వీడియో: తలపై పల్సర్ బైక్‌తో బస్సు పైకెక్కిన ఇండియన్

By Ravi

మనదేశంలో మనకు తెలియని వింతలు చాలానే జరుగుతుంటాయి. అలాంటి వింతలను కెమెరాల్లో బంధించి, సోషల్ మీడియాల ద్వారా మనకు అందించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు ఔత్సాహికులు. అలాంటి ఓ ఔత్సాహికుడి కెమెరాకు చిక్కిన ఈ వీడియోని చూడండి.

ఇది కూడా చదవండి: భారతదేశంలో కెల్లా అత్యంత పొడవైన రోడ్లు

ఇందులో ఓ వ్యక్తి దాదాపు 150 కేజీల బరువు ఉండే బజాజ్ పల్సర్ బైక్‌ను తలపై పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ, నిచ్చెన సాయంతో ఆ బైక్‌ను బస్సుపైకి మోసుకెళ్లాడు. ఇదేదో స్టంట్ కోసం లేక గిన్నిస్ రికార్డు కోసమో అతను ఈ ప్రయత్నం చేయలేదు. పొట్టకూటి కోసం చేశాడు.

మనం 20 కేజీల బరువును తలపై పెట్టుకుని కాస్తంత దూరం నడిస్తే కుయ్యో మొర్రో అంటాం. అలాంటి అతను ఏకంగా 150 కేజీల బరువున్న బైక్‌ను ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తలపై బ్యాలెన్స్ చేసుకుంటూ నిచ్చెన ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇండియన్ సూపర్‌మ్యాన్ అంటూ ఇప్పటికే ఈ వీడియోని అనేక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు. మరి మీరు కూడా ఆ వీడియోని చూసేయండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/HlVLb7OnheE?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

Read in English: Video Of The Day!
English summary
India is full of surprises even in the modern world and today we have found the ‘Indian Superman'. Well no, he cannot fly and yes he may have superhuman power. We believe, this Indian has the strongest back and neck in the world. Check the video below and lets us know what you think of India's Superman.&#13;
Story first published: Thursday, July 17, 2014, 17:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X