రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసిన అధికారులు

By Anil

రెండు చేతులు లేని భారత వ్యక్తికి భారత ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసింది. అవును మీరు చదివింది నిజమే, సినిమాలో విధంగా కళ్లు, కాళ్లు లేని వ్యక్తికి లైసెన్స్ మంజూరు చేసినట్లుగా కాదు. స్వయంగా సంభందిత అధికారులు అతన్ని పరీక్షించి మరి లైసెన్స్ కల్పించారు.

రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి విక్రమ్ అగ్నిహోత్రి రవాణా అధికారుల నుండి శాస్వత డ్రైవింగ్ లైసన్స్ పొందాడు.

రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

రెండు చేతులు లేనప్పటికీ రెండు కాళ్లతో కారును నడిపి అధికారులను మరియు అందరినీ అబ్బురపరిచాడు. కాళ్లు లేకుండా అధికారికంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి వ్యక్తి కూడా ఇతనే.

రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

కాళ్లు లేకుండా ఏలా సాధ్యం అనుకుంటున్నారా ? కుడి కాలుతో స్టీరింగ్ వీల్‌ను నియంత్రిచడం మరియు ఎడన కాలుతో యాక్సిలరేటర్ మరియు బ్రేకులను నియంత్రిస్తాడు.

రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

ఇక విక్రమ్ నడపడానికి ఎంచుకున్న కారులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు. తద్వారా గేర్లు మార్చాల్సిన అవసరం లేదు. వేగాన్ని బట్టి గేర్లు వాటంతట అవే మారుతాయి.

రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

ప్రస్తుతం విక్రమ్ అగ్రిహోత్రి స్వయంగా ఒక గ్యాస్ ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. మరియు ఎల్ఎల్‌బి కూడా చదువుతున్నాడు. మొదట్లో స్వయంగా డ్రైవింగ్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడేవాడిని. అయితే ఇప్పుడు కాస్త విముక్తి పొందినట్లు తెలిపాడు విక్రమ్.

రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

మొదట్లో ఇతరుల సహాయం లేనిదే కారులో ప్రయాణం చేసే వాడిని కాదని తెలిపాడు. ఇది దృష్టిలో ఉంచుకుని కఠోరంగా శ్రమ చేసి డ్రైవింగ్ నేర్చుకున్నాని తెలిపాడు విక్రమ్.

రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

డ్రైవింగ్ మీద పూర్తి స్థాయిలో పట్టు వచ్చిన అనంతరం శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం అక్టోబర్ 2015 లో ధరఖాస్తు చేసుకున్నాడు. అందుకోసం భారీ టెస్టింగ్ ట్రాక్ మీద కఠినమైన డ్రైవింగ్ పరీక్షకు సిద్దమయ్యాడు.

రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

అధికారుల సమక్షంలో డ్రైవింగ్ పరీక్ష పూర్తి చేసుకున్న అనతరం చేతులు ద్వారా సూచనలు ఇవ్వలేడనే నెపంతో అధికారులు అతనికి లైసెన్స్ మంజూరు చేయకుండా ధరఖాస్తుని తిరస్కరించారు.

రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

ధరఖాస్తు తిరస్కరణకు గురైనందున కలత చెందిన విక్రమ్ గ్వాలియర్ లోని రవాణా కమీషనర్‌ను కలిసి తన గురించి వివరించాడు.

రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

అగ్నిహొత్రి లైసెన్స్ పొందిన తరువాత నేర్చుకునే వారు పొందే లైసెన్స్‌తో సుమారుగా 14,500 కిలోమీటర్లు మేర ఇండోర్‌లో కారును నడిపాడు.

రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

పూర్తి స్థాయిలో శాస్విత డ్రైవింగ్ లైసెన్స్ పొందిన విక్రమ్ అగ్నిహోత్రి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఉన్న లేహ్ ప్రాంతానికి స్వయంగా కారును నడపనున్నాడు.

రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

రెండు చేతులు లేకుండా అద్భుతంగా కారును నడుపుతున్న విక్రమ్ ఇంత వరకు ఒక చిన్న పొరబాటు కూడా చేయలేదట. అన్ని అవయవాలు బాగున్నా ప్రమాదాలు చేసే వారికి విక్రమ్ కథ గుణపాఠం కావాలి.

రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

  • ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఎలా?
  • భారత దేశపు డ్రైవింగ్ లైసెన్స్‌కు ఎన్ని దేశాలలో డ్రైవింగ్ అనుమతి ఉందో తెలుసా ?
  • రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

    • విదేశాల్లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహనాలు నడిపితే ఇవి పాటించండి
    • ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ చేయవచ్చు

Most Read Articles

English summary
Read In Telugu: Indore Man Without Arms Gets Driving Licence
Story first published: Thursday, October 6, 2016, 16:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X