స్పానిష్ హై స్పీడ్ టాల్గో రైళ్లను పరీక్షించిన ఇండియన్ రైల్వే

By Anil

ఇండియన్ రైల్వే మరొక పురోగతిని సాధించింది. స్పానిష్‌కు చెందిన టాల్గో హై స్పీడ్ రైళ్లను ఇండియన్ రైల్వే పట్టాల మీద విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష విజయం కావడంతో దేశీయంగా హై స్పీడ్ టాల్గో రైళ్ల రాకపోకలు ప్రారంభ కావడానికి మార్గం సుగమం అయ్యింది. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో....

స్పానిష్ హై స్పీడ్ టాల్గో రైళ్లను పరీక్షించిన ఇండియన్ రైల్వే

గడిచిన ఆదివారం నాడు స్పానిష్‌కు చెందిన మొదటి టాల్గో హై స్పీడ్ రైలును ఇండియన్ పట్టాలపై నడిపి పరీక్షించారు. ఉత్తర ప్రదేశ్‌లోని బారెల్లీ నుండి మొరాదాబాద్ వరకు ప్రయోగాత్మకంగా నడిపారు.

స్పానిష్ హై స్పీడ్ టాల్గో రైళ్లను పరీక్షించిన ఇండియన్ రైల్వే

తొమ్మిది కోచ్‌లు గల టాల్గో రైలును బారెల్లీ నుండి ప్రారంభించడానికి 4,500 హార్స్‌పవర్ గల డీజల్ ఇంజన్‌ను వినియోగించారు.

స్పానిష్ హై స్పీడ్ టాల్గో రైళ్లను పరీక్షించిన ఇండియన్ రైల్వే

ట్రయల్ రన్‌‌ను బారెల్లీ మరియు మొరాదాబద్ మధ్య ఉన్న 90 కిలోమీటర్లు పాటు నిర్వహించారు.

స్పానిష్ హై స్పీడ్ టాల్గో రైళ్లను పరీక్షించిన ఇండియన్ రైల్వే

బారెల్లీలో ఉదయం 8 గంటల 50 నిమిషాలకు ప్రారంభించి 10 గంటల 15 నిమిషాలకు మొరాదాబాద్‌కు చేరుకుంది. ఈ సమయంలో రైలు సుమారుగా 80 నుండి 110 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసింది.

స్పానిష్ హై స్పీడ్ టాల్గో రైళ్లను పరీక్షించిన ఇండియన్ రైల్వే

ఈ టాల్గో రైలును ప్రారంభంలో ఖాళీగా ప్రయోగించారు, తరువాత ప్రయాగాత్మక సభ్యులు మరియు ఇసుక సంచులతో ఈ రైలు ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు.

స్పానిష్ హై స్పీడ్ టాల్గో రైళ్లను పరీక్షించిన ఇండియన్ రైల్వే

ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో ఉన్న కోచ్‌ల కన్నా ఈ రైళ్లు ఎంతో తేలికైనవి. ఎందుకంటే వీటిని అల్యూమినియం లోహంతో రూపొందించారు. ఎక్కువ పటిష్టం ఉండి తక్కుల బరువున్న లక్షణాలున్న ఈ లోహాన్ని ఎక్కువ విమాన తయారీలో వినియోగిస్తారు.

స్పానిష్ హై స్పీడ్ టాల్గో రైళ్లను పరీక్షించిన ఇండియన్ రైల్వే

టాల్గో రైళ్ల యొక్క డిజైన్ శైలి మరియు తక్కువ బరువు ఉండటం వలన మలుపులు వద్ద కూడా దీని వేగాన్ని తగ్గించకుండా నడపవచ్చని అధికారులు తెలిపారు.

స్పానిష్ హై స్పీడ్ టాల్గో రైళ్లను పరీక్షించిన ఇండియన్ రైల్వే

దీనిని బారెల్లీ మరియు మొరాద్‌బాద్ మార్గంలో కాకుండా మరో రెండు మార్గాలలో ప్రయోగించనున్నారు, అవి రాజధాని మార్గం అయిన మథురా మరియు పల్వాల్ మధ్య అలాగే ఢిల్లీ మరియు ముంబాయ్‌ల

మధ్య దీనిని ప్రయోగించనున్నారు.

స్పానిష్ హై స్పీడ్ టాల్గో రైళ్లను పరీక్షించిన ఇండియన్ రైల్వే

ప్రస్తుతం ఢిల్లీ మరియు ముంబాయ్‌ల మధ్య నడుస్తున్న రైళ్ల వేగం గంటకు 85 కిమీలుగా ఉంది. అయితే టాల్గో రైళ్లు ఇదే మార్గంలో సగటున 125 కిమీల వేగంతో నడుస్తాయి.

స్పానిష్ హై స్పీడ్ టాల్గో రైళ్లను పరీక్షించిన ఇండియన్ రైల్వే

ఢిల్లీ మరియు ముంబాయ్‌ల మధ్య ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం 17 నుండి 12 గంటలకు తగ్గుతుంది. అలాగే సాధారణ రైళ్లు వినియోగించే శక్తితో పోల్చుకుంటే టాల్గో రైళ్లు 30 శాతం వరకు తక్కువ శక్తిని వినియోగించుకుంటాయి.

స్పానిష్ హై స్పీడ్ టాల్గో రైళ్లను పరీక్షించిన ఇండియన్ రైల్వే

భారతదేశపు మొదటి సెమి హై స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్

రైలు ప్రయాణం ఎంతో సరదా...కాని రైలు నడిపే వారికి అదో నరకం..!!

Most Read Articles

Read more on: #రైలు #rail
English summary
Indian Railways Test Spanish High Speed Talgo Train
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X