భారతదేశంలో కెల్లా అతిపొడవైన రైలు సొరంగ మార్గం

By Ravi

భారతదేశంలో కెల్లా అతిపొడవైన సొరంగ రైలు మార్గాన్ని మనదేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపిఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీలు ప్రారంభించారు. ఈ పొడవైన రైలు సొరంగ మార్గం కాష్మీర్‌‌లోని క్వాజి గండ్ నుంచి జమ్మూలోని బనిహల్ ప్రాంతాలను కలుపుతుంది. ఈ సొరంగ మార్గం పేరు పిర్ పంజాల్ టన్నల్. దీని మొత్తం పొడవు 17.7 కిలోమీటర్లు. అందుకే, ఇది దేశంలో కెల్లా అతిపొడవైన సొరంగ రైలు మార్గంగా రికార్డు సంపాధించుకుంది.

భారతీయ రైల్వే చరిత్రలో ఇదొక మైలురాయిగా మిగిలిపోనుంది. జూన్ 26, 2013న జరిగిన ఈ టన్నల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఇదివరకు ఈ టన్నల్ లేనప్పుడు క్వాజిగండ్ చేరుకునేందుకు 35 కిలోమీటర్లు చుట్టు చుట్టి రావల్సి వచ్చేది. కాగా ఈ టన్నల్ ఏర్పాటుతో ఆ దూరం కాస్తా తగ్గింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇర్కాన్ ఇంటర్నేషల్ లిమిటెడ్ ఈ సొరంగ రైలు మార్గ నిర్మాణ పనులను చేపట్టింది.

భారత్‌లో కెల్లా పొడవైన రైలు సొరంగ మార్గం

సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మాణ పనులు చేస్తున్న ఇర్కాన్ ఇంటర్నేషల్ సంస్థ.

భారత్‌లో కెల్లా పొడవైన రైలు సొరంగ మార్గం

ఈ పొడవైన రైలు సొరంగ మార్గం కాష్మీర్‌‌లోని క్వాజిగండ్ నుంచి జమ్మూలోని బనిహల్ ప్రాంతాలను కలుపుతుంది. ఈ సొరంగ మార్గం పేరు పిర్ పంజాల్ టన్నల్.

భారత్‌లో కెల్లా పొడవైన రైలు సొరంగ మార్గం

ట్రైనులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న భారతదేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.

భారత్‌లో కెల్లా పొడవైన రైలు సొరంగ మార్గం

పిర్ పంజాల్ టన్నల్‌ను పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపిఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ మరియు పలువురు రాజకీయ ప్రముఖులు.

భారత్‌లో కెల్లా పొడవైన రైలు సొరంగ మార్గం

స్థానిక స్కూలు పిల్లలతో కలిసి రైలులో సొరంగం మార్గం ద్వారా ప్రయాణిస్తున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్.

భారత్‌లో కెల్లా పొడవైన రైలు సొరంగ మార్గం

కాశ్మీర్‌లోని క్వాజిగండ్ స్టేషన్ నుంచి సొరంగ రైలు మార్గం ద్వారా ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్న రైలు.

భారత్‌లో కెల్లా పొడవైన రైలు సొరంగ మార్గం

సొరంగ రైలు మార్గం గుండా ప్రయాణించి జమ్మూలోని బనిహల్ ప్రాంతానికి చేరుకుంటున్న రైలు.

భారత్‌లో కెల్లా పొడవైన రైలు సొరంగ మార్గం

రైల్వే స్టేషన్‌లో సందర్శకుల కోలాహలం.

భారత్‌లో కెల్లా పొడవైన రైలు సొరంగ మార్గం

పిర్ పంజాల్ టన్నల్ మొత్తం పొడవు 17.7 కిలోమీటర్లు. అందుకే, ఇది దేశంలో కెల్లా అతిపొడవైన సొరంగ రైలు మార్గంగా రికార్డు సంపాధించుకుంది.

Most Read Articles

English summary
The Prime Minister Dr. Manmohan Singh dedicated the newly constructed railway line between Banihal (Jammu region)-Qazigund (Kashmir valley) section to the nation by flagging off the first DEMU train from Banihal through the Pir Panjal tunnel- the longest transportation tunnel of India, from Banihal Railway station in Jammu & Kashmir.
Story first published: Friday, June 28, 2013, 17:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X