ఇండియాలో కూడా అత్యంత పొడవైన సొరంగ మార్గం ఉందని గర్వంగా చెప్పుకోండి

Written By:

మన దేశంలో అత్యంత పొడవైన రహదారి సొరంగ మార్గం(India's Longest Road Tunnel) ఉందని చెప్పుకునే రీతిలో జమ్మూ కాశ్మీరులోని చెనాని మరియు నాశ్రి ప్రాంతాల మధ్య నిర్మించిన భారత దేశపు అత్యంత పొడవైన రహదారి సొరంగ మార్గం(రోడ్ టన్నెల్)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ రోడ్ టన్నెల్ గురించి మరిన్ని వివరాలు....

జమ్మూకాశ్మీరులోని చెనాని మరియు నాశ్రి ప్రాంతాల మధ్య నిర్మించిన ఈ రోడ్ టన్నెల్ తొమ్మిది కిలోమీటర్ల మేర ఉంది. ఇది దేశీయంగా అత్యంత పొడవైన రోడ్ టన్నెల్ మాత్రమే కాకుండా ఆసియాలోని అత్యంత పొడవైన ద్వి దిశాత్మక(bi-directional) టన్నెల్‌గా నిలిచింది.

ఈ రోడ్ టన్నెల్‌ను రూ. 3,720 కోట్ల రుపాయలు వెచ్చించి నిర్మించారు. తొమ్మిది కిలోమీటర్ల మేర రెండు వైపులా(టు వే) సమాంతరంగా రహదారిని నిర్మించారు.

ప్రధాన సొరంగ మార్గానికి ఆనుకుని అత్యవసర సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఈ రెండింటిని 29 చిన్న చిన్న మార్గాలతో అనుసంధానించారు. ప్రధాన సొరంగ మార్గంలో ప్రయాణించేటపుడు అత్యవసరంగా పారిపోయేందుకు ప్రక్కనే ఉన్న అత్యవసర సొరంగ మార్గాన్ని ఉపయోగించుకోవచ్చు.

సొరంగ మార్గానికి ఇరువైపులా జాతీయ రహదారిని చేరేందుకు పెద్ద వంతెనలు నిర్మించారు. ఇరువైపులా టోల్ బూత్‌లను కూడా ఏర్పాటు చేశారు. వాహనాల ఎత్తు 5-మీటర్లకు మించకుండా ఉండేందుకు టోల్ బూత్‌ల వద్ద ప్రత్యేక సెన్సార్లను అమర్చడం జరిగింది.

ఈ నూతన సొరంగ మార్గం యొక్క ఎత్తు 1,200 మీటర్లు (3,937 అడుగులు)గా ఉంది. శ్రీనగర్ మరియు జమ్మూల మధ్య నిర్మించిన చెనాని-నాశ్రి సొరంగం మార్గం ద్వారా ప్రయాణం సమయం సుమారుగా 2 గంటలకు పైగా తగ్గింది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని కఠినమైన 40 కిలోమీటర్ల రహదారిలో ప్రయాణించాల్సిన అవసరం కూడా దీంతో తీరిపోయింది.

జమ్మూ-శ్రీనగర్ మార్గంలో ప్రయాణ సమయం మరియు దూరం తగ్గిపోవడం ద్వారా ఇంధన వినియోగం భారీ తగ్గపోనుంది. ఈ మార్గంలో రాకపోకలు ప్రారంభించడం ద్వారా రోజుకు సుమారుగా రూ. 27 లక్షల విలువైన ఇంధన ఆదా జరుగుతుందని అధికారులు అంచనా వేశారు.

నార్వేలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి టన్నెల్(పైన ఉన్న ఫోటో) పొడవు 24.51 కిలోమీటర్లలో దాదాపు సగ భాగం ఉంది ఈ భారతదేశపు అత్యంత పొడవైన రహదారి సొరంగ మార్గం.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
PM Modi Inaugurates India's Longest Road Tunnel. important details about india's longest road tunnel in telugu.
Please Wait while comments are loading...

Latest Photos