55 ఏళ్ల సేవ: ప్రపంచపు అతి పురాతణ యుద్ద విమాన వాహక నౌక విరాట్‌కు వీడ్కోలు

ఇండియన్ నేవీ 55 సంవత్సరాల వయస్సున్న ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌకను సర్వీసు నుండి తప్పించి శాశ్వత విశ్రాంతిని కల్పించనుంది. అయితే ఇది ఇప్పుడు ఆంద్రప్రదేశ్ చెంతకు చేరింది.

By Anil

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక. సుమారుగా 55 సంవత్సరాల పాటు నౌకా దళంలో సేవలందించింది. అందులో 27 ఏళ్ల పాటు రాయల్ నేవీ (బ్రిటీష్ నౌకా దళం)లో సేవలందించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పురాతణమైన యుద్ద విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విరాట్‌కు భారత నౌకాదళం కొచ్చి నగరంలోని ఓడరేవులో సర్వీసు నుండి వీడ్కోలు పలికింది.|

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

సుమారుగా ఐదున్నర దశాబ్దాల పాటు నిర్విరామంగా నౌకా దళానికి సేవలందించిన ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద నౌకను శాశ్వతంగా సర్వీసు నుండి తొలగించి విరామం కల్పించింది.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

భారత నౌకా దళం దీనిని సర్వీస్ నుండి పూర్తిగా ఉపసంహరించి, 55 ఏళ్ల సేవలకు గాను నేవీ అధికారులు ఘణంగా వేడుకలు జరిపి ఐఎన్‌ఎస్‌ విరాట్‌కు వీడ్కోలు పలుకనున్నారు.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఐఎన్ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌకను చేజిక్కించుకోవడానికి అమితాసక్తితో ఉంది.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

భారతీయ నౌకా దళం ఈ నౌకను సేవల నుండి తప్పించిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించనుంది.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ నగరంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయడం కోసం ఇలాంటి పురాతణ నౌకలు మరియు జలాంతర్గాములను సేకరిస్తోంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఐఎన్ఎస్ విరాట్‌ను కూడా ప్రజల సందర్శనకు ఉపయోగించనుంది.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

యుద్ద విమానాలను మోసుకెళ్లే ప్రపంచపు అత్యంత పురాతణమైన నౌక ఈ ఐఎన్ఎస్ విరాట్ ఇప్పుడు ఇండియాలోని మన రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్) చెంతకు చేరింది.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

1943 లో ఇంగ్లాండ్ ప్రభుత్వం విక్కర్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే నౌకల తయారీ సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. 1953 ఫిబ్రవరి 16న ఆ దేశం విడుదల చేసింది.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

1959 నవంబర్ 25 నుండి రాయల్ నౌకాధళంలో సేవలు ప్రారంభించింది. ఆ తరువాత 1987 ఏడాది వరకు నిర్విరామంగా రాయల్ నేవీలో విసృత సేవలు అందించింది.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

1982 నుండి 1985 మధ్య ఫాల్యాండ్ దీవుల్లో జరిగిన ఉద్యమాల్లో ఈ నౌక కీలక పాత్ర పోషించింది.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

రాయల్ నేవీ ఈ యుద్ద నౌకను తమ నౌకా దళం నుండి 1987లో తొలగించింది. తరువాత 1987 మే నెలలో భారత ప్రభుత్వం ఈ ఐఎన్ఎస్ విరాట్ ను కొనుగోలు చేసింది.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

సుమారుగా 28 ఏళ్ల పాటు భారత నౌకా దళంలో సేవలందించిన విరాట్ ను ఫిబ్రవరి 2015 న ముంబాయ్ నుండి కొచ్చి రేవుకు చేరుకుంది. అయితే అప్పటికే విధులు సరిగా నిర్వర్తించలేక సర్వీసు నుండి విరమణకు సిద్దమయ్యింది.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

ఏట్టకేలకు భారత నౌకా దళం దీనిని సర్వీసు నుండి తొలగించి నౌకాధళ కేంద్ర ముంబాయ్‌కు చేర్చింది. ఇప్పుడు వినియోగంలో లేని ఈ నౌకను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేజిక్కించుకోనుంది.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక భారత సముద్ర తీరంలో నిరంతర గస్తీ కోసం విశేష సేవలందించింది. నౌకాధళ విమానాలను తనతో పాటు తీసుకెళ్లి తీరం చుట్టూ గస్తీ నిర్వహించేది.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

ఈ ఐన్ఎస్ విరాట్ విమాన వాహన నౌక సుమారుగా 28,700 టన్నుల బరువును మోయగలదు.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

దీని పొడవు 226.5 మీటర్లు (743అడుగులు), వెడల్పు 48.78 మీటర్లు (160 అడుగులు) మరియు ఎత్తు నీట మట్టం నుండి 8.8 మీటర్లు (29 అడుగులు)గా ఉంటుంది.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

ఐఎన్ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక యొక్క గరిష్ట వేగం గంటకు 52 కిలోమీటర్లు (28 నాటికల్స్)గా ఉంది. దీని పరిధి గంటకు 26 కిలోమీటర్ల వేగంతో నిరంతరంగా 10,500 కిలోమీటర్లు ప్రయాణించగలదు.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

ఇందులో గరిష్టంగా 2,100 మంది వరకు ప్రయాణించవచ్చు. నౌకకు సంభందించి 1,207 మంది మరియు యుద్ద విమానాలకు సంభందించి 143 మంది విధుల్లో ఉండేవారు.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

ఐఎన్ఎస్ విరాట్ నౌక ద్వారా గరిష్టంగా 26 వరకు యుద్ద విమానాలను మోసుకెళ్లవచ్చు.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

సాంకేతికంగా ఇందులో నాలుగు స్టీమ్ బాయిలర్ టర్బైన్స్ కలవు. ఇవి సుమారుగా 400పిఎస్ఐ సామర్థ్యంతో 57,000 కిలోవాట్ పవర్ ఉత్పత్తి చేయును.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దీనిని వైజాగ్‍‌లో మ్యూజియంలా ఎర్పాటు చేయడానికి భారత నౌకా ధళం నుండి కొనుగోలు చేయడానికి 20 కోట్ల రుపాయలు వెచ్చించారు.

ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ద విమాన వాహక నౌక

  • భారత్ కు పొంచి ఉన్న ముప్పు....!!
  • సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!
  • 102 ఏళ్ల తరువాత విస్తరించబడిన పనామా కెనాల్ చరిత్ర

Most Read Articles

English summary
Read In Telugu: Indian Navy Bids Farewell To Worlds Oldest Aircraft Carrier INS Viraat
Story first published: Tuesday, October 25, 2016, 17:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X