అగ్ని-IV 4,000కిలోమీటర్లు
      • అగ్ని-V 5,000కిలోమీటర్లు కన్నా ఎక్కువ
      • .

        • జయలలిత గారి ఒకప్పటి ప్రపంచం ఇదే...!!
        • విమానంలో కూర్చోవడానికి అత్యంత సురక్షితమైన చోటు ఏది ?
        • 17.5 గంటల పాటు నాన్ స్టాప్ గా ప్రయాణించే విమానం...

Most Read Articles

English summary
India Gets Ready To Test Nuclear Capable Agni-V — Here's Why China Is Scared Of Our First Ever ICBM
Story first published: Monday, December 19, 2016, 19:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X