ప్రపంచ స్థాయి సదుపాయాలతో పట్టాలెక్కడానికి సిద్దమైన తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు

By Anil

భారతీయ రైల్వే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన వసతులు గల తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంటోంది. గత రైల్వే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రకటింటించిన నిర్ణయం ప్రకారం తేజాస్ రైలు విడుదలకు సన్నద్దం అవుతోంది.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పట్టాలెక్కనున్న తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో...

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు

రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి వసతులను కల్పించే దిశగా అందుబాటులోకి తెచ్చిన హంసఫార్, అంతోదయ మరియి ధీన్ ధయాళ్ వంటి రైళ్ల మాదిరిగానే ఈ తేజాస్ ఎక్స్‌ప్రెస్ రూపొందించబడింది.

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలును గోల్టెన్ ఛారియట్ అనే పేరుతో పిలవచ్చు. ఎందుకంటే ఈ రైలు భోగీలను బంగారు వర్ణంతో పెయింటింగ్ చేయనున్నారు.

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు

ఈ రైలు అత్యాధునిక వినోదాత్మక సాంకేతికతలు ఉన్నాయి. అవి, వై-ఫై సదుపాయం, ఇంటిగ్రేటెడ్ బ్రెయిలీ డిస్ల్పేలను వినియోగించారు.

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు

తేజాస్ రైలులో ఎక్జ్సిక్యూటివ్ క్లాస్ మరియు ఛైర్ క్లాస్‌లను అందించారు. 3-ఏసి గల ఇలాంటి వాటిని హంసఫార్ రైలులో గుర్తించవచ్చు.

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలులో సుమారుగా 22 రకాల ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లను అందించారు.

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు

హెడ్ ఫోన్ అనుసంధానం గల డిస్ల్పేలు, మరియు భద్రతకు సంభందించిన సూచనలివ్వడానికి ఎల్‌‌ఇడి బోర్డ్‌లను అందించారు.

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు

ఈ రైలులో ఉన్న బయో వ్యాక్యూమ్ టాయిలెట్లలో నీటి మట్టాన్ని తెలిపే ఇండికేటర్లు మరియు సెన్సార్లతో పనిచేసే నీటి కొళాయిలు, హ్యాడ్ డ్రైయ్యర్లు ఉన్నాయి.

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు

అత్యాధునిక సౌకర్యాలతో పాటుగా ఈ తేజాస్ రైలులో టీ మరియు కాఫీ వితరణ చేసే యంత్రాలు, మ్యాగజైన్ మరియు స్నాక్ టేబుళ్లు ఉన్నాయి.

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు

తేజాస్ మరియు హంసఫార్ రెండు రైళ్లలో కూడా సీసీటీవీలు, అగ్ని మరియు పొగను గుర్తించే వ్యవస్థ కలదు.

తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు

  • రైలు ప్రయాణం మనకెంతో సరదాగ ఉంటుంది, కాని దానిని నడిపే వారికి అదో నరకం
  • రేల్వే స్టేషన్లలో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రేతాత్మలు

Most Read Articles

Read more on: #రైలు #rail
English summary
Indian Railways Set To Launch Tejas Express Train
Story first published: Tuesday, July 12, 2016, 15:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X