మిలిటరీ రైళ్ల గురించి.. మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..!!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలు తమ మిలిటరీ అవసరాలకు ప్రత్యేకంగా సాయుధ రైళ్లను ఏర్పాటు చేసుకున్నాయి. సాయుధ రైళ్ల గురించి పూర్తి సమాచారం నేటి కథనంలో వివరంగా.

By N Kumar

యుద్దంలో శత్రువుల మీద ప్రతి దాడులు నిర్వహించేందుకు యుద్ద ట్యాంకులను, కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్‌లను, యుద్ద నౌకలను వినియోగిస్తారని మనందరకీ తెలుసు. అయితే రైలు ద్వారా యుద్దంలో దాడులను నిర్వహిస్తున్నారు. వీటినే సాయుధ రైళ్లు అంటారు. యుద్దంలో సాయుధ రైళ్ల వినియోగం మరో కోణం.

గతంలో చాలా దేశాలు, పైన తెలిపిన విభిన్న యుద్ద వాహనాలతో పాటు సాయుధ రైళ్లను కూడా వినియోగించాయి. యుద్ద క్షేత్రంలో నిర్మించిన రైలు పట్టాల మీద ఈ సాయుధ రైళ్ల నుండి దాడులు చేయవచ్చు. నేటి కథనంలో ఈ సాయుధ రైళ్ల గురించి ఆసక్తికరమైన సమాచారం...

సాయుధ రైళ్లు

1861-1865 మధ్య కాలంలో జరిగిన అమెరికా అతర్యుద్దంలో ఈ సాయుధ రైళ్లను వినియోగించారు. మరియు 1870-1871 కాలంలో జరిగిన ప్రస్తుతం జర్మనీలో ఉన్న ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ద కాలంలో కూడా ఈ సాయుధ రైళ్లను ఉపయోగించారు.

సాయుధ రైళ్లు

మెక్సికోలో మొదలైన విప్లవాన్ని అదుపులోకి తేవడానికి, మొదటి ప్రపంచ యుద్దం, రెండవ ప్రపంచ యుద్ద కాలంలో ఈ సాయుధ రైళ్లను విరివిగా వివియోగించారు. చివరగా 1990 లో జరిగిన యుగోస్లేవియా యుద్దం లో ఈ సాయుధ రైళ్లు ఆఖరిగా కనిపించాయి.

సాయుధ రైళ్లు

సాయుధ రైళు ముందుకు వెళుతున్న కొద్దీ బాంబు దాడులు, శత్రువుల మీదకు సరాసరి దాడులు, శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, ఇందులోని మెషీన్ గన్‌ల ద్వారా, ఫిరంగుల ద్వారా కాల్పులు జరపడం వంటి అనేక దాడులకు ఈ సాయుధ రైళ్లు ఉపయోగపడేవి.

సాయుధ రైళ్లు

వైమానిక తుపాకులు, మెషీన్ గన్‌లను ఈ సాయుధ రైలు పై భాగంలో నిర్మించారు. అన్నింటికంటే ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి బలగాలను భద్రంగా తరలించడానికి ఈ రైళ్లను అధికంగా వినియోగించేవారు.

సాయుధ రైళ్లు

అతి కొద్ది సాయుధ రైళ్ల మీద మాత్రమే సాయుధ ఫిరంగులను అమర్చే వారు. వీటిని ప్రత్యేకించి దేశాల యొక్క సరిహద్దు ప్రాంతాల్లో వినియోగించే వారు.

సాయుధ రైళ్లు

19 వ శతాబ్దంలో చివరిలో మరియు 20 వ శతాబ్దం ప్రారంభంలో విరివిగా వినియోగంలో వచ్చిన సాయుధ రైళ్లలో ఆవిరి ఇంజన్‌లు ఉండేవి. మిస్సైల్స్, బాంబుల ద్వారా బారీ స్థాయిలో నష్టాన్ని కలిగించడానికి ప్రత్యేకమైన పరిజ్ఞాన్ని ఇందులో వినియోగించారు.

సాయుధ రైళ్లు

శత్రువులు రైలింజన్ ముందు వైపున దాడులకు తెగబడకుండా ఉండేందుకు విభిన్నమైన నిర్మాణం కలదు. ఇక రైలుకు ఇరు వైపులా తుపాకుల గొట్టాలను బయటకు పెట్టి కాల్పులు జరపడానికి మరియు రైలు మధ్యలో నుండి పై భాగం ద్వారా మిస్సైల్ల దాడులు జరపడానికి వీలుగా ప్రత్యేక నిర్మాణం చేపట్టారు.

సాయుధ రైళ్లు

రైలు అంతర్భాగంలో ఇంజన్ భాగం మినహా భారీ మొత్తంలో ఆయుధ సామాగ్రిని భద్రపరుచుకునే విధంగా నిర్మాణం చేపట్టారు. మెషీన్‌ గనులను అమర్చి ఉండే రైలు పెట్టెల్లోనే భద్రతా బలగాలను తరలించేవారు.

సాయుధ రైళ్లు

కొన్ని ప్రత్యేకమైన సాయుధ రైళ్లలో విమానాల నుండి జరిపే మిస్సైళ్ల దాడులను తిపికొట్టే పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు. మరియు భారీ యుద్ద క్షేత్రంలో బలగాలను నిర్దేశించడానికి వీటిని ఎక్కువగా వినియోగించే వారు.

సాయుధ రైళ్లు

ఆర్మీ రైళ్లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా అతి తక్కువ సమయంలోనే యుద్దాన్ని అదుపులోకి తీసుకురావచ్చు. అయితే కొన్ని సందర్బాల్లో శత్రువులు ఈ సాయుధ రైలు నడిచే పట్టాలను ధ్వంసం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి.

సాయుధ రైళ్లు

కేవలం ప్రత్యక్షంగా దాడులు చేయడానికి మరియు సాయుధ బలగాలను తరలించాడనికి మాత్రమే కాదు. మిస్సైళ్లను, బాంబులను మరియు అనేక యుద్ద సామాగ్రితో పాటు యుద్ద వాహనాలను తరలించేందుకు వీలుగా ఉండేట్లు ఈ సాయుధ రైళ్లను నిర్మాణం జరుగుతుంది.

సాయుధ రైళ్లు

ఈ సాయుధ రైళ్ల మీద శత్రువులు అంత సులభంగా దాడులు చేయలేరు. దీనికి సమాతారంగా గగన తలంలో శత్రువులు దాడులకు పాల్పడేందుకు సిద్దపడితే వారిని సులభంగా ఎదుర్కొని దాడులు నిర్వహించగలదు.

సాయుధ రైళ్లు

ఈ సాయుధ రైలు ద్వారా యుద్ద ట్యాంకులను మరియు యుద్ద వాహనాలను త్వరితగతిన నిర్దేశించిన ప్రదేశానికి అత్యంత సులభంగా తరలించవచ్చు.

Most Read Articles

English summary
Interesting Facts About Armoured Trains
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X