ట్రయల్‌ రన్‌కు సిద్దమైన భారత దేశపు తొలి సోలార్ రైలు

By Anil

ప్రపంచ వ్యాప్తంగా నాలుగవ అతి పెద్ద రైల్వే సామ్రాజ్యాన్ని కలిగి ఉంది ఇండియన్ రైల్వే. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇండియన్ రైల్వేలో చాలా వరకు కొత్త సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో అత్యంత వేగంగా పరుగులు పెట్టే గతిమాన్ ఎక్స్‌ప్రెస్ మరియు దేశానికి మొదటిసారిగా పరిచయం కానున్న బుల్లెట్ రైలు వంటి ఎన్నో ప్రాజెక్టులు కొత్తగా రూపు దిద్దుకుంటున్నాయి. అయితే భారత దేశపు మొదటి సోలార్ రైలుకు శ్రీకారం చుట్టింది ఇండియన్ రైల్వే. దీనికి గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో....

భారత దేశపు తొలి సోలార్ రైలు

ఇండియన్ రైల్వే ఈ మొదటి సోలార్ రైలును రాజస్థాన్‌లోని జోద్‌పూర్ నుండి మొదటి సారిగా ప్రయోగించి పరీక్షించనున్నారు.

భారత దేశపు తొలి సోలార్ రైలు

ఈ సోలార్ రైలును 2016 మే చివరిలోపు ఇండియన్ రైల్వే పరీక్షించనుంది.

భారత దేశపు తొలి సోలార్ రైలు

ఈ మొత్తం రైలును కన్వెషనల్ డీజల్ ఇంజన్‌ ద్వారా నడుస్తుంది. అయితే సోలారా ఫలకల ద్వారా ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌ను రైలులోని లైటింగ్ వ్యవస్థ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల అవసరానికి వినియోగించనున్నారు.

భారత దేశపు తొలి సోలార్ రైలు

ఈ రైలులోని మొత్తం భోగీలకు పై భాగాన సోలార్ ఫలకలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆయా బోగీలలోని ఫ్యాన్లు మరియు లైటింగ్ వంటి ఇతర అవసరాలకు వినియోగించనున్నారు.

భారత దేశపు తొలి సోలార్ రైలు

2020 నాటికి సోలార్ ప్లేట్లను వినియోగించి సుమారుగా 1,000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండియన్ రైల్వే తెలిపింది.

భారత దేశపు తొలి సోలార్ రైలు

ప్రస్తుతం డీజల్ రైలింజన్లు ఏడాదికి 90,000 లీటర్లను వినియోగించుకుంటున్నాయి. ఇలా డీజల్‌కు బదులుగా సిఎన్‌జి, బయో డీజల్ మరియు సహజ వాయువులను వినియోగం పెంచుతున్నట్లు తెలిపారు.

భారత దేశపు తొలి సోలార్ రైలు

ప్రపంచ వ్యాప్తంగా అత్యంధికంగా కాలుష్యం అవుతున్న నగరాలలో భారత దేశానికి చెందిన ప్రధాన నగరాలు ఇందులో ఉన్నాయి. అందుకోసం కార్బన్ మోనాక్సైడ్ వాయువును ఎక్కువగా విడుదల చేస్తున్న రైళ్ల స్థానంలో కాలుష్యం రహిత రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

భారత దేశపు తొలి సోలార్ రైలు

ప్రస్తుతం ఇండియన్ రైల్వే సిఎన్‌జి గ్యాస్ ద్వారా నడిచే రైళ్లు కూడా ఉన్నాయి. అందులో ఢిల్లీ రైల్వే డివిజన్‌లో ఉన్న రోహ్‌తక్-రివారీ మార్గంలో ఈ రైళ్లు ఉన్నాయి. ఇవి సిఎన్‌జి మరియు డీజల్ రెండింటిని కూడా వినియోగించుకుంటాయి.

భారత దేశపు తొలి సోలార్ రైలు

సోలార్ ఫలకలను అన్ని ప్యాసింజర్ రైళ్లలో అమర్ఛడం సాధ్యం కాదు. అందుకోసం జోధ్ పూర్ నగరంలో ప్యాసింజర్ రైల్లో ప్రయోగించిన తరువాత సాధ్యసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని కథనాల కోసం....

రైలు ప్రయాణం ఎంతో సరదా...కాని రైలు నడిపే వారికి అదో నరకం..!!

మరిన్ని కథనాల కోసం....

సముద్రగర్బంలో పరుగులుపెట్టనున్న భారతీయ మొదటి బుల్లెట్ రైలు

Most Read Articles

Read more on: #రైలు #rail
English summary
India Is All Set To Conduct Trial Run Of Its First Solar Powered Train
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X