రేసింగ్ ఛాంపియన్ అశ్విన్, ఇతని భార్య బిఎమ్‌డబ్ల్యూ కారులో సజీవదహనం

ఇండియా కార్ రేసింగ్ ఛాంపియన్ అశ్విన్ సుందర్ మరియు ఇతని భార్య ఘోరంగా చనిపోయారు. వీరిద్దరూ ప్రయణిస్తున్న కారులో మంటలు చెలరేగి కారులోనే ఇద్దరూ సజీవదహనమయ్యారు.

Written By:

చెన్నైకి చెందిన ప్రముఖ ఇండియన్ కార్ రేసింగ్ ఛాంపియన్ ఆశ్విన్ సుందర్ మరియు అతని భార్య శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో సజీవంగా దహనమయ్యారు. భార్యభర్తలిద్దరూ ప్రయాణిస్తున్న బిఎమ్‌డబ్ల్యూలో మంటలు చెలరేగి అక్కడిక్కడే కాలి బూడిదయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలుకుందాం రండి...

అశ్విన్ సుందర్ మరియు ఇతని భార్య నివేదిత ఇద్దరూ శనివారం చెన్నైలోని రాజా అన్నామలైపురంలోని ఎమ్‌ఆర్‌సి నగర్‌లో నివశిస్తున్న స్నేహితున్ని కలిసి తిరిగి వస్తున్న సమయంలో తెల్లవారుజామున సుమారుగా 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అశ్విన్ సుందర్ ఇండియన్ కార్ రేసింగ్ ఛాంపియన్‌గా అందరికీ తెలిసిందే, ఆశ్విన్ భార్య నివేదిత డాక్టర్. కారు అధిక వేగంలో ఉన్నపుడు అదుపు తప్పి ప్రక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. చెట్టుకి మరియు ప్రకనే ఉన్న ప్రహరీ గోడకు మధ్యలో కారు ఇరుక్కుపోయింది.

అత్యధిక వేగం వద్ద కారు ప్రమాదానికి గురవ్వడంతో మంటలు చెలరేగాయి. ముందు సీటులో ఉన్న నివేదిత మరియు అశ్విన్ లు డోర్లను తెరవడానికి ప్రయత్నించినా అవి లాకైపోయి ఉండటం మరియు చెట్టుకు గోడకు మధ్యలో కారు ఇరుక్కుపోవడంతో బయటపడటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

అనతి కాలంలో మంటలు బిఎమ్‌డబ్ల్యూ కారు మొత్తాన్ని వ్యాపించి, కారులోనే ఇద్దరూ సజీవదహనమైపోయారు. అయితే అటుగా వెళుతున్న కొందరు వ్యక్తులు పోలీసులకు మరియు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నా ఫలితమం లేకపోయింది. అప్పటికే ఇద్దరూ మంటల్లో చిక్కుకుని కాలిపోయారు. సుమారుగా అరగంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇద్దరినీ గుర్తించలేనంతగా కాలిపోయారు. మృతదేహాలను చూసి మొదటల్లో వారెవరో గుర్తించలేకపోయారు. అయితే కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా వీరిద్దరూ రేసర్ అశ్విన్ సుందర్ మరియు ఆయన భార్య నివేదితలుగా గుర్తించారు.

పోస్ట్ మార్టం నిమిత్తం అశ్విన్ సుందర్ మరియు నివేదిత మృత దేహాలను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుండె జలదరించే ఈ ప్రమాదానికి ముఖ్య కారణం అధిక వేగం అని తేలింది. కాబట్టి పాఠకులారా మిత వేగంతో మాత్రమే ప్రయాణించండి...

ప్రమాదం జరిగిన ముందు రోజు అశ్విన్ సుందర్ మరియు నివేదిత ల వివాహ వార్షికోత్సం అని తెలిసింది. అంటే ప్రమాదం జరిగింది శనివారం తెల్లవారుజామున, దీనికి ముందు రోజు శుక్రవారం (మార్చి 17) వీరి మ్యారేజ్ యానివర్సిరీ.

వీడియో ద్వారా ప్రమాద ఘటనను వీక్షించగలరు.....

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....

బిఎమ్‌డబ్ల్యూ  ఐ8 కార్ ఫోటో గ్యాలరీ...

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫోటో గ్యాలరీ....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Saturday, March 18, 2017, 12:51 [IST]
English summary
Also Read In Telugu: Indian Car Racing Champion Ashwin Sunder Dies In A Tragic Accident
Please Wait while comments are loading...

Latest Photos

LIKE US ON FACEBOOK